ShareChat
click to see wallet page
search
#భక్తి #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం *వాడపల్లి ఆలయ ప్రవేశ మార్గంలో వ్యాపారుల వీరంగం* *అడిగిన భక్తులపై దురుసు ప్రవర్తనతో కలకలం* కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివార్ల దేవస్థానం భక్తుల రద్దీతో రోజురోజుకు కిక్కిరిసిపోతుంది. దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు వచ్చే ఈ పవిత్ర క్షేత్రంలో వారం చివరల్లో అయితే భక్తుల రద్దీ తిరుమల నడకదారులను తలపిస్తుంది. గోదావరి జిల్లాలకు, ముఖ్యంగా కోనసీమ ప్రాంతానికి గౌరవ మర్యాదలు ప్రత్యేక గుర్తింపు. అయితే ఇదే నేలలో కొంతమంది వ్యాపారుల దురుసు ప్రవర్తన భక్తులను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. పార్కింగ్ స్థలం నుంచి ఆలయ మాడవీధి వరకు వెళ్లే ప్రధాన ప్రవేశ మార్గం మొత్తం మొబైల్ కూల్‌డ్రింక్ వాహనాల ఆక్రమణకు గురై భక్తుల రాకపోకలు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతోంది. మధ్యాహ్న సమయంలో భోజనాల కోసం క్యూలైన్లు, తిరుగుతున్న భక్తులు అంతా ఒకే చోట గుంపుకి గురవ్వడంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. *"మేము వేలంలో లక్షలు పెట్టాము… మీరు ఎవరు అడగటానికి?"* శనివారం గూడూరు నుంచి వచ్చిన మహిళా భక్తులు మార్గం ఖాళీ చేయాలని మొబైల్ కూల్‌డ్రింక్ వ్యాపారులను కోరగా, వారు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, “మేము లక్షలు పెట్టి వేలంలో ఈ స్థలం తీసుకున్నాం. మేము ఇక్కడే ఉంటాం… మీరు వస్తారు, పోతారు… మమ్మల్ని అడగడానికి మీరెవరండి? ఏమైనా ఉంటే అధికారులను అడిగండీ!” అంటూ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధోరణి చూసి భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంతలో సంఘటితాన్ని చిత్రీకరిస్తున్న ఒక విలేకరి సెల్‌ఫోన్‌ను లాక్కునేందుకు వ్యాపారి ప్రయత్నించడం అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా మారిందో స్పష్టంగా తెలిపింది. భక్తులతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించే ఇటువంటి వ్యాపారుల వల్ల ఆలయ ప్రతిష్టే దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకోవాలంటూ భక్తుల డిమాండ్ ఆత్మీయతతో చూసుకోవాల్సిన దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి మీద ఇలాంటి ప్రవర్తన అనవసర ఉద్రిక్తతలకు దారి తీస్తుందని భక్తులు హెచ్చరిస్తున్నారు. వెంటనే ఆలయ అధికారులు, సంబంధిత శాఖలు సకాలంలో చర్యలు తీసుకుని ఆలయ ప్రధాన ప్రవేశ మార్గంలో ఉన్న ఆక్రమణలను తొలగించాలని వారు కోరుతున్నారు. అలాగే వేలం ద్వారా వ్యాపారం చేసే వారికి ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు చేసి, భక్తులతో ఎలా ప్రవర్తించాలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెబుతున్నారు. భక్తి, భద్రత, గౌరవం—మూడు కాపాడితేనే వాడపల్లి క్షేత్రం మహిమాన్వితం అవుతుందని భక్తుల అభిప్రాయం. ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
భక్తి - ఏవ శవవcరములతెరమన rudchangaRauu ஒலடை Shನnನಯ నదకనంతోంచరందివరను ఏవ శవవcరములతెరమన rudchangaRauu ஒலடை Shನnನಯ నదకనంతోంచరందివరను - ShareChat