ShareChat
click to see wallet page
search
* #🇮🇳💖💜 స్మృతి మందాన ❤💙💚 పెళ్లికి ఈ విఘ్నాల వెనుక అసలు మర్మమేమిటో..⁉️* November 25, 2025🏏 నిప్పు లేనిదే పొగరాదు… కానీ కొన్నిసార్లు నిప్పు లేకుండా కూడా పొగరావచ్చు… అసలు నిజం ఏదో తెలిసేవరకూ నిప్పు కనిపించదు, పొగ మాత్రమే కనిపిస్తుంది… ఎస్, స్మృతి మంధానా పెళ్లి వ్యవహారం గురించే… తను ఇండియన్ వుమెన్ జట్టు స్టార్ క్రికెటర్… అందంగా ఉంటుంది… కోట్లకుకోట్ల బ్రాండ్ వాల్యూ ఆమెది… ఆమెకూ పలాష్ ముచ్చల్‌కూ నడుమ ప్రేమ కొన్నాళ్లుగా… పలాష్ ఎవరో కాదు, ప్రముఖ బాలీవుడ్ గాయని పలాక్ ముచ్ఛల్ సోదరుడే… (పలాక్ సమాజసేవిక కూడా..) తను గాయకుడు, సంగీత దర్శకుడు, పిన్న వయస్కుడైన సంగీత దర్శకుడిగా తన పేరు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఉంది… చిత్ర నిర్మాత కూడా..! సరే, ఎక్కడో కలిశారు, ప్రేమలో పడ్డారు… అది పెళ్లి దాకా ప్రయాణించింది… పలాష్‌ది ఇండోర్… ఉండేది ముంబైలోనే… ఇద్దరూ… వాళ్ల ప్రేమను పెద్దలూ అంగీకరించారు… పెళ్లి ఫిక్స్ చేశారు… ఎంగేజ్‌మెంట్, హల్దీ ఎట్సెట్రా వేడుకగా జరిగాయి… ఆమె కో-క్రికెటర్లు హాజరై సంబురంగా హంగామా చేశారు… అైసలే వరల్డ్ కప్ విజయం తాలూకు ఆనందంలో ఉన్నారు అందరూ… పెళ్లి మహారాష్ట్రలోని ఆమె స్వస్థలం సాంగ్లీలో ప్లాన్ చేశారు… సీన్ కట్ చేస్తే… హఠాత్తుగా స్మృతి తండ్రి హార్ట్ ఎటాక్ లక్షణాలతో హాస్పిటల్ చేరాడు… లక్షణాలే… దాంతో ఆమె పెళ్లిని వాయిదా వేయించింది… సహజం… తండ్రి చావుబతుకుల్లో హాస్పిటల్‌లో ఉంటే పెళ్లి వేడుకలు చేసుకోలేదు కదా… ఇక్కడ విశేషం ఏమిటంటే…? పలాష్ ముచ్చల్ కూడా హాస్పిటల్ పాలయ్యాడు… ఎసిడిటీ, ఒత్తిడి అని ఏవో కారణాలు చెప్పారు… తరువాత నాలుగైదు గంటలకు డిశ్ఛార్జ్ చేశారు… కానీ స్మృతి తన ప్రి-వెడ్ ఫోటోలు, వీడియోలన్నీ డిలిట్ చేసింది సోషల్ మీడియాలో… తనే కాదు… జెమీమ్ రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్ తదితరులు కూడా తాము షూట్ చేసిన వీడియోలు, ఫోటోలు కూడా తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలిట్ కొట్టారు… ప్రస్తుతం సోషల్ మీడియాలో స్మృతి పెళ్లి, ప్రివెడ్, హల్దీ బాపతు ఫోటోలు, వీడియోలన్నీ డిలిట్ అయిపోయాయి… ఉంటే తప్పేముంది..? ఇక్కడే ఏదో తేడా కొడుతోంది… నో, నో, స్మృతి తండ్రి పలాష్‌కు కూడా బాగా సన్నిహితుడనీ, అందుకే ఒత్తిడి భరించలేక హాస్పిటల్ పాలయ్యాడు అని తన కుటుంబసభ్యులు ఏదో వివరణలు జారీ చేస్తున్నారు… కానీ తను మరోసారి ఈరోజు హాస్పిటల్‌లో చేరాడు… ఏం జరుగుతోంది..? బయటకు చెప్పబడని ఏదో మర్మం ఉంది అని మీడియా, సోషల్ మీడియా రాస్తోంది… సందేహాలు సహజమే… ఇంతకీ ఏమైంది స్మృతీ..? పోనీ, జెమీమ్ నువ్వయినా చెప్పమ్మా..!!
🇮🇳💖💜 స్మృతి మందాన ❤💙💚 - 9T৫#| A1 p Ass LAযTER 9T৫#| A1 p Ass LAযTER - ShareChat