#😓మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత🥀 #శ్రదంజలి 💐 #rip #kcr జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ గారి కుమారుడు ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ ను ఫోన్ లో పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు
తెలంగాణ ఉద్యమ సందర్భంగా శిబూ సోరెన్ గారితో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని హేమంత్ సోరెన్ తో పంచుకున్న కేసీఆర్ గారు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమానికి శిబూ సోరెన్ గారు అందించిన అపూర్వ సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని గుర్తుచేసుకున్న కేసీఆర్ గారు
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ గారి మృతిపట్ల తీవ్ర సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు శిబూ సోరెన్ కుమారుడు, జార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. శిబూ సోరెన్ గారితో సుదీర్ఘకాలంపాటు తనకున్న ఉద్యమ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న కేసీఆర్ గారు.. హేమంత్ సోరెన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. 14 ఏళ్లపాటు సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో శిబూసోరెన్ గారు ఆది నుంచి అపూర్వ సహకారాన్ని అందించారని, స్వరాష్ట్ర కల సాకారమయ్యే వరకూ అడుగడుగునా అండగా నిలిచారని ఉద్యమ జ్ఞాపకాలను కేసీఆర్ గారు హేమంత్ సోరెన్ తో పంచుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు శిబూ సోరెన్ గారి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పార్టీ తరఫున గౌరవ సూచకంగా పంపిస్తున్నామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.


