ShareChat
click to see wallet page
search
#వై యస్ రాజశేఖర్ రెడ్డి 💖💖💖 *జనం గుండెల్లో చెరగని ముద్ర..ఆయనకే ఎందుకంత ఆదరణ..❓* 08.07.2025🌹 వైయస్సార్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే ప్రజలకు గుర్తుండిపోయే పేరు. ఆయన పేరు వింటే ఇప్పటికి చాలామంది ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మడమ తిప్పని గుణం.. ఎలాంటి వారితోనైనా సరే ఎదురెళ్ళి ధైర్యం. సహాయం కోసం అడిగిన వారికి అండగా నిలవడం వల్ల జనంలో నుంచి వచ్చిన నాయకుడిగా పేర్కొన్నారు వైయస్సార్. శత్రువు నైనా సరే ఆప్యాయంగా పలకరించే గుణం కలిగిన నాయకుడిగా పేరు సంపాదించారు. ప్రజలకు దూరమై ఎన్నేళ్లు అయిన అందుకే ఆయన గురించి ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నారు. ఈ రోజున వైయస్సార్ జయంతి సందర్భంగా మళ్లీ వైఎస్ఆర్ కి సంబంధించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి తెలుగు రాజకీయాలలో గుర్తుండిపోయే పేరుగా నిలిచిన వైయస్సార్ కాంగ్రెస్ను ఉమ్మడి ఏపీలో అధికారంలోకి తీసుకురావడానికి న్యాయకత్వం వ్యవహరించారు. కేంద్రంలో కూడా అధికారం దక్కేలా చేశారు వైయస్సార్. రూపాయికి వైద్య సేవలు అందించిన డాక్టర్ గా పేరు సంపాదించారు. ఎన్టీఆర్ హవా కొనసాగిస్తున్న సమయంలో కూడా కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ ఎంపీగా ఎమ్మెల్యేగా ఓటమిలేని ప్రస్థానాన్ని అందుకున్నారు. వైయస్సార్ ను పులివెందుల ముద్దుబిడ్డగా ఉంటారు.. 2004, 2009 లో సీఎం గా అయ్యారు. ఇక 2004 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రభుత్వాన్ని తన పాదయాత్రతోనే ఓడించి చెక్ పెట్టారు. జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవడానికి ముఖ్య కారణం ఆరోగ్యశ్రీ, ఫీజు రిమెంబర్మెంట్ , ఆంధ్రప్రదేశ్లో ఉండే కొన్ని లక్షల మంది యువతను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చేశారు. ముఖ్యమంత్రిగా తన మొదటి ప్రమాణ స్వీకారమే ఉచిత విద్యుత్ పైన మొదటి సంతకం చేశారు. అయితే అలా చేసిన రోజున 1100 కోట్ల రూపాయల వ్యవసాయ విద్యుత్ బకాయిలను కూడా రద్దు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ వల్ల ఉచితంగా వైద్యాన్ని అందించేలా చేశారు. జల యజ్ఞం పేరుతో ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. సుమారు 85 ప్రాజెక్టులను చేపట్టారు. అందుకే ప్రత్యర్థులు కూడా వైయస్సార్ ని తలుచుకుంటూ ఉంటారు.2009 లో రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రచ్చబండ కార్యక్రమానికి బయలుదేరి వెళుతూ ఉండగా సెప్టెంబర్ 2- 2009న హెలికాప్టర్ల ప్రయాణిస్తూ మరణించారు. మరణించి ఇప్పటికీ ఎన్నో ఏళ్ళు అవుతూ ఉన్న రాజన్నను మరువలేక పోతున్నారు ప్రజలు.
వై యస్ రాజశేఖర్ రెడ్డి 💖💖💖 - Ddl 50 ನುಥನ ಗಂಟ  న @ acsಖdor es6 Laಯ೩aedreedFe oaಬoser Ddl 50 ನುಥನ ಗಂಟ  న @ acsಖdor es6 Laಯ೩aedreedFe oaಬoser - ShareChat