ShareChat
click to see wallet page
search
భగవంతుడి లెక్కలు ఇవ్వాళ జీవుడు ఈ శరీరంలో వున్నాడు. గతంలో ఇదే జీవుడు ఏ శరీరంలో వున్నాడో తెలియదు. ఏదో శరీరంలో వుండి ఏదో తప్పిదం చేసాడు, ఏదో పాపం చేసాడు, పుణ్యం చేసాడు. ఆ పాపమైనా, పుణ్య మైనా అనుభవించే పోవాలి. పాపము అనుభవ స్వరూపంగా పోవట పోవటానికి దుఃఖము; అలాగే పుణ్యము అనుభవంగా పోవటానికి సుఖము, రెండింటికి లెక్క ఇవ్వాలి. వీడు గతంలో చేసిన పాపమెంత, పుణ్యమెంత? ఎంత సుఖపెట్టవచ్చు? ఎంత దుఃఖపెట్టవచ్చు? ఇది లెక్క కట్టగలి గినవాడే లెక్కచెప్పి నీ ఎదుట నిలబడి నీ పాపపుణ్యముల ఫలితమును నీకివ్వడు. ఆయన వెనక నిలబడి గమ్మత్తుగా లెక్కకట్టి, ఆ లెక్క సారాంశంగా సుఖదుఃఖములని స్తాడు. ఆ పరమేశ్వరుని మనం పట్టుకొని నిలదీ యడానికి ఆయన మన కన్నుల ఎదుట కనబడే వాడు కాడు. మాంస నేత్రములకు గోచరము కాడు. కాబట్టి ఈశ్వరుణ్ణి నిలబెట్టి ప్రశ్న చేయడం సాధ్యం కాదు. ఆయన ఏ ఫలితాన్ని చ్చాడో ఆ ఫలితాన్ని పరతంత్రులమై అనుభవిం చటమొక్కటే మనం చేయగలిగిన పని. అది కూడా భక్తితో కూడుకున్నది. దుఃఖం వచ్చిందనుకోండి, నాకు భగవం తుడు దుఃఖమిచ్చాడని బాధ పడకుండా, నేను ఏ జన్మలోనో ఏదో పాపం చేసి వుంటాను, దానికి ప్పుడు దుఃఖమిచ్చాడు. ఈశ్వరా! ఇప్పుడు దుఃఖం ఎంత బాధాకరమో తెలుసుకున్నాను కాబట్టి దఃఖమునకు కారణమైన పాపము నాచేత చేయ బడకుండుగాక. కాబట్టి నాకు దైవమునందు పూనిక కలుగుగాక! అని భగవంతునికి నమస్కరించగలిగిన ప్రజ్ఞ అంకురించటం నిజమైన పరిణతి కలిగిన భక్తిని పొంది వుండటం. అందుకే ధూర్జటి 'నిను సేవింపగ నాపదల్పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసారమోహంబు పై గొననీ, జ్ఞానముగల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ చ్చినరానీ, యవినాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా! అని అంటాడు. అలా ఉండగలిగిన పరిణతి ఈశ్వరుని కృపచేత మాత్రమే సంభవమవుతుంది. అటువంటి కాలము పరమ బలవత్తరమైన స్వరూపం. అది ఈశ్వర స్వరూపంగా వుండి, ఈ సుఖదుః ఖముల రూప ములలో పాపపుణ్యములనుభవించేసి, దానివలన కంటికి కనబడని ఈశ్వరుని ప్రజ్ఞని గుర్తెరిగి ఆయన పాదముల యందు నిరతిశయమైన భక్తిని పెంపొందింపజేసుకుని కృతార్థుడు కాగలిగిన వ్యక్తి ధన్మాత్యుడు. #తెలుసుకుందాం
తెలుసుకుందాం - 1 0 1 . 1 0 1 . - ShareChat