#🕯️అందెశ్రీ ఆకస్మిక మృతి..సీఎం తీవ్ర దిగ్భ్రాంతి😢
తెలంగాణ ఉద్యమగీతాన్ని కన్న మహాకవి అందెశ్రీకి కన్నీటి నివాళులు 🙏🏼 🙏🏼
తెలంగాణ కోసం ఉద్యమించి, పాట ఆయుధంగా ఇచ్చి
రాష్ట్రం సాకారమయ్యాక
ఆ పాట అధికార గీతంగా మారుమోగుతోంటే.. తృప్తిగా విని...
తెలంగాణ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని దీవిస్తూ అందెశ్రీ వెళ్లిపోయారు..
✊🏼అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతం ✊🏼
జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం
జై తెలంగాణ..జైజై తెలంగాణ..
జై తెలంగాణ..జైజై తెలంగాణ
జానపద జనజీవన జావళీలు జాలువార
కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర
అను నిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ..జైజై తెలంగాణ
జై తెలంగాణ..జైజై తెలంగాణ
గోదావరి కృష్ణమ్మలు..తల్లీ నిన్ను తడుపంగా
పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా
సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి
జై తెలంగాణ ..జైజై తెలంగాణ
జై తెలంగాణ..జైజై తెలంగాణ


