సూర్యరథానికి చిత్రరథమని పేరు.
సూర్యుని రథానికి ఒకే ఒక చక్రం.
సూర్యరథాన్ని సప్త అనే అశ్వం లాగుతుంది.
అది 'సప్తకాంచన సన్నిభం' అంటే ఏడు రంగుల కిరణాలను ప్రసరింపజేస్తుంది.
ఆ ఏడు రంగులు వ్యక్తి శరీరంలో ఉండే ఏడు ధాతువులు- మజ్జ, మాంసం, మేధస్సు, ఎముక, శుక్రం, శోణితం, చర్మం అనువాటిపై ప్రభావం కలిగివుంటాయి.
అనంత శక్తిమయమైన ఆ కిరణాలు వ్యక్తిపై ప్రసరిస్తే వాటివల్ల ఆయా ధాతువులపై ఉన్న రోగ లక్షణాలు నిర్మూలనమై ఆరోగ్యం లభిస్తుంది.
అందుకే మనుస్మృతి 'ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్' అని కీర్తించింది.
సూర్యుని నుండి ప్రసరించే ఏడు కిరణాలు..!!
1. సుషుమ్నము..!!
నాడీ మండలాన్ని ఉత్తేజపరస్తుంది.
2. హరికేశము..!
గుండె జబ్బులను నివారిస్తుంది.
3. విశ్వకర్మము..!
రక్తహీతను, తత్సంబంధమైన వ్యాధులను నిర్మూలిస్తుంది.
4. విశ్వత్వచము..!
శ్వాసకోస సంబంధిత వ్యాధులను
తొలగిస్తుంది.
5. సంపద్వసుము..!
జననేంద్రియ వ్యవస్థను దృఢపరుస్తుంది
6. అర్వాగ్యాసుము..!
నరాల బలహీనతను నివారిస్తుంది.
7. స్వరాడ్యసుము..!
స్వరపేటికకు, మూత్రపిండాలను వ్యాధులను నివారిస్తుంది.
శ్రీ సూర్యారాధన గురించి రామాయణము, మహాభారత గ్రంథాలలో విస్తృతంగా చెప్పడం జరిగింది.
అగస్త్యుని ద్వారా ఆదిత్య హృదయము అను స్తోత్రాన్ని ఉపాసించి శ్రీరాముడు రావణ సంహారం చేసినట్లు, వనపర్వంలో ధర్మరాజు ఆదిత్యుని ఉపాసించి అక్షత పొందినట్లు కథలున్నాయి.
ఓం మిత్రాయ నమః.
#☸🙏సూర్యనారాయణ స్వామి #శ్రీ సూర్య నారాయణ నమః🌅 #శ్రీ అరసవిల్లి సూర్య నారాయణ స్వామి.. 🙏 #🌞శ్రీ సూర్యనారాయణ స్వామి🌞 #🌞 శ్రీ సూర్యనారాయణ స్వామి 🌞


