ShareChat
click to see wallet page
search
#హహహ #హహహ😃😅😂🤣😄 🚩అనగనగా ఒక కాలంలో...... ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉండేవాడు. అతను ఒక పెంటియమ్ కంప్యూటర్ పెట్టుకొని ఒక నది ఒడ్డున చెట్టు కింద కూర్చుని కొత్తకొత్త ప్రోగ్రామ్‌లు తయారు చేసేవాడు. వాటిని దగ్గరున్న సంతలో అమ్మి బియ్యం నూనె పప్పులూ కొనుక్కుని జీవనం సాగించేవాడు. ఒకరోజు కంప్యూటర్ మీద పని చేసుకుంటుండగా అది జారి నదిలో పడిపోయింది. అక్కడ నది చాలా లోతు. దిగి తీయడం అసాధ్యం. ఏం చేయాలా అని దిగులుపడుతుంటే చిన్నప్పుడు చదువుకున్న మూడు గొడ్డళ్ళ కథ గుర్తొచ్చింది అతనికి. వెంటనే నదీ మాతను ప్రార్థించసాగాడు. కాసేపటికి ఆమె ప్రత్యక్షమై ఆ ఇంజనీర్ కొచ్చిన కష్టం గురించి తెలుసుకుని కట్టెల కొట్టేవాడ్ని పరీక్షించినట్టుగానే ఇతని నిజాయితీని కూడా పరీక్షించాలనుకుంది. ఒక అగ్గిపెట్టె చూపించి "ఇదా నీ కంప్యూటర్" అని అడిగింది. ఇదేంటి...దేవతకు కంప్యూటరంటే ఏమిటో కూడా తెలియదా అని మనసులో ఆశ్చర్యపోతూ "కాదు" అన్నాడు. ఈ సారి ఆమె జేబులో పట్టే చిన్న క్యాలిక్యులేటర్ చూపించి "ఇదా" అనడిగింది. "అబ్బే కాదు" అన్నాడతను. మూడోసారి ఇంజనీర్ వాడుతున్న కంప్యూటర్‌నే నీళ్ళలో నుంచి బయటికి తీసి "నీ వస్తువు ఇదేనా" అనడిగింది. "అవును" అన్నాడతను నిట్టూరుస్తూ. . ఆ నిట్టూర్పును గమనించకుండా అతని నిజాయితీకి మెచ్చి నదీ దేవత అతనికి ఆ మూడు వస్తువులూ ఇవ్వబోయింది. ఇంతలో ఇంజనీర్ ఉండబట్టలేక "నా అసలు వస్తువును తీసివ్వడానికి ముందు ఇంకా మేలైన కంప్యూటర్లను కదా నువ్వు నాకు చూపించాల్సింది" అని అడిగాడు. గొడ్డళ్ళ కథలో అలా జరిగిందనే కదా అతను అసలు ఆమెను ప్రార్థించడం మొదలు పెట్టింది! నదీ దేవతకు కోపమొచ్చింది. "గాడిదా ఆ విషయం నాకు తెలుసురా. నీకు మొదట చూపించిన రెండూ ట్రిలెనియం, బిలెనియం కంప్యూటర్లురా. ఐ.బి.ఎం వారి లేటెస్ట్ కంప్యూటర్లు రా అవి........" అని తిట్టి అంతర్థానమైపోయింది. నీతి: టెక్నాలజీలో వస్తున్న మార్పుల గురించి సంపూర్ణ అవగాహన లేకపోతే నోరు తెరిచి నీ తెలివితక్కువ తనాన్ని బయటపెట్టుకోవడం కంటే నోరు మూసుకుని నువ్వు జీనియస్‌వనే అభిప్రాయాన్నే ఇతరులకు కలిగించడం మంచిది. *** *** *** ఒక్క టెక్నాలజీ అనే ఏముంది....ఏ విషయంలో అయినా అదే మంచిది. తెలియనప్పుడు నోరు తెరిచి అభాసుపలయ్యేకంటే మూసుకుని ఆత్మగౌరవాన్ని ఉంచుకోవడమే ఉత్తమం. (నేను కూడా మా నెట్టుసీనుది ఒక కంప్యూటర్ పట్టుకెళ్ళి చెఱువులో పడేసి, ఆ నదీమాతను వేడుకోనా?) *** *** *** ***
హహహ - ShareChat