#లేటెస్ట్ న్యూస్
హైదరాబాద్‌లో కొంతమంది తాగే నీటిని ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ వ్యక్తి డ్రింకింగ్ వాటర్ తో తన కారును శుభ్రం చేస్తుండటం అధికారులకు కనిపించింది. దీంతో అతడికి జలమండలి అధికారులు రూ.10 వేలు ఫైన్ విధించారు. మరో సారి ఇలాంటి తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో ఎవరైనా డ్రింకింగ్ వాటర్ ను దుర్వినియోగం చేస్తే ఇలాంటి పరిణామాలే ఉంటాయన్నారు.
#waterwash #washing


