ShareChat
click to see wallet page
search
#అమ్మకు వందనం🙏🙏 *అదనపు అమ్మ స్తన్యం… ఎందరెందరో బిడ్డలపై ‘అమ్మతనం’..❗* August 7, 2025🙏 ఈరోజు నచ్చిన వార్తల్లో ఒకటి… *‘అమృతం పంచుతారిక్కడ’* శీర్షికతో స్టోరీ అది… చనుబాలను దానం చేసే దాతలు, అవి సేకరించే సంస్థలకు సంబంధించిన స్టోరీ… బాగుంది… నవజాత శిశువులకు స్తన్యం అత్యంత బలవర్ధకమైన ఆహారం, ఆ పాలతోనే పిల్లల ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి… కొందరు తల్లులకు సరిగ్గా పాలుపడవు లేదా కొందరు పిల్లలకు తల్లులుండరు వేర్వేరు కారణాలతో.. వాళ్లకు చనుబాలు దొరక్కపోతే సరిగ్గా ఎదగరు… ఎస్, వాళ్లకు చనుబాలు అంటే అమృతమే… ప్రాణాల్ని, ఆరోగ్యాల్ని కాపాడే అమృతం… ఈ స్టోరీలో నచ్చింది ఏమిటంటే… బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా శ్వేత తను స్వయంగా 6.7 లీటర్ల పాలను దానం చేసింది… నీలోఫర్‌కు అనుబంధంగా పనిచేసే ఓ మిల్క్ బ్యాంకు ద్వారా ఆమె ఈ దానం చేసింది… నీలోఫర్ పిల్లల హాస్పిటల్‌కు వచ్చే శిశువులకు ఈ చనుబాల బ్యాంకు మంచి సేవ చేస్తున్నట్టే… చాలామంది ఆడవాళ్లు తమ అందం, పొంకం సడలిపోతాయనే పిచ్చి భ్రమలతో సొంత బిడ్డలకే పాలివ్వరు… చాలా ఉదాహరణలు చూస్తుంటాం… అలాంటిది ఓ సెలబ్రిటీ ఏ సంకోచాలూ మనసులోకి రానివ్వకుండా… తన సంతానానికి సరిపోగా మిగిలే పాలను లీటర్లకొద్దీ దానం చేయడం నిజంగా గ్రేట్… సెలబ్రిటీలు ఇలా చనుబాలను దానం చేస్తే, అది ఎంతోమందికి స్పిరిట్… చనుబాల దానంపై ఉన్న అపోహల్ని దూరం చేస్తుంది… అది నవజాత శిశువులకు వరం… రోజుకు పదిపన్నెండుసార్లు 20- 40 ఎంఎల్ పాలు కావాలి శిశువులకు… చాలామందికి పాలు అదనంగా వస్తాయి… వాటిని శాస్త్రీయంగా సేకరించి, నిల్వ చేసి, అవసరమున్న శిశువులకు అందించే బ్యాంకులు చాలా తక్కువ ఉన్నాయి… పెరగాలి… అదనపు పాలను పిండితే కేలరీలు నష్టపోతారు, బరువు తగ్గుతారు, అందం పోతుంది అని రకరకాలుగా దాతలను నిరుత్సాహపరుస్తారు, భయపెడతారు కొందరు… వింతగా చూస్తారు, వ్యాఖ్యానాలు చేస్తారు… అవిగో అలాంటివి బ్రేక్ చేయడానికి గుత్తా జ్వాల వంటి సెలబ్రిటీ పాలదాతలు అవసరం, వాళ్లకు ప్రచారాలూ అవసరం… ఈనాడు వార్త ఈ దిశలో అభినందనీయం… విదేశాల్లో చాలామంది దాతలు ఉంటారు, బ్యాంకులూ ఉంటాయి… మన దేశంలో ఇంకా అవేర్‌నెస్ అవసరం… అన్నట్టు ఇండియా రికార్డ్స్‌లో, లిమ్కా బుక్కులో నమోదైన ఓ ‘అమ్మ’ గురించి చెప్పుకోవాలి ఇక్కడ… తమిళనాడు, తిరుచ్చి, జిల్లా కట్టూరు… ఆమె పేరు సెల్వ బృంద, 33 ఏళ్ల గృహిణి… ఆమెకు అదనంగా పాలున్నాయి… మొదట్లో సంకోచించింది దానం చేయడానికి, ఇరుగూపొరుగూ నిరుత్సాహపరిచారు, భయపెట్టారు… తరువాత పిల్లలకు పాలు, అంటే ప్రాణం పోయడమే అనుకుంది… 22 నెలల్లో ఎన్ని పాలు దానం చేసిందో తెలుసా..? 300 లీటర్లు… అక్షరాలా 300 లీటర్లు… ఎందరు పిల్లలకు ఆమె ‘అమ్మ’ అయిందో కదా… 2023-24 లో తిరుచ్చి ఎంజీఎం హాస్పిటల్ అనుబంధ మిల్క్ బ్యాంకుకు వచ్చిన మొత్తం పాలల్లో సగం ఆమెవే… ధన్యజీవివమ్మా..!!
అమ్మకు వందనం🙏🙏 - Champion's Gift of Life Wa na Jwala Gutta menownao Badminton Played Philanthropist donated 670Oml O' oTprossod broast milk ' అమృతం పంచుతారిక్కడః ೨೦೦೮೫ [ {   న Champion's Gift of Life Wa na Jwala Gutta menownao Badminton Played Philanthropist donated 670Oml O' oTprossod broast milk ' అమృతం పంచుతారిక్కడః ೨೦೦೮೫ [ {   న - ShareChat