ShareChat
click to see wallet page
search
మగాడు తన బాహుబలాన్ని స్త్రీ మనసు గెలవటానికి కాకుండా స్త్రీని బానిస చేయటానికి వాడుతూ వచ్చాడు ప్రకృతిలో మిగతా జీవులు హృదయం గెలవటానికి మాత్రమే అందం, బలం ప్రదర్శిస్తాయి... మనిషి కూడా వేల ఏళ్ళ ముందు అంతే ఇది నేటికీ కొన్ని ఆదిమ మానవ జాతుల్లో కనిపిస్తుంది... ఆధునిక దేశాల్లో లింగ సమానత్వంపై అవగాహన వచ్చింది... ఇంకా ఇక్కడే నువ్వు పుట్టి పెరిగిన వాతావరణంలో స్త్రీ బానిసత్వం నీ హక్కుగా ఫీల్ అవుతూ పెంచబడ్డావు అందుకే నీ అంతరంగంలో ఆమె స్వేచ్ఛపై ద్వేషం నీలో భయం మూలుగుతున్నాయి... అందుకే నేటికీ స్త్రీని బంధీగా ఉంచే మార్గాలే వెతుకుతున్నావ్... చీకట్లోనూ వెలుతురే బావుంటుంది అందుకే దీపం పెట్టుకున్నాం... కాస్తా ఆలోచించ్చు పిల్లోడా మగతనం అంటే అభిమానం పేరుతో రోడ్లపై చేరి రంకెలు వేస్తున్న స్థాయికి దిగజారటమా... కొందరి స్వార్ధం కొందరి వెనుకబాటు తనం కలిపి సమాజాలు ఎలా నాశనం అవ్వాలో అలా అయిపోతాయి... అలా అవ్వటానికి చరిత్రలో మగవారే కారణం... స్త్రీల వల్లే అనేవారు లేకపోలేదు ఇక్కడ నీ బలహీనత లేదా నీ అత్యాశ లేదా నీ బలుపు అదే కారణం వాస్తవం... బలం బలగం ఒక్కడికి కావాలంటే ఆ బలగంలో నువ్వు ఓ పావు... గ్రహించు బిడ్డా... అటు స్త్రీని ఇటు సమాజాన్ని నువ్వే శాశిస్తున్నావ్... నీ 'ఉనికి' కి మూలం మరచిపోతున్నావ్... లింగ వివక్ష చూపకుండా బిడ్డల్ని పెంచటం ఒక ఉద్యమంలా సాగితే తప్ప ఈ తుప్పు పట్టిన మెదళ్ళు మారేలా లేవు... (ఈ పోస్ట్ కి ప్రేరణ నిన్న పక్కింటినుండి వినిపించిన ఓ కేక మరిది వస్తే వెంటనే లేచి తిండి పెట్టవా దొబ్బెయ్ ఈ ఇంటినుండి రోజంతా ఇంట్లో తిని పడుంటున్నవ్ ఇంటి కోడలివి అని గుర్తు పెట్టుకో ఇదండీ మన కుటుంబ వ్యవస్థ ) ఈ మగాళ్ళే రోడ్లక్కి చొక్కాలు చించుకుంటూ కండలు చూపి రంకెలు వేసి మగతనం అంటూ చూపించేది ఇది కోట్లమంది మగవారికి అంకితం మంచిమగవారికి.....🙏🙏🙏🙏🙏 # Only For Those Male Ego People...... #💗నా మనస్సు లోని మాట #sad reality of life😔 #sad reality 💔 #నేటి సమాజంలో...???!!! #నేటి సమాజంలో........?????
💗నా మనస్సు లోని మాట - ShareChat