#మన సంప్రదాయాలు సమాచారం కవికి ఇంతకన్నా ఏం కావాలి?_*
*నేనైతే, ఒక కవి పాడెను మోసిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదు. గత ప్రభుత్వాల అధినేతలు రాజాంతఃపురాలలో ఉండి శ్రద్ధాంజలి సందేశాలను పంపిన వారే కానీ, ఇలా ఒక కవి అంతిమయాత్రలో పాల్గొన్న వారు లేరు.*
*ఈ విషయంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రోటోకాల్ ను పక్కన పడేసి, మట్టిలో కలిసి మాయమైపోతున్న అందెశ్రీ పార్థివ శరీరం పక్కన నిలవడం, చివరిసారిగా, దింపుడు కళ్ళెం దగ్గర చెవిలో పిలవడం, నోట్లో పాలు పోయడం, అతనికి అందెశ్రీ పట్ల ఉన్న అభిమానానికి, ప్రేమకు తార్కాణం.*
*రాజకీయాలు, ద్వేషాలు వదిలి, సజల నయనాలతో ఈ దృశ్యాన్ని వీక్షించండి.*
*_జోహార్ ప్రకృతికవి అందెశ్రీ!_*


