ShareChat
click to see wallet page
search
రానున్న దసరా ఉత్సవాలలో అమ్మవారి అలంకారాలు కనకదుర్గా అమ్మవారి 11 అలంకారాలు... 11 రోజులు పాటు... సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి... త్రిమాత స్వరూపమైన దుర్గాదేవి.. మహాశక్తి స్వరూపిణి ఈ తెలుగు నేలపై ఉంది. తెలుగు భక్తుల వైభవానికి ప్రతీకగా తెలుగు ఇంటి పడచుగా , - : - అమ్మవారి అలంకారాలు - : - సెప్టెంబర్ 22 - శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ) 1 సెప్టెంబర్ 23 - శ్రీ గాయత్రీ దేవి ) 2 సెప్టెంబర్ 24 - శ్రీ అన్నపూర్ణ దేవి ) 3 సెప్టెంబర్ 25 - శ్రీ కాత్యాయని దేవి ) 4 సెప్టెంబర్ 26 - శ్రీ మహాలక్ష్మీ దేవి ) 5 సెప్టెంబర్ 27 - శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ) 6 సెప్టెంబర్ 28 - శ్రీ మహాచండీ దేవి ) 7 సెప్టెంబర్ 29 - శ్రీ సరస్వతీ దేవి ) 8 సెప్టెంబర్ 30 - శ్రీ దుర్గాదేవి ) 9 అక్టోబర్ 01 - శ్రీ మహిషాసురమర్ధిని దేవి ) 10 అక్టోబర్ 02 - శ్రీ రాజరాజేశ్వరి దేవి ) 11 --- -- 👇🏼 సెప్టెంబర్ 22 నవరాత్రి మొదటి రోజు అమ్మవారికి స్నపనాభిషేకం అనంతరం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు అమ్మవారి దర్శనం. ఉదయం 9.గం.ల నుంచి రాత్రి 11.గం. ల వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు ఉదయం 4.గం.ల నుంచి రాత్రి 11.గం.ల వరకు భక్తులకు దర్శనం ఉంటుంది మహామండపంలో 6వ అంతస్తులో కుంకుమార్చన లు, దేవిఖడ్గమాలార్చనలు, శ్రీ చక్ర నవార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది.. యాగశాలలో చండీ హోమం ప్రతిరోజూ జరుగుతుంది. ( సెప్టెంబర్ 29 మూల నక్షత్రం సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 2 గం.ల నుండి రాత్రి 11.గం.ల దాక అమ్మవారి దర్శనాలు ఉంటాయి. ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కనుక, ఇదే రోజున మధ్యాహ్నం సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు ) దసరా మహోత్సవాలలో ప్రతిరోజూ ప్రదోషకాల సమయంలో ఆదిదంపతుల నగరోత్సవం నిర్వహించబడును. సనాతన ధర్మ ప్రచార నిమిత్తం ఆధ్యాత్మిక , సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది, దసరా ఉత్సవాలలో దర్శనానికి విచ్చేసే భక్తులకు సౌకర్యర్ధం క్యూ లైన్ లలో త్రాగునీరు, వివిధ ప్రదేశములలో ఉచిత వైద్య, సదుపాయాలు, అమ్మవారి అన్నప్రసాదం ఏర్పాట్లు. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు కేశఖండన శాలలు, మొదలగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ! శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. #🔱 విజయవాడ కనకదుర్గ🔱 #కనకదుర్గ అమ్మవారు# #🌅శుభోదయం #🙏🏻భక్తి సమాచారం😲 #ఓం శ్రీ మాత్రే నమః
🔱 విజయవాడ కనకదుర్గ🔱 - ovely Bhanu  ovely Bhanu - ShareChat