#🗞️డిసెంబర్ 2nd ముఖ్యాంశాలు💬 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు పారిశ్రామిక భూముల అమ్మకంపై బీఆర్‌ఎస్ నిరసన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రణరంగంగా మారింది. కేవలం అధికార పక్షం, వారి రహస్య మిత్రపక్షాల సభ్యులే నిజమైన కార్పొరేటర్లుగా సమావేశం ఆద్యంతం కొనసాగింది
దానిపై చర్చ పెట్టాలని పట్టుబట్టినబీఆర్‌ఎస్ సభ్యులు, ప్రతినిధులు
రసాభాసగా ముగిసిన జీహెచ్‌ఎంసీ చివరి సమావేశం
ఎన్నికలే లక్ష్యంగా కౌన్సిల్ సమావేశం నిర్వహణ
ఓట్లు దండుకునే ఉద్దేశంతో కౌన్సిల్‌లో పలు తీర్మానాలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రణరంగంగా మారింది. కేవలం అధికార పక్షం, వారి రహస్య మిత్రపక్షాల సభ్యులే నిజమైన కార్పొరేటర్లుగా సమావేశం ఆద్యంతం కొనసాగింది. పారిశ్రామిక భూముల అమ్మకంపై కౌన్సిల్ వేదికగా బీఆర్‌ఎస్ నిరసన వ్యక్తంచేసింది. పారిశ్రామిక భూములను అమ్మేలా రూపొందించిన పాలసీని రద్దు చేయాలని మంగళవారం జరిగిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. రూ.5 లక్షల కోట్ల విలువైన 9,292 ఎకరాల భూములను అమ్మేస్తూ రేవంత్‌రెడ్డి సర్కారు దేశంలోనే అతిపెద్ద స్కామ్‌కు తెరలేపిందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని పారిశ్రామిక కారిడార్ భూములను అమ్ముతున్న హిల్ట్ పాలసీని రద్దు చేయాలని నినదించారు


