ShareChat
click to see wallet page
search
#📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ అద్భుతం.. డాక్టర్లే ఆశ్చర్యపోయేలా జరిగిన మహా అద్భుతం. బ్రెజిల్‌లో ఇటీవలె ఓ మగబిడ్డ పురుడుపోసుకున్నాడు. ఎంతో ఆరోగ్యంగా పుట్టాడు. అయితే ఆ శిశువు చేతిలో T ఆకారంలో ఉన్న కాపర్‌ వస్తువు ఒకటి ఉంది. అది చూసి డాక్టర్లకు దిమ్మతిరిగిపోయింది. అది మరేంటో కాదు మహిళలు గర్భం దాల్చకుండా చేసే ఇంట్రాటూరైన్ డివైస్ (IUD). IUD అనేది కాపర్ T, కాపర్ కాయిల్ అని కూడా పిలువబడే గర్భనిరోధక సాధనం. దీనిని గర్భధారణను నివారించడానికి స్త్రీ గర్భాశయంలోకి చొప్పిస్తారు. అలాంటి డివైజ్‌ను పిల్లాడు అతని పిడికిట్లో పట్టుకొని పుట్టడం ఇప్పుడు వింతగా మారింది. ఎందుకంటే ఆ డివైజ్‌ మహిళల గర్భాశయంలోకి చొప్పిస్తే 99 శాతం వాళ్లు గర్భం దాల్చరు. కానీ, అలాంటి డివైజ్‌ ఉన్న గర్భాశయంలో ఊపిరిపోసుకోవడమే కాకుండా.. ఏదైతే తన పుట్టుకను ఆపాలనుకుందో దాన్ని పిడికిట్లో పట్టుకొని తల్లి గర్భం నుంచి బయటికి వచ్చాడు. నిజంగా ఇది వైద్యరంగంలో ఒక వింతగా వైద్యులు భావిస్తున్నారు. గోయియాస్‌లోని నెరోపోలిస్‌లోని సాగ్రాడో కొరాకో డి జీసస్ హాస్పిటల్‌లో క్వీడీ అరౌజో డి ఒలివెరా అనే మహిళ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను పిడికిలిలో రాగి టి పట్టుకున్నాడు. ఆ తల్లి దాదాపు 2 సంవత్సరాలుగా గర్భనిరోధక పరికరాన్ని ఉపయోగిస్తోందని సమాచారం. ఆమె సాధారణ తనిఖీ సమయంలోనే గర్భవతి అని తెలుసుకుంది. వైద్యులు కూడా ఆమెకు కాపర్ T ను తొలగించవద్దని సలహా ఇచ్చారు. దాంతో ఒలివెరా గర్భనిరోధక పరికరాన్ని తన గర్భాశయంలోనే ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. కానీ చివరికి, ఆమెకు పుట్టిన బిడ్డ ఆ పరికరాన్ని తనతో పాటే బయటికి తీసుకొచ్చాడు. ___________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 6️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/C94q7lUBBdpISymlZZqSyg?mode=ems_wa_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰జాతీయం/అంతర్జాతీయం - పూర్తి వివరాలు " వైద్యరంగంలో అద్భుతం . గర్భం రాకుండా వాడిన కాపర్-T (IUD)ని పిడికిట్లో పట్టుకుని పుట్టిన బిడ్డ! పూర్తి వివరాలు " వైద్యరంగంలో అద్భుతం . గర్భం రాకుండా వాడిన కాపర్-T (IUD)ని పిడికిట్లో పట్టుకుని పుట్టిన బిడ్డ! - ShareChat