ఇటీవల కాలంలో పిల్లల్లో నేర ప్రవృత్తి పెరిగిపోవడం అత్యంత బాధాకరం,దురదృష్టకరం!
లేదా
పెడదారిన వెళుతున్న పిల్లల్లో మార్పు తీసుకువచ్చేవరకు తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు తీవ్ర కృషి చేసే కాలం అసన్నమైంది!
ఈ మధ్యకాలంలో పిల్లల్లో నేర ప్రవృత్తి విపరీతంగా పెరిగిపోయింది అనే దానికి నిదర్శనంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది పిల్లలు చేసిన ఆకృత్యాలు,వారు హింసాత్మక,అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటం వంటి చర్యలు అందుకు ఓ సాక్షిభూతంగా మన కళ్ళ ముందు నిలుస్తున్నాయి అనే మాట సత్య దూరం కాదు.ముఖ్యంగా పిల్లలు తెలిసో తెలియకో,క్రమశిక్షణ లోపం నుంచో లేక సోషల్ మీడియా ప్రభావం వల్లనో లేక మత్తు పదార్థాలు సేవించడం వల్లనో కాని,తమకు మంచి చెప్పేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులపై సైతం విచక్షణ రహితంగా దాడులకు పాల్పడటం,మత్తు మందులు సేవించి క్లాస్ రూమ్ లోకి అడుగుపెట్టడం,ఆడపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడటం,ఉపాధ్యాయులు మందలించారు అనే నెపంతో వారి ముందే ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం వంటి అనేక హింసాత్మక,చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడటం కొంతమంది పిల్లల్లో శృతిమించి పోవడం ఈ ప్రజాస్వామ్యానికి సంబందించి అత్యంత ఆందోళనకరం.అదే మాదిరి కొంతలో కొంత స్మార్ట్ ఫోన్ల ప్రభావం,తల్లిదండ్రుల నిర్లక్ష్యం, ఉపాధ్యాయుల అలసత్వం వెరసి నేటి పిల్లలు ఇలా చెడు పంథాలో వెళుతూ ఆకతాయి పనులు చేయడం అనేది వారికి నిత్య కృత్యంగా మారడం ఇటీవల కాలంలో మరీ మితిమీరిపోయింది అనే మాట అక్షర సత్యం.అలాగే తమ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వారిని ఉపాధ్యాయులు దండించడం అనేది వారి విధి,బాధ్యత.అయితే బొత్తిగా విచక్షణ కోల్పోయిన కొంతమంది పిల్లల తల్లిదండ్రులు తప్పు చేసిన తమ పిల్లలకు నచ్చ జెప్పాల్సింది పోయి తమ పిల్లల్ని దండించిన ఉపాధ్యాయుల మీదకే దండేత్తు తుండటం ఏ మాత్రం బావ్యమో,సమంజసమో విద్యార్థుల తల్లిదండ్రుల వివేకానికే మనం వదిలేయాలి.అంతేగాకుండా ఒక్కొక్కసారి ఉపాధ్యాయులు సైతం తమ గురుతర బాధ్యతను మరచి కొంతమంది పిల్లలపై చీటికీ మాటికీ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడటం మూలాన కూడా ఆ పిల్లల హృదయాలు గాయపడి వారు నేరస్థులుగా మారే ప్రమాదం సైతం పొంచి వుంది అనే మాటలో ఎంతో కొంత వాస్తవం ఉంది.ఇంకా చెప్పుకుంటూపోతే తల్లిదండ్రులు సైతం తమ పిల్లల ప్రవర్తనను నిత్యం గమనిస్తూ, పర్యవేక్షిస్తూ ఉండాలి,ఏవైనా తమ పిల్లల వ్యవహారశైలిలో మార్పులు చోటు చేసుకుంటే తక్షణమే వారిని సైకాలజిస్టుల దగ్గరకు తీసుకెళ్లి వారి చెడు ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు తీవ్ర కృషి సల్పాలి.
ఏదిఎమైన ఈ సందర్బంగా కొంతమంది మేధావి వర్గాల వారు సెలవిచ్చినట్లు పిల్లలకు మద్యం,సిగరెట్లు,బీడీలు అమ్మకుండా చర్యలు తీసుకోవడంతో పాటు,బాగా అభివృద్ధి చెందిన చైనా, ఆస్ట్రేలియా దేశాల మాదిరిగా చిన్న పిల్లలకు అష్లీల సైట్స్,సోషల్ మీడియా,స్మార్ట్ ఫోన్స్ వంటివి అందుబాటులో లేకుండా చాలా కఠినమైన చట్టాల అమలులోకి తేయాల్సిన తక్షణ కర్తవ్యం గురుతర బాధ్యత మన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పెద్దల భుజస్కందాలపై ఎంతైనా వుంది.ఏమైనా పిల్లల్లో రోజు రోజుకు అడుగంటిపోతున్న మానవతా విలువలను తిరిగి వారిలో పెంపోందింపజేసేలా,అదేమాదిరి తమ పిల్లలకు ఏమైనా చెడు స్నేహాలు,వ్యసనాలు ఉంటే సత్వరమే,తక్షణమే వాటిని వారు వదిలించుకునేలా వారి మనస్సులను ప్రక్షాళన చేయాల్సిన కర్తవ్యం,బాధ్యత ప్రతి యొక్క విద్యార్థుల తల్లిదండ్రులపై ఎంతైనా వుంది అనే మాట సత్య దూరం కాదు.అంతకుమించి చెడు పంథాలో వెళుతున్న పిల్లల నడవడికలో మార్పు తెచ్చేందుకు సైతం యుద్ధ ప్రాతిపదికన ఓక వైపు పిల్లల తల్లిదండ్రులు మరో వైపు ఉపాధ్యాయులు తీవ్ర కృషి చేయాల్సిన కాలం,తక్షణ అవసరం అసన్నమైంది.చీకట్లు కమ్ముకున్న పిల్లల జీవితాల్లో మనమంతా వెలుగులు నింపే ప్రయత్నం చేయడమే కాదు,అదేమాదిరి ఓ మానవతావాదులుగా కూడా ప్రతి ఒక్క ప్రజానీకం పిల్లలకు ఓ ఉజ్వల భవిష్యత్ ను ప్రసాదించేందుకు సైతం తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నం గావిస్తే మాత్రం ఖచ్చితంగా,తప్పక నూటికి నూరు పాళ్ళు ఓ మంచి ఫలితం దక్కి తీరుతుంది అనడంలో ఎలాంటి సందేహనికి తావు లేదు.నేటి పిల్లలు ఓ బాధ్యత గల రేపటి భారత పౌరులుగా ఎదగాలి కాని,ఓ విధ్వంసకర శక్తులుగా అసలు ఏ మాత్రం,ఎలాంటి పరిస్థితుల్లో ఎదగకూడదు! జై హింద్!మేరా హిందూస్తాన్ మహాన్!🇮🇳🇮🇳🇮🇳
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #పిల్లలు


