ఎక్కడో ఉండే పుణ్యక్షేత్రాలను
దర్శించుకోవడానికి ఖరీదైన ప్రయాణం చేసి
VIP దర్శనం పేరుతో
స్వామి వారిని దగ్గర దర్శనం చేసుకొని..
పుణ్య యాగాలు పూజలు చేయడం స్వామి వారిని అలా దర్శించుకోవడం నిజంగా ఓ అదృష్టం అలా దర్శన భాగ్యం కలగాలి అంటే పెట్టు పుట్టాలి అనుకునే వాడిని ...
కానీ నిన్న నేను శివాలయం కు వెళ్లి వస్తుంటే...
ఒకతను ఒత్తులు వెలిగించడానికి వస్తూ ఎదురయ్యాడు....
నిజంగా అతనిని చూసి ఆశ్చర్యమేసింది
అతనికి అంగవైకల్యం కాస్త...
పొడవాటి చొక్కా పాయింట్ వేసుకొని ఉన్నాడు
{ఆయన రూపాన్ని మీకు తెలియాలి అని మాత్రమే చెప్తున్నా..}
చొక్కా వెనుక భాగం కాస్త చిరిగిపోయి ఉంది
కానీ అతను మంచిగా స్నానం చేసి తనతో తన కొడుకు నీ కూడా వెంట తెచ్చుకున్నాడు
కొడుకు ఓ మామూలు బట్టలు వేసుకొని ఉన్నాడు కానీ చాలా నీట్ గా తల దువ్వుకొని కనిపించాడు
అతన్ని చూసినప్పుడు నాకు అనిపించింది
స్పెషల్ దర్శనాలు, పట్టు వస్త్రాలు, VIP పూజలు ఇవ్వని ఆర్దికంగా బాగా ఉండబట్టి చేయగలుతున్నారు ...
కానీ ఇతను ఎం లేకున్నా ఓ కాలు అంగవైకల్యం అయినా తనకు ఉన్న దాంట్లో దేవుడు కి పూజ చేయగలగడం మే నిజమైనఅనిపించింది...
అక్కడ అంత మందిలో {నాతో సహా} అతనే నిజమైన భక్తుడు లా కనిపించాడు...
చివరిగా భక్తి లో కూడా ఈ మధ్య హోద చూపించడం ఎక్కువైపోతున్న రోజుల్లో ఇలాంటి భక్తులు ఉండటం నిజంగా గొప్ప విషయం...🙏
#💗నా మనస్సు లోని మాట #devotion #భక్తి #భక్తి #bhakti


