ShareChat
click to see wallet page
search
#🙏సుబ్రహ్మణ్య స్వామి #ఆడి కృత్తిక శుభాకాంక్షలు #శ్రీ కాళహస్తి విశేషాలు #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱 కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః కరోతు నిత్య కళ్యాణ కరుణా వరుణలయం ఓం శం శరవణ భవ 🙏🙏 దక్షిణ కైలాసం మరియు సద్యోముక్తి క్షేత్రమైన శ్రీ కాళహస్తి మహా క్షేత్రంలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో ఉపాలయాలమైన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారి సన్నిధిలో ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా జరుగుతున్న శ్రీ స్వామి అమ్మవార్ల వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు (23.07‌.2025) సాయంత్రం శ్రీ చెంగల్వరాయుని పార్వేట ఉత్సవం వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా చప్పర వాహనంపై విశేష అలంకరణలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారు ప్రధాన ఆలయం నుంచి కసా గార్డెన్ కి ఊరేగింపుగా చేరుకున్నారు. అనంతరం అక్కడ విశేష పూజలు నిర్వహించి, అనంతరం ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. సౌజన్యం — శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఫేస్బుక్ పేజీ హరోం హర వెల్ మురుగున్కు హరోం హర 🙏🙏
🙏సుబ్రహ్మణ్య స్వామి - ShareChat