Viral Video: దొంగల ప్లాన్ అట్టర్ ప్లాప్.. షాపులోకి రాగానే కనిపించకుండా పోయారు.. ఫాగింగ్ యంత్రంతో బెడిసికొట్టింది!
Viral Video: దుకాణంలో దొంగతనం చేయబోయిన దొంగల ప్లాన్ బెడిసికొట్టింది. రాత్రిపూట షాపులోకి చొరబడిన తర్వాత, అనుకోకుండా ఫాగింగ్ యంత్రం ప్రారంభమైంది. దీంతో షాపు మొత్తం పొగతో నిండిపోయింది, దొంగలు కళ్ళు కనిపించక, ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. చోరీ ప్రయత్నం విఫలమవడంతో భయంతో పారిపోయారు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, నెటిజన్లు నవ్వుకుంటున్నారు..