#🗞️అక్టోబర్ 19th అప్‌డేట్స్💬 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party బీఆర్ఎస్ సెల్ - యూకే ఆధ్వర్యంలో 22 నెలల కాంగ్రెస్ అప్రజాస్వామిక అరాచక పాలనను నిరసిస్తూ సెంట్రల్ లండన్‌లోని టావోస్టిక్ స్క్వేర్ దగ్గరున్న గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.
♦️యూకే నలుమూలల నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రవాస తెలంగాణ వాదులు హాజరయ్యారు.
♦️ముందుగా గాంధీజీ విగ్రహానికి పూలతో నివాళులర్పించి, అమరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
♦️కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రజలను మోసం చేసిందని వివిధ ప్లకార్డులను ప్రదర్శించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ నినాదాలు చేశారు.
♦️ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమం మన రైతుల్ని కాపాడుకోవాలని (#SAVEFARMERS), మన కాళేశ్వరం ప్రాజెక్టుని కాపాడుకోవాలని (#SAVEKALESHWARAM), మన హైదరాబాద్‌ని కాపాడుకోవాలని (#SAVEHYDERABAD) మన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన నుండి కాపాడుకోవాలనే ఉద్దేశంతో చేపట్టామని తెలిపారు.
♦️బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్న హామీలను గుర్తు చేస్తూ 'బాకీ కార్డు'లను సైతం ప్రదర్శించారు.
ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. నేడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మోసం చేసి నాశనం చేసిన తీరుని గణాంకాలతో సహా వివరించారు. నాడు కేసీఆర్ గారి పాలనలో తెలంగాణలో వికాసం జరిగితే నేడు కాంగ్రెస్ అరాచక పాలనలో విధ్వంసం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లండన్‌లో నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించామని, కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే నేడు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేకుండా పోయిందని, ఉద్యమకారులుగా చాలా బాధపడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఎన్నో పెట్టుబడులతో పరుగులు పెట్టిందని, నేడు పెట్టుబడుల ఊసే లేదని, కానీ లక్షల్లో అప్పులు చేశారని విచారం వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రైతు రాజులా బతికితే నేడు కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా రైతుల ఆత్మహత్యలు, వారికి సకాలంలో ఎరువులు విత్తనాలు ఇవ్వడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని, నేడు మనమంతా మన రైతులకు అండగా ఉండాలని తెలిపారు. కాళేశ్వరం మన తెలంగాణ జీవాధారని, కాంగ్రెస్ కుట్రల నుండి కాపాడుకోవాలని, కాళేశ్వరంపై లేని పోని కుట్రలు చేసి నేడు మళ్ళీ వారికి మేడిగడ్డె దిక్కైందని, 'హైడ్రా' పేరుతో హైదరాబాద్ బ్రాండ్‌ని నాశనం చేశారని, ఇలా ఎన్నో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని వాగ్దానాలని నెరవేర్చాలని, ప్రతిపక్ష నాయకులని అక్రమ కేసులలో ఇరికించే వాటిపై శ్రద్ధ మానేసి పాలనపై పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను నేడు కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనతో అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్తూ ప్రజల్ని మోసం చేస్తుందని, ప్రజలంతా తమ గొంతు వినిపించే సమయం వచ్చిందని, #RAISEYOURVOICE అనే నినాదంతో ఈ నిరసన చేపట్టామని, ఇప్పటికే కాంగ్రెస్ పాలన దాదాపు రెండు సంవత్సరాలు ముగుస్తుందని, చెప్పుకోడానికి కనీసం ఒక్క కార్యక్రమం చేయలేదు కానీ లక్షల కోట్ల అప్పులు మాత్రం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నేటి నుండి అన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ అటు తెలంగాణ ప్రజలకు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస బిడ్డలకు తెలియజేసేలా అటు ప్రధాన మీడియా మరియు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.
ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవాపేట్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ. కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్న హామీలను గుర్తు చేస్తూ బాకీ కార్డులను సైతం ప్రదర్శించామని తెలుపుతూ, అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ పాలన గాలికి వదిలేసి కాంట్రాక్టులు కమీషన్లని తన్నుకుంటున్నారని, దేశం ముందు తెలంగాణ పరువు పోతుందని, ఇలాంటి తెలంగాణ చూస్తామనుకోలేదని, మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం వస్తేనే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని హరి గౌడ్ నవాపేట్ తెలిపారు.
ఉపాధ్యక్షుడు సత్య మూర్తి చిలుముల మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి అక్రమ అరెస్టుల మీద ఉన్న శ్రద్ధ పాలనపై లేదని, నేడు ఎక్కడికెళ్లినా మళ్ళీ సారే రావాలని కేసీఆర్ గారి నాయకత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రానున్న ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని భారీ మెజారిటీతో గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని సత్య మూర్తి కోరారు.
ఉపాధ్యక్షుడు రవి రేతినేని మాట్లాడుతూ, తెలంగాణలో అప్రజాస్వామిక పాలన నడుస్తుందని, ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్నారని, అక్రమ అరెస్టులతో తెలంగాణలో నియంత పాలన కొనసాగిస్తున్నారని, ఇలాంటి వాటితో తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా కేసీఆర్ గారి సైనికుల్ని ఆపలేరని, తెగించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అదే స్ఫూర్తితో కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వంలో వారిచ్చిన ప్రతీ పిలుపుకి స్పందించి ముందుండి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని అరాచక కాంగ్రెస్ పాలన నుండి కాపాడుకుంటామని తెలిపారు.
అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల మాట్లాడుతూ, కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల పాలనలో ప్రపంచ వేదికల్లో ఎక్కడికి వెళ్లినా తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడే వారని, ముఖ్యంగా కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించే వారని, కానీ నేడు అలాంటి ప్రస్తావనే లేదని, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని నేడు తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి పాలన కొనసాగుతుందని, ఎక్కడా కూడా పెట్టుబడులు తేవాలనే ఆసక్తి లేదని, ఎంతసేపు రాజకీయ పబ్బం గడుపుకునే పనిలోనే కాంగ్రెస్ నాయకత్వం ఉందని, కుర్చీని కాపాడుకొనే పనిలోనే ఉన్నారని, మళ్ళీ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారని, తెలంగాణ ప్రజలు సరైన సమయంలో వీరికి బుద్ధి చెప్తారని తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరి నవాపేట్, సత్య మూర్తి చిలుముల, రవి కుమార్ రేతినేని, అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల, కార్యదర్శులు మల్లా రెడ్డి, సురేష్ గోపతి, అబ్దుల్ జాఫర్, కార్యదర్శి - ఐటీ, మీడియా పి.ఆర్. రవి ప్రదీప్ పులుసు, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని, రామకృష్ణ కలకుంట్ల, కార్యదర్శి - యూత్ వింగ్ ప్రశాంత్ మామిడాల, సోషల్ మీడియా కన్వీనర్ & మెంబర్‌షిప్ కోఆర్డినేటర్ అంజన్ రావు, ఈవెంట్స్ ఇంచార్జ్ తరుణ్ లునావత్ మరియు సభ్యులు షేక్ ఇమాం గౌస్, హరి కృష్ణ మామిళ్ళ, మొహమ్మద్ అబ్దుల్ ఖుదూస్, దయాల వసంత్ కుమార్, మహేందర్ పడిగెల, శ్యామ్ రెడ్డి సరికొండ, నాగరాజు, అజయ్ రావు, హర్షవర్ధన్ రెడ్డి, సంతోష్, సాయి కిరణ్, హనీఫ్, తదితరులు పాల్గొన్నారు.
#CongressBaakiCard


