#🔴జూలై 29th అప్‌డేట్స్📢 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చేతులెత్తేసిన రేవంత్ ప్రభుత్వం❗
రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లు, గవర్నర్‌కు పంపిన అర్డినెన్స్ ముసాయిదాపై చర్చ జరిగింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు ముగిసిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చ జరిగినట్టు తెలిసింది. ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించి పంపిన రెండు బీసీ బిల్లులు కేంద్రం వద్ద, ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ వద్ద పెడింగ్‌లో ఉన్న విషయాన్ని మంత్రివర్గం చర్చించినట్టు సమాచారం.
కులగణనపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని, 50% పరిమితిని తొలగించకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం అసాధ్యమని న్యాయ నిపుణులు సూచించినట్టు సమాచారం. ఇందుకోసం గతంలో సుప్రీంకోర్టులో వీగిపోయిన వివిధ రాష్ర్టాల కేసులను న్యాయ నిపుణులు ప్రస్తావించినట్టు సమాచారం.
దీంతో బీసీ రిజర్వేషన్లు అమలు బాధ్యతను బీజేపీ మీదకు నెట్టాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించినట్టు తెలిసింది. అసెంబ్లీలో ఆమోదించి పంపిన రెండు బీసీ బిల్లులు కూడా ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, ఎలాగూ బంతి కేంద్రం కోర్టులోనే ఉన్నది కాబట్టి, రిజర్వేషన్ల అమలు బాధ్యతలు కూడా బీజేపీ మీదనే పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి ఢిల్లీలో రాజకీయ హల్‌చల్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.


