ShareChat
click to see wallet page
search
తిరునామం..............!! కలియుగ ఏకైక దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోగానే మనకు మొదటగా కనపడేది శ్రీవారి ముఖారవిందం మీద పెద్దగా వెలసిన నామమే.! అంతటి విశిష్టత కలిగిన నామంలో రెండు రంగులు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. మొదట తెలుపు రంగుతో Y ఆకారంలో నుదుటి నుండి ముక్కు మీద వరకు పెద్దగా ఒక నామం పెడతారు. ఈ తెల్లటి నామాన్ని “తిరునామం” అంటారు. ‘తిరు’ అంటే పవిత్రమైన. ‘నామం’అంటే చూర్ణం అని అర్థాలున్నాయి. శ్రీవేంకటేశ్వర స్వామి తిరునామం కోసం వాడే పదార్థాన్ని కర్ణాటకలోని “మేలుకొట్టై” అనే దివ్యక్షేత్రం దగ్గర దొరికే ఒక రకమైన అభ్రకం నుండి తెస్తారు. ఈ ‘మేలుకొటే’ మైసూరుకు దగ్గరగా ఉంది. ఇక్కడ ప్రసిద్ధి పొందిన చలువ నారాయణస్వామి గుడి ఉన్నది. ఇక మధ్యలో చిన్నగా మనకు కనిపించే ఎర్రటి నామాన్ని “శ్రీచూర్ణం” అంటారు. ఈ ‘శ్రీచూర్ణం’ పసుపు, సున్నం కలిపి పెడతారుట. సంప్రదాయం ప్రకారం వైష్ణవంలో రెండు శాఖలు ఉన్నాయి. అవి ‘తెంగలై’, ‘వడగలై’ అని వ్యవహారంలో ఉన్నాయి. “తెంగలై” వారు నుదుటి నుండి ముక్కు వరకు వచ్చే తెల్లటి నామం పెడతారు. “వడగలై” వారు ఎర్రటి లేదా గంధపు రంగు గీత నామం పెడతారు. ఈ రెండూ కలిపి శ్రీవేంకటేశ్వర స్వామి నామం ఉంటుంది. ఈ నామంలో ఉండే రెండు తెలుపు గీతలు విష్ణువు పాదాలుగా, మధ్యలో ఉండే ఎర్రటి గీత లక్ష్మీ దేవిగా చెబుతారు. ఒక సంప్రదాయం ప్రకారం విష్ణుమూర్తీ,లక్ష్మీదేవీ విడివిడిగా ఉండరనీ, అందుకే స్వామి తెలుపుగా, లక్ష్మీదేవిగా ఎరుపు కలిసి ఉంటాయి. తిరుమలలో ప్రతి శుక్రవారం నాడు ఉదయం ‘అభిషేక సేవ’ అనంతరం స్వామికి నామాన్ని ధరింపజేస్తారు అర్చకస్వాములు. మళ్లీ శుక్రవారం వరకూ (వారం రోజులు) ఆ నామం అలానే ఉంటుంది. శుక్రవారం అభిషేక సేవకు ముందు దీన్ని తొలగిస్తారు. అందుకే శుక్రవారం అభిషేక సేవ, నిజపాద దర్శనానికి వెళ్లే భక్తులు నామం లేకుండా ఏడుకొండల స్వామిని దర్శించుకోవచ్చు. నామం ఎలా ధరింపజేయాలీ, ఏయే ద్రవ్యాలను కలిపి పెట్టాలీ, పెట్టే సమయంలో ఏయే మంత్రాలను పఠించాలీ” అనే విషయం “పరాశర స్మృతి” అనే గ్రంథంలో విపులంగా వివరణలున్నాయి. వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన! వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి!! ఓం నమో వెంకటేశాయ..!! #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా #🌺💙💞శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశాయ గోవిందా💞💙🥰🌺 గోవిందా హరి గోవిందా 🥰 #ఏడుకొండలవాడా, వెంకటరమణ, శ్రీనివాస, ఆపదమొక్కులవాడ, గోవిందా గోవింద, గోవిందా గోవిందా, గోవిందా గోవిందా #ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా శ్రీ శ్రీనివాస శ్రీనివాస గోవిందా గోవిందా
🙏శ్రీ వెంకటేశ్వర స్వామి - 0 0 - ShareChat