🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 10 - 12 - 2025,
వారం ... బుధవారం ( సౌమ్యవాసరే )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
బహుళ పక్షం
*_నేటి మాట_*
*పుణ్యం*
ఈరోజుల్లో అందరి నోట్లో నాణే మాట ఇది,
ఇది చెయ్యి పుణ్యం వస్తుంది, ఇది ముట్టు పుణ్యం వస్తుంది, ఇది తాకు పుణ్యం వస్తుంది, ఇది ఆచరించు పుణ్యం వస్తుంది ... ఇలా ఎన్నెన్నో వింటుంటూ వుంటాం...
" మానవునిలో హృదయ పరివర్తనం రానంతవరకు ఎన్ని చేసిననూ ప్రయోజనము వుండదు "...
దయాగుణం, దానగుణం లేనిదే దైవమును ఎన్ని పూజలు చేసిననూ ఉపయోగం ఏమీ ఉండదు... ఎలాంటి పుణ్యం రాదు!!...
నేడు చాలామంది పుణ్యం వస్తుందని నదులలో స్నాన్నములు చేస్తుంటారు, ఉపవాసాలు చేస్తుంటారు, ప్రదక్షిణలు ,జపాలు చేస్తుంటారు.
కానీ వీటి వలన పుణ్యం రాదు, ఇవన్నీ మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి చేసే సాధనలు మాత్రమే! అని గ్రహించాలి...
నదులలో స్నానం చేస్తే పాపం పోయి పుణ్యం వస్తుందనుకుంటే చేపలు కంటే పుణ్యాత్ములు ఈ సృష్టిలోనే ఉండవు!
ఉపవాసాలు ఉండడం వలన పుణ్యం వస్తుంది అనుకుంటే నిత్యమూ ఆకలితో పస్తులుండే పేదవాడి కన్నా పుణ్యాత్ముడు వుండనే వుండడు...!
ఈరోజు అత్యాశ, సోమరితనం వలన ఇట్టి భ్రమకు లోనగుచున్నాము...
ఇవన్నీ చేయకూడదు అని కాదు, చేయాలి.... కానీ అంతటితో ...
ఆగిపోకుండా ఆత్మతత్వమును అర్ధం చేసుకుని హృదయము పరిశుద్ధం చేసుకుని పరమాత్మను అంతరాత్మలో ఆరాధించుకోవాలి!!...,
అప్పుడే ఇవన్నీ ఫలిస్తాయి...
ఏనాడు మన హృదయాలు పరిశుద్ధము గావించుకొని, అవి పరమాత్మ కొరకు పరితపిస్తాయో ఆనాటి నుంచి మనము నిజమైన పుణ్యాత్ములవుతాము...
దానితో దన్యాత్ములవుతామని తెలుసుకుని ఆ ప్రకారం నడచుకోవడమే నిజమైన పుణ్యం...
*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023


