అనుకుని అరణ్యం అంతా తిరిగి మంచి పండ్లని సంచిలో వేసాడు
రెండో మంత్రి రాజుగారికి పండ్లు, ఫలాలకి రాజ్యంలో కొదవ లేదు
అని అనుకుని కంటికి కనిపించిన పండ్లని పుచ్చువి కుళ్ళిపోయినవి వచ్చినా చూసుకోకుండా సంచిలో వేసాడు
మూడో మంత్రి అసలు రాజుగారికి ఈ ఫలాలతో పని లేదు సంచి మొత్తం చూసే సమయం లేదు పై వరకూ చూస్తే చూస్తారని మొత్తం ఆకులు వేసి పై వరకూ పండ్లని పెట్టాడు.
సాయంత్రానికి ముగ్గురు మంత్రులు పండ్ల సంచులని తీసుకొచ్చి రాజుగారి ముందు పెట్టారు.
రాజు తన పనుల్లో తాను ఉంటూ ఆ సంచుల కూడా చూడలేదు.
సైనికుల్ని పిలిచి ఈ ముగ్గురిని నెలరోజుల వరకూ చెరసాలలో బందించండి.
తినడానికి ఏ ఆహారం ఇవ్వద్దు వాళ్ళు తెచ్చుకున్న పండ్లు వారికి ఆహారం అన్నాడు.
ముగ్గురిని చెరసాలలో పెట్టారు.
మొదటి మంత్రి తను తెచ్చిన పండ్లని తింటూ ఆకలి బాధ లేకుండా శిక్షా కాలం పూర్తి చేసి అస్థానానికి వచ్చాడు.
రెండో మంత్రి కొన్ని రోజులు బాగున్నా కుళ్ళిన వాడిపోయిన పండ్లు తినడం వల్ల తీవ్ర అనారోగ్యంపాలయి శాశ్వతంగా మంచాన పడ్డాడు.
మూడో మంత్రి పైన ఉన్న పండ్లు వరకూ తిని ఆకలికి తట్టుకోలేక ఆకులు తిని అరగక వారంలో మరణించాడు.
ఈ కథలో ఉన్న అర్ధం ఏమిటంటే మనం చేసే పనులకి తగిన ఫలితం లభిస్తుంది. మంచి కర్మలకు మంచి చెడు కర్మలకు చెడు పర్యవసానాలు తప్పవు.
వెయ్యి గోవుల మంద ఉన్నా దూడ తన తల్లి దగ్గరికి ఖచ్చితంగా ఎలా వెళ్ళగలదో అలానే మంచి చెడు కర్మలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి... 🙏🙏🙏
#కర్మ ఫలం 🌀 #కర్మ ఫలం 💔 #కర్మ ఫలం #కర్మఫలం 🙏 #⚜️🔱కర్మ సిద్ధాంతం 🧓


