ShareChat
click to see wallet page
search
#P P P #ఏపీ అప్ డేట్స్..📖 #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ *పులివెందులకు బాబు సర్కార్ రిటర్న్ గిఫ్ట్❗* SEPTEMBER 5, 2025🎯 స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పాన్ని వైసీపీ క్లీన్ స్వీప్ చేసినందుకు, రిటర్న్ గిఫ్ట్ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు సాధించి ఇస్తామని టీడీపీ, బీజేపీ నాయకులు గొప్పగా చెప్పారు. చెప్పినట్టే జరిగింది. ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు. పులివెందులలో వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా చేశామని చంద్రబాబు దంపతులు, మంత్రులు నారా లోకేశ్, సవిత, అలాగే కడప జిల్లా నాయకులు సంబరాలు చేసుకున్నారు. బాబుకు పులివెందుల జెడ్పీటీసీ గెలుపును గిఫ్ట్ ఇచ్చామని టీడీపీ, బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. ఇంత వరకూ అంతా బాగుంది. మరి పులివెందులకు చంద్రబాబు సర్కార్ రిటర్న్ గిఫ్ట్ ఏం ఇచ్చిందో తెలుసుకుందాం. ఇదే పులివెందుల రూరల్ పరిధిలో వైఎస్ జగన్ హయాంలో అద్భుతమైన వైద్య కళాశాల, ఆస్పత్రిని నిర్మించారు. వైద్య కళాశాలలో అడ్మిషన్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. కానీ ప్రభుత్వ మనసులో వేరే ఆలోచనలు వుండడంతో అనుమతుల్ని కూడా వద్దని లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పులివెందులతో పాటు మరో తొమ్మిది మెడికల్ కళాశాలల్ని పీపీపీ విధానంలో నడపాలని బాబు కేబినెట్ తీర్మానించింది. మొదటి విడతలో పులివెందుల మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు నిర్ణయించడం గమనార్హం. ప్రభుత్వ నేతృత్వంలో నడపాల్సిన పులివెందుల మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే, వైద్య విద్యను, అలాగే ప్రజారోగ్యాన్ని మరింత భారం చేయడం తప్ప, మరొకటి కానేకాదనే విమర్శ వెల్లువెత్తుతోంది. మరీ ముఖ్యంగా పులివెందులలో గత ఏడాదిలోనే మెడికల్ కళాశాలను ప్రారంభించాల్సి వుండగా, కేవలం వ్యాపారం కోసం జాప్యం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. వైఎస్సార్ కడప జిల్లా టీడీపీ, బీజేపీ నాయకులు పులివెందుల జెడ్పీటీసీని బాబుకు గిఫ్ట్ ఇస్తే, ప్రభుత్వం మాత్రం రిటర్న్ గిఫ్ట్ అక్కడి వైద్య కళాశాలను ప్రైవేట్పరం చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రజలే ఆలోచించాలి.
P P P - ప్రుత్వ వైద్య కళాశాల  [೩ಎನಿ 05' ದall MENT MEDICAL COLLEGE ೭ 2~566 పురివందున Olntc?' a ప్రుత్వ వైద్య కళాశాల  [೩ಎನಿ 05' ದall MENT MEDICAL COLLEGE ೭ 2~566 పురివందున Olntc?' a - ShareChat