ShareChat
click to see wallet page
search
#పాలిటిక్స్ #పొలిటికల్ సెటైర్స్🤪 *ప్రకాష్ రాజ్ చిలిపి సందేహం❓* AUGUST 22, 2025🎯 విలక్షణ నటుడు ప్రకాశాజ్ సోషల్ మీడియా వేదికగా చిలిపి సందేహాన్ని వ్యక్తం చేశారు. దేశ రాజకీయాలపై ఎప్పటికప్పుడు ప్రకాశ్జ్ తనదైన సృజనాత్మక రీతిలో విమర్శలు చేస్తుంటారు. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కూడా ఘాటుగా స్పందించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద బిల్లులపై ప్రకాశ్రాజ్ సీరియస్ గా స్పందించారు. ప్రకాశ్ రాజ్ పోస్టు ఏంటంటే... “ఒక చిలిపి సందేహం.. మహాప్రభు తమరు కొత్తగా ప్రవేశ పెడుతున్న బిల్లు వెనుక, మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, “మీ మాట వినె ఉప ముఖ్యమంత్రిని” ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా? జస్ట్ ఆస్కింగ్” అంటూ మూడు బిల్లులపై ప్రకాశ్జ్ ప్రశ్నించడం, అనుమానించడం ఆయనకే చెల్లింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట వినకపోతే, మాట వినే ఉప ముఖ్యమంత్రి పవన్ ను సీఎం చేసే కుట్ర ఏమైనా వుందా? అని ప్రధాని మోదీని ప్రకాశోజ్ పరోక్షంగా ప్రశ్నించారు. ఇటీవల మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఒక బిల్లు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 31 రోజుల పాటు ఎవరైనా జైల్లో వుంటే, పదవి పోయేలా బిల్లు తీసుకొచ్చారు. కేవలం ప్రత్యర్థుల్ని లొంగదీసుకోడానికే ఈ బిల్లును తీసుకొచ్చారనే విమర్శలు కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్రంగా వస్తున్నాయి. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు పేరు చెప్పి, బ్లాక్ మెయిల్ చేస్తోందని విమర్శించారు. ఆ విమర్శల్ని బలపరిచేలా ప్రకాశ్జ్ కూడా తనదైన వ్యంగ్య ధోరణిలో పోస్టు పెట్టారు.
పాలిటిక్స్ - oice dooi roll Va 20 oice dooi roll Va 20 - ShareChat