🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀
కార్తీక దామోదర మాసము
రోజు కృష్ణుడు మజ్జిగ చిలుకుతున్న యశోదాదేవి వద్దకు వచ్చి ఆకలేస్తుందని చెప్పాడు. వెంటనే యశోదా దేవి ఆపనిని ఆపి కృష్ణుడికి పాలు ఇస్తుంధీ. తాను వంట గదిలో పొయ్యి వెలిగించి వచ్చిన విషయం గుర్తొచ్చి పాలు తాగే కృష్ణయ్యను కిందకు దింపి తాను వంట గదిలోకి వెళ్తుంది.
తనను పాలు తాగనీయకుండా తన పని చూసుకోడానికి వెళ్లిన యశోద పైన కృష్ణుడు కోపగించుకుని అక్కడ ఉన్న వెన్నకుండను పగలకొట్టి ఒక రోలు మీద కూర్చుని వెన్న తినసాగాడు.బయటకు వచ్చిన యశోదాదేవి తన బిడ్డ కనిపించకపోయేసరికి వెతకగా కృష్ణుడు రోలు మీద కూర్చుని వెన్న తింటూ కనిపించాడు.
అప్పుడు యశోదాదేవి కృష్ణుడిని మందలిస్తూ ఒక కర్ర తీసుకుని తన వెంట పరిగెత్తుతూ కృష్ణుడిని పట్టుకుని, అక్కడ ఉన్న రోలుని కృష్ణుడి పొట్టకు ఒక తాడుతో కట్టసాగింది. ఎంత ప్రయత్నించినా కూడా ఆ తాడు కృష్ణుడి ఉదరమునకు తక్కువైంది.
"ప్రపంచాన్ని బంధించడం సాధ్యమా" తన తల్లి తనను బంధించడానికి పడే కష్టాన్ని చూడలేని కన్నయ్య, తన తల్లి తనవల్ల బాధపడకూడదని. ఆ తాడు తన పొట్టకు సరిపోయేలాగా చేసుకుని కట్టించుకుంటాడు.
ఇలా తన తల్లి పైన ఉన్న ప్రేమతో కృష్ణుడు ఆ దామము (తాడు)తో ఉదరముకి కట్టించుకున్నాడు. కాబట్టి ఈ మాసం *కార్తీక దామోదర మాసము..*
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః.....
🙏సర్వే జనాః సుఖినోభవంతు🙏
🙏లోకాస్సమస్తా సుఖినోభవంతు🙏
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀
#తెలుసుకుందాం #కార్తీక దామోదరాయ నమః


