--------------------------------------
*మార్గశిర మాసం..విశిష్టత*
---------------------------------------
*మార్గశిర మాసం విష్ణువుకు ప్రీతికర మాసం. కార్తీక మాసమంతా శివ పూజలు చేసిన మాన వాళికి శివ విష్ణు భేధము లేదని శివ ప్రీతి కార్తీక మాసం అవుతూనే, విష్ణుప్రీతి మార్గశిరము ప్రారంభ మవుతుంది. ఇది అధ్యాత్మికముగా పెద్దలు ఏర్పరచినారు. కానీ ఇందులో సైన్సు ప్రకారం కూడా ఇది ఒక ఆరోగ్య సూత్ర ప్రణాళిక. ఈ కార్తీక మాసాన పగలంతా ఉపవాసం, నక్త భోజనం. మార్గశిర మాసాన ఉదయమే బోజనo. ఇందులో నిఘూడ పరమార్థం ఆషాడ మాసం నుండి 4 నెలలు వర్షాలు పడుతాయి, నేల బురద మయ మవుతుంది. తేమ వాతా వరణం, వ్యాధులను కలిగించే సూక్ష్మక్రిములు వ్యాప్తికి అణువుగా నుండి, అవి ఉత్పన్నమవుతాయి. వాటి ప్రభావం జనుల పై చూపి, అనారోగ్య సమస్యలు వస్తాయి. “ *లంఖణo పరమవుషదం”* కాన పూజలు, వ్రతాలు, ఉపవాసాల పేరిట మితముగా తిని జీర్ణసమస్య వ్యాదుల బారినుండి కాపాడ బడతారు.*
----------------------------------------
*వాతావరణ మార్పు వలన, చల్లటి గాలులు వీచు ఈ హేమంత ఋతువు కాలమున పగలు తక్కువ గాను, రాత్రిళ్ళు ఎక్కువగాను వుంటుంది. ఆకలి మందగించి వుంటుంది. జీర్ణ వ్యవస్థ చురుకు దనం తక్కువగా నుంటుంది. అందువలన ఈ వుపవాస దీక్షలు, దేవుడి పేరిట, మన ఆరోగ్యములు కాపాడు నిమిత్తం పెద్దలు ఏర్పరిచినారు.*
---------------------------------------- *మార్గశిరం మాసం ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీక. కార్తీకంలో పుణ్యనదీ స్నానాలతో తరించిన భక్తుల హృదయాలు మార్గశిర మాసంలో మరింతగా భగవoతుని చింతనలలో తన్మయమవుతారూ మబ్బులు వీడిన నిర్మలాకాశం మాదిరిగా మనస్సులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి.*
-----------------------------------
*హేమంత ఋతువు లో వచ్చే మొదటి నెల. దీనినే జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసమని, చంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అంటారు. ఆధ్యాత్మికం గా ప్రసిద్దమైన ఈ మాసం ప్రకృతి లో కూడా సౌందర్యాన్ని, శాంతిని సంతరిస్తుంది. మృగశిర నక్షత్రం లో కూడిన పూర్ణిమ వచ్చిన కారణం గా ఈ మాసానికి మార్గశీర్ష మాసమమని పేరు. శ్రీ కృష్ణ పరమాత్ముడు మార్గశిర మాసం గురించి స్వయం గా ఆయనే తెలియజేసినది ఏమనగా, ఈ మాసం లో చేసే ఏ పూజైన, హోమమైన, అభిషేకమైనా ఎటువంటి దైవకార్యం చేసినా దానిని స్వయం గా తనే స్వీకరిస్తానని తెలియ చేసాడు.* -------------------------------------
*చంద్రుడు మనః కారకుడు, ఆ చంద్రుడు అనుకూలంగా లేక పొతే, మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైన మార్గం లో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలం లో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ద బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ది చెందుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుని కి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశి కి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయలని పించే మంచి ఆలోచనలు కలుగుతాయి. శుద్ద పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహా విష్ణువు ని పూజిస్తారు. ప్రాతః కాల కార్యాలు పుణ్య ఫలితాలనందిస్తుంది.*
---------------------------------------
*మహా భారత యుద్దము కార్తీక మాస అమావాస్య నాడు ప్రారంభ మైనది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అర్జునినికి ఉపదేశం చేసినాడు. అది విన్న సంజయుడు, మరునాడు అనగా ఏకాదశి రోజు దృతరాష్ట్ర మహారాజు కు గీతను వినిపించినాడు. అనగా మానవ లోకానికి భగవద్గీత చెప్పిన కార్తీక మాస రోజులలో కాక, మరుసటి దినము మార్గశిర మాసమున ఏకాదశి నాడు మానవాళికి తెలుపబడినది. అందుకే మార్గశిర మాసం విష్ణువుకు ఒక ప్రత్యేక మాసముగా చెప్పా బడినది. అదియును గాక, ఈ మాసాన అతి పవిత్రమైన సుబ్రమణ్య పూజ, , లక్ష్మి పూజలు, దత్త జయంతి, అనఘా వ్రతము, హనుమద్వ్రతము మరియు ధనుసంక్రమణము మొదలైన విష్ణు ప్రీతి దినాలు కూడా కలవు.*
--------------------------------------
*ఈ మాసం శుద్ద త్రయోదశి హనుమత్ వ్రతము, అష్టమి నాడు అనఘా దేవి (దత్తాత్రేయుని భార్య) వ్రతము,వైష్ణవ మద్వ శయన ఏకాదశి,మరియు ఈ మాసాన అన్ని గురువారాలు లక్ష్మి పూజలు, దత్త జయంతి వుంటుంది.*
---------------------------------------
*ఆషాడ శుద్ద ఏకాదశిని శయనేకాదశి అని అంటారు. ఆ రోజున శ్రీ మాహావిష్ణువు యోగా నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ద ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) రోజున మేల్కోంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు.ఈ నెలల లోనే యతులు, ఎక్కడకు వెళ్ళక చాతుర్మాస వ్రతం చేస్తారు.* ----------------------------------------
#తెలుసుకుందాం #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏 #🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #లక్ష్మీదేవి #🔱 శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారు


