ShareChat
click to see wallet page
search
కరుడుగట్టిన వామపక్షవాది,సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి గారు ఇకలేరు! ( 22 - 8 - 2025)! లేదా సీబీఐ పార్టీ అభ్యున్నతికి తన యావత్ జీవితాన్ని అంకితం చేసిన సురవరం సుధాకర్ రెడ్డి గారు దివికేగిన వైనం సీపీఐ పార్టీకే గాక,రెండు తెలుగు రాష్ట్రాలకు,వామపక్ష ఉద్యమానికి సైతం తీరనిలోటు! కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)అగ్రనేత, కరుడుగట్టిన వామపక్షవాది,మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి గారు దివికేగిన వైనం,ఆయన శాశ్వత నిష్క్రమణ సీపీఐ పార్టీకే గాక,రెండు తెలుగు రాష్ట్రాలకు,ముఖ్యంగా వామపక్ష ఉద్యమానికి ఓ తీరనిలోటు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సురవరం సుధాకర్ రెడ్డి గారు ప్రముఖ వామపక్షనేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాదు,సీపీఐ పార్టీకి సంబంధించి ఏ పదవిలో వున్న అయా పదవులకు వన్నె తేవడమే కాదు,తనదైన ఒక ప్రత్యేక ముద్ర వేయగలిగిన సమర్థుడు,ఈ రాజకీయ రణక్షేత్రంలో సీపీఐ పార్టీ అభ్యున్నతికి యావత్ తన జీవితాన్నే అంకితం చేసిన ఓ కాకలుదీరిన యోధుడు ఈ సురవరం సుధాకర్ రెడ్డి గారు.అంతేకాదు 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచగా,దీనిపై వామపక్షాలు పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించాయి.ఈ ఆందోళనల్లో సురవరం గారు కీలక పాత్ర పోషించారు.ఎంపీగా పార్లమెంటులో కార్మికులు, రైతులు,కూలీలు,పేదల సమస్యపై గళమెత్తాయి. వ్యవసాయ సంక్షోభం,కార్మిక సంఘాలు,ఆర్థిక విధానాలపై నిరంతరం స్వరం వినిపించిన ఘనాపాటి. ప్రజలు,కార్యకర్తలకు ఎప్పుడైనా అందుబాటులో ఉండటమే కాదు,నిరాడంబర జీవనశైలి,ఆచరణాత్మక రాజకీయ దృక్పథం ఆయన ప్రత్యేకత.యావత్ భారతదేశంలో వామపక్షశక్తుల ఐక్యత కోసం కృషి చేసిన నాయకుడిగా ఒక ప్రత్యేక గుర్తింపును పొందడమే కాదు,తెలంగాణ వైతాళికుడిగా పేరుగాంచిన సురవరం ప్రతాపరెడ్డి ఈయనకు పెదనాన్న కూడా.ఇక సురవరం సుధాకర్ రెడ్డి గారి సొంతూరు జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని కురుపాడులో ప్రాథమిక విద్యాబ్యాసం పూర్తి చేసిన అనంతరం కర్నూలు జిల్లాలోని ఉస్మానియా కళాశాలలో బీఏ చదవడమే కాదు హైదరాబాద్ ఉస్మానియా కళాశాలలో ఎల్ఎల్ బీ పూర్తిచేశారు.ఇక అయన రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే విద్యార్ధి దశ నుంచే వామపక్ష ఉద్యమాలలో అనుబంధమై ప్రజా సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేసిన ఆయన సీపీఐ అనుబంధ అఖిల భారత్ విద్యార్ధి సమాఖ్య( ఏఐఎస్ఎఫ్ ) AIS F తరపున ఓ నాయకునిగా అయన తన వామపక్ష జీవితానికి ఓ బీజం,గట్టి పునాది వేసుకొని,కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో క్రమంగా ఎదుగుతూ ప్రదాన కార్యదర్శి కూడా అయ్యారు.అదేమాదిరి అంతకుముందు 1966లో AISF జాతీయ ప్రదాన కార్యదర్సి,1970లో జాతీయ అధ్యక్షుడిగా ఉండటమే కాదు,1972లో ఏఐవైఎఫ్ (AIYF) జాతీయ ప్రదాన కార్యదర్శిగా సైతం అత్యంత ప్రభావంతంగా,సమయస్ఫూర్తిగా తన భాద్యతలు నిర్వర్తించాడు.అంతేగాకుండా 1971లో సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడిగా 1974 నుంచి 1984 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేసిన ఘనత ఈ సురవరం సుధాకర్ రెడ్డి గారిది. ఏదిఏమైన తన వామపక్ష రాజకీయ జీవితంలో ఎన్నో ఓడుదిడుగులను, జయాపజయాలను చవిచూశారు సురవరం సుధాకర్ రెడ్డి గారు.అందులో భాగంగా 1984లో,1990లో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటమి చెందడమే కాదు,1994 లో కర్నూలులోని డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సైతం అప్పటి సీఎం కోట్లపై పోటీ చేసి ఓటమిపాలు అయినప్పటికీ ఏ మాత్రం కృంగిపోకుండా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొని 1998 ( 12వ లోక్ సభ ),2004 ( 14వ లోక్ సభ ) లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా విజయకేతనం ఎగురవేసి అందరిచేత శెభాష్ అనిపించుకున్నారు ఈ సురవరం గారు.ఏమైనా సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా,జాతీయవర్గ సభ్యుడిగా,2007లో హైదరాబాద్ లో జరిగిన పార్టీ జాతీయ సమావేశాల్లో ఉప ప్రదాన కార్యదర్శిగా,2012 లో పాట్నాలో జరిగిన జాతీయ సమావేశాల్లో ప్రదాన కార్యదర్శిగా ఎన్నికై, మళ్ళీ అదే పదవిలో 2012 నుంచి 2019 వరకు కూడా అదే పదవిలో కొనసాగడాన్ని బట్టి అయనపై సీపీఐ ఆదినాయకత్వం ఎంతటి విశ్వసనీయతను కనబరిచిందో మనం ఇట్టే ఊహించవచ్చు.అన్నింటికి మించి 2004లో ఎంపీగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (కార్మిక ) చైర్మన్ గా సైతం భాద్యతలు నిర్వర్తించి సీపీఐ పార్టీలో ఎదురులేని,తిరుగులేని నాయకునిగా చెలామణి అయిన నిజమైన ప్రజానాయకుడు,తన జీవితాన్ని అద్యంతం కార్మికులు, రైతులు,కూలీలు,పేదల సమస్యలపై పోరుబాట సల్పిన ఓ నిఖార్సైనా వామపక్ష వాది ఈ సురవరం సుధాకర్ రెడ్డి గారు! అమర్ రహే! అమర్ రహే సురవరం సుధాకర్ రెడ్డి గారు!✍️✍️✍️ - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #cpi party
cpi party - 13 hours ago Suravaram Sudhakar Reddy. Eenadu సరవరం దీgుకీమద్డి కనుమత Suravaram Sudhakar Reddy Video 4 hours ago enwikipediaorg LIVE: CPI Leader Suravaram: YouTube సిపిఃి 10 hours ago hours ago సీపీఐ సురవరం: అగ్రనేత Sakshi Suravaram Sudhakar Reddy Eenadu సీఓపలగనేత సురవరంసుధాకరెరెద్డి ఇకలేరు 4hours ago CPI Leader Suravaram YouTube 8 hours ago 13 hours ago Suravaram Sudhakar Reddy. Eenadu సరవరం దీgుకీమద్డి కనుమత Suravaram Sudhakar Reddy Video 4 hours ago enwikipediaorg LIVE: CPI Leader Suravaram: YouTube సిపిఃి 10 hours ago hours ago సీపీఐ సురవరం: అగ్రనేత Sakshi Suravaram Sudhakar Reddy Eenadu సీఓపలగనేత సురవరంసుధాకరెరెద్డి ఇకలేరు 4hours ago CPI Leader Suravaram YouTube 8 hours ago - ShareChat