ShareChat
click to see wallet page
search
*_𝕝𝕝ॐ𝕝𝕝 నవ బ్రహ్మలు 𝕝𝕝ॐ𝕝𝕝 *━❀ ꧁ 🔆 ꧂ ❀━* బ్రహ్మదేవుడు తొమ్మిది రూపాలలో భక్తులను అనుగ్రహిస్తున్నాడని ఐహీకం. ఈ నవ బ్రహ్మల రూపాలు 1. కుమార బ్రహ్మ 2. అర్క బ్రహ్మ ౩. వీర బ్రహ్మ 4. బాల బ్రహ్మ 5. స్వర్గ బ్రహ్మ 6. గరుడ బ్రహ్మ 7. విశ్వ బ్రహ్మ 8. పద్మ బ్రహ్మ 9. తారక బ్రహ్మ ఈ తొమ్మిది రూపాలతో, తొమ్మిది శివలింగాలను విడి విడిగా ఆలయాలలో ప్రతిష్టించి, బ్రహ్మ దేవుడు పూజించిన ఆలయాలు ఆంధ్రప్రదేశ్ లోని మెహబూబ్ నగర్ జిల్లా, అలంపూర్. ఇక్కడ యీ ఆలయాలు ఖ్యాతిగాంచినవి. 1. కుమార బ్రహ్మ: శ్రీ మహావిష్ణువు కి పుత్రుడైన బ్రహ్మదేవుడు సృష్టి కార్యాని విజయవంతంగా నిర్వహించడానికి ఇక్కడ తపస్సు చేసిన మూర్తి తెలుపుతుంది 2. అర్క బ్రహ్మదేవుడు : సూర్య మండలంలో నివసించే బ్రహ్మదేవుడు.పరమ శివుని పంచభూత రూపములలో ఒకటి అయిన సూర్య మండలంలో, యీ అర్క బ్రహ్మదేవుడు ఉన్నతంగా పూజింపబడుతున్నాడు. 3. వీర బ్రహ్మ రూపం: మూర్ఖులైన అసురులతో యుద్ధం చేసిన భంగిమని తెలియచేస్తున్నది. 4. బాల బ్రహ్మ రూపం: అత్రి, అనసూయ దంపతుల వద్ద బాలునిగా వున్న రూపం. 5. స్వర్గ బ్రహ్మ: యాగాలు చేసి ఉన్నతి పొందిన వారి స్వర్గ రక్షకుని రూపం. 6. గరుడ బ్రహ్మ: ఒకసారి పక్షి రూపంలో వున్న మునులకు, గరుడ పక్షి రూపంలో ఉపదేశంచేసినందున యీ పేరు వచ్చింది. 7. విశ్వ బ్రహ్మ రూపం: ఈ విశ్వాన్ని సృష్టించిన సమయంలో విశ్వబ్రహ్మ రూపం దాల్చాడు. 8. పద్మ బ్రహ్మ రూపం: శ్రీ మహావిష్ణువు నాభినుండి ఉద్భవించి పద్మంలో ఆశీనుడైనందున యీ పేరు వచ్చింది. 9. తారక బ్రహ్మ: తారక మంత్రానికి అధిదేవత అయినందున యీ పేరుతో పిలువబడుతున్నాడు. "ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి, తన్నో బ్రహ్మ ప్రచోదయాత్" #"భక్తి సమాచారం" #🙏🏻భక్తి కోట్స్📝 #🙏భక్తి స్పెషల్ #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
"భక్తి సమాచారం" - ShareChat