ShareChat
click to see wallet page
search
#ఎల్లో మీడియా.. 💥 #కొత్త (చెత్త) పలుకు.. 😁🤠 *నేపాల్ అల్లర్ల విశ్లేషణలోనూ… అదే యాంటీ- జగన్, అదే ఆవు వ్యాసం…❗* September 14, 2025✍️ ఈమధ్య… కాదు, చాన్నాళ్లుగా… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వ్యాసాలు ఆవుకథలు అవుతున్నాయి… ఈరోజూ అదే ధోరణి… తనలోని పాత్రికేయుడి పాత్రికేయ విజ్ఞత కనుమరుగవుతూ పక్కా జగన్ ద్వేషి మాత్రమే బలంగా ప్రదర్శితం అవుతున్నాడు… సోమాలియా ఆకలిచావులు, ఉక్రెయిన్ యుద్దం, అమెరికా డ్రగ్ కార్టెల్స్, పాలస్తీనా కష్టాలు దగ్గర నుంచి… ప్రపంచంలో ఏం జరిగినా… దాన్ని అర్జెంటుగా జగన్‌కు ముడివేసి ఏవో జగన్ వ్యతిరేక కథలు చెప్పడం అలవాటైపోయింది ఫాఫం… ఎస్, జగన్ పార్టీ అడ్డదిడ్డం విధానాలు, పాలన పోకడల మీద రాయాలి, రాయొద్దని ఎవరూ అనరు… పైగా తెలుగుదేశం అనుకూల మీడియా కాబట్టి, చంద్రబాబు అనుంగు శ్రేయోభిలాషులు గనుక వైసీపీ వ్యతిరేకత, జగన్ అంటే ద్వేషం సహజమే అనుకుందాం కాసేపు… కానీ చివరకు నేపాల్ జనం తిరుగుబాటును కూడా తీసుకొచ్చి జగన్ మెడకు చుట్టడం ఏమిటి..? జగన్ కారకుడని కాదు, ఏదేదో చెబుతూ… జగన్ కేసులు, చివరకు పాడిందే పాటరా అన్నట్టుగా వివేకా హత్య కేసు దాకా ఏదో చర్చించి, ఏదో చెప్పి… మళ్లీ మళ్లీ అదే ఉతుకుడు బాగోతం.,. జగన్ అవినీతి కేసులు, వివేకా హత్య కేసు విషయంలో జరుగుతున్న అసాధారణ జాప్యం న్యాయస్థానాల విశ్వసనీయతను దెబ్బ తీయడం లేదా..? ఇదుగో ఇలాంటివే జనంలో తీవ్ర ఆగ్రహానికి కారణం అవుతాయి అనేది అంతిమంగా రాధాకృష్ణ ముక్తాయింపు… తమ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పాదుకోవాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థలోని బాధ్యులపై లేదా? అని ప్రశ్నిస్తున్నాడు… ఇప్పటికిప్పుడు జగన్ తన అక్రమాస్తుల కేసులో దోషి అని తేలితే అప్పుడు కోర్టులపై జనంలో విశ్వాసం పెరిగి, వాటి క్రెడిబులిటీ పెరుగుతుందన్నమాట… అంతేనా సర్..? నేపాల్ మాత్రమే కాదు… శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ అల్లర్లు ఏదో ఒక కారణంతో అంటుకున్నవి కావు… అనేక కారణాల కలయిక, జనం కడుపులు మండుతున్నాయి… ఏదో ఒక ఇష్యూతో అవి బద్ధలవుతున్నాయి… ఇదే కారణం అని చెప్పడం, తేల్చేయడం, నిర్దారించడం కష్టం… విదేశీ హస్తాలనూ తోసిపుచ్చలేం… అయితే వాటిని తీసుకొచ్చి తన ప్రాంత నాయకుల మెడకు చుట్టేసి, ఆ అల్లర్లను కూడా ఇక్కడ తమ స్ట్రాటజిక్ పొలిటికల్ ప్రాపగాండాకు వాడుకోవడమే ఓ పాత్రికేయ విషాదం… అన్నట్టు, నేపాల్‌లో ఓ మీడియా హౌజును కూడా ఆందోళనకారులు తగులబెట్టారు… దానికి కారణమేమంటారు రాధాకృష్ణ సాబ్..? జస్ట్ ఆస్కింగ్.,.!!
ఎల్లో మీడియా.. 💥 - AKBAK AKBAK - ShareChat