#😎మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు🧁 మనస్సున్న మహారాజు,తెలుగు సినిమా ప్రేక్షకుల ఆరాధ్య నటుడు,పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవిగారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు!
లేదా
తెలుగు సినిమా పరిశ్రమకు ఓక ఆశాదీపం వంటి మెగాస్టార్ చిరంజీవిగారి 70వ జన్మదినం నేడు!
ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి వుండే మహోన్నత వ్యక్తిత్వం,సౌమ్యుడు,అజాత శత్రువు,చీమకు కూడా హాని తలపెట్టని నైజం,అలనాటి నటులు దివంగత ఎన్టీఆర్,ఏ.ఎన్.ఆర్ ల తర్వాత అంతటి స్టార్ ఇమేజ్ ను,తెలుగు సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని విశేషంగా చురగొన్న అరుదైన నటుడు,అన్నదమ్ముల మధ్య ఎలాంటి ఆత్మీయత,ప్రేమానురాగాలు, ఋణానుబంధాలు వెల్లివిరియాలో,మనం కలిగి ఉండాలో ఓక ఆదర్శ అన్నయ్య గా ఆచరించి మరీ పలువురికి స్ఫూర్తిగా నిలిచినా ఓక ప్రేమ,కరుణామూర్తి మన మెగాస్టార్.తెలుగు సినిమా పరిశ్రమ శ్రేయస్సును,అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తులలో సైతం మన మెగాస్టార్ చిరంజీవి (చిరు ) మొదటి వరుసలో వుంటారు,అందుకే ఆయనను తెలుగు పరిశ్రమకు ఓక పెద్దాయన వంటి వారు అని చెబుతూ వుంటారు.క్రమశిక్షణకు పెట్టింది పేరు,స్వయంకృషికి పర్యాయపదం,ఎవరి అండ దండాలు లేకుండా తన స్వశక్తితో ఓక ఎవరెస్ట్ శిఖరం అంతా ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఓక మేరుగరణదీరుడు,అవిరళ,నిత్య కృషివలుడు మన మెగాస్టార్ చిరు.ఆయన రాజకీయాలలో వున్న, సినిమా రంగంలో వున్న నైతిక విలువలకు ఓక పెద్ద పీట వేసే ఓక గొప్ప మానవతామూర్తి.అంతేకాదు 'ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న' , ' వంద మందికి నువ్వు సహాయం చేయలేకపోవొచ్చు,కనీసం ఒక్కరికైనా సహాయపడు' అన్న నీతి సూత్రానికి మనసా,వాచ, కర్మణ,కట్టుబడి తన స్వహాస్తాలతో బ్లాడ్ బ్యాంకును స్థాపించి ఎందరో ప్రాణాపాయ స్థితిలో ఉండి బ్లడ్ అవసరం వున్న వారికి బ్లడ్ సరఫరా చేసేలా తన సంస్థను అనేక ప్రాంతాలలో విస్తరించి లక్షలాది మంది ప్రాణాలను నిలబెడుతున్న ప్రాణదాత మన చిరు గారు!ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ విషయం లో చూపే ఆత్మీయత,వినయ విదేయతలు,గౌరవ మర్యాదలు నభూతో న భవిష్యత్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ఏదిఏమైన మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినం అయిన ఈ ప్రత్యేక సందర్బంగా మంచికి, మానవత్వానికి మారు పేరు అయిన ఆయన భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రేక్షకుల హృదయాలలో మరింతంగా చెరగని ముద్ర వేయాలని, తెలుగు సినిమా పరిశ్రమ ఆశాదీపం అయిన ఈ చిరు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లెలా ఆ సర్వేశ్వరుడు,ఆ దేవదేవుడు ఆయనపై అనంత కరుణ,కృప,కటాక్షాలు ప్రసరింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.ఏమైనా మెగాస్టార్ చిరంజీవి గారు ఓక రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో సైతం ఓక జెంటిల్ మ్యాన్ గా,ఓ మానవతామూర్తిగా,అన్నింటికి మించి వివాదాలకు దూరంగా వుంటూ అటు తన సినిమా జీవితంలో,ఇటు రాజకీయ జీవితంలో ప్రతి ఒక్కరికితో కూడా మంచి ఆరోగ్యకరమైన సంబందాలు నెలకొల్పుకొని,మెరుగుపరచుకొని ఓ అజాత శత్రువుగా అందరిచేత శెభాష్ అనిపించుకోవడమే కాదు,సమాజసేవలో సైతం తన వంతు పాత్ర పోషిస్తూ అటు తనకున్న అశేష మెగా ప్యాన్స్ కు స్ఫూర్తిదాయకంగా,ఆదర్శంగా నిలువడమే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాల్లో తనకంటూ ఓక ప్రత్యేక స్థానం సంపాదించుకొని నిజంగా తన పేరుకు తగ్గట్లు చిరంజీవిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలతో వర్దిల్లుతూ,అందరివాడిగా ప్రతి ఒక్కరి మనస్సుల్లో చెరగనిముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మనమంతా ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం!జయ జయహో బర్త్డేహీరో మెగాస్టార్ చిరంజీవి గారు!హ్యాట్సాఫ్ టూ మెగాస్టార్!✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా!