మానవాళికి గగనతలంలో ప్రాణభయం పుట్టిస్తున్న విమాన ప్రమాదాలు!
లేదా
ఆశలసౌదంలో,అపార మేథోశక్తి సామర్త్యాలతో చెట్టాపట్టాలు వేసుకొని మరీ విహారిస్తున్న మానవమేథస్సుకు కఠినపరీక్ష పెడుతున్న ఈ పెనువిషాద విమాన దుర్ఘటనలు!
ఇదివరకు విమానయానం అంటే ఓ సరదాగా, హుందాతనానికి,దర్పానికి మారుపేరుగా ఉండేది, నిలిచేది కూడా!
కానీ ఇప్పుడు అది కాస్తా ప్రాణ,యమగండంగా మారింది!
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత మనిషి ప్రాణం విలువ ఏ పాటిదో ప్రతి ఒక్కరికి బహు బాగా బోదపడింది!
ఏ క్షణాన,ఏ సందర్భాన ఎంతో విలువైన మనిషి ప్రాణానికి ఎసరు,ముప్పు వస్తుందో ఏ మాత్రం చెప్పలేని సంధిగ్దావస్థలో పడ్డ నేటి మానవ జీవన మనుగడ!
ఓక విధంగా ఇలాంటి చేదు సంఘటనలు జరిగినప్పుడు పెరుగుట విరుగుట కొరకేనేమో అని మనకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉండటం అత్యంత సహజమైన ప్రక్రియ!
ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ,శాస్త్ర,సాంకేతిక రంగాలు ఇదివరకు ఎన్నడూలేని రీతిలో అత్యంత శరవేగంగా రాకెట్ వేగంతో,రాజధాని,శతాబ్ది ఎక్ష్ప్రెస్స్ లా దూసుకుపోతున్నప్పటికి మనిషి ప్రాణం మాత్రం ఓ నీటి బుడగలా తయారు అయ్యి ఎప్పుడు ఆవిరి అయ్యి శూన్యంగా మారుతుందో ఒక్క మానవ సృష్టికి కారణమైన బ్రహ్మ దేవుడికి తప్ప మానవమాత్రులకు ఏ మాత్రం అంతుపట్టని ఓ గూడచార రహస్యంగా మిగిలిపోతున్నది!
అదేమాదిరి మానవ అభ్యున్నతి,మేథోసంపత్తి ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుకు ఎదుగుతున్నప్పటికి మనిషి స్వార్థం,అధికార వ్యామోహం,అహంభావం, అధిపత్య,దౌర్జన్య ధోరణిలు,కుటిల,కపట దుష్ట పన్నాగాలు,కుట్రలు,కుతంత్రాలు,ఈర్ష,ద్వేషాలు ఈ సమాజంలో ఓ అడ్డు,అదుపు లేకుండా పెచ్చుమీరిపోతున్నాయి అనే మాట సత్యదూరం కాదు.
ఏదిఏమైన నాటి విమానయానం మానవాళికి ఎంతో ఉల్లాసానికి,హుందాతనానికి,రాజఠివికి,దర్పానికి, హంగు,ఆర్భాటాలకు ప్రతిరూపంగా ఉండేది, నిలిచేది కూడా.అదేం కాలం కర్మమో గాని డామిడ్ కథ అడ్డం తిరిగింది తరహాలో నేటి విమానయానం ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నది.మొన్నటి మొన్న గుజరాత్ రాష్ట్రం పరిధిలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఘోర విమాన ప్రమాదమో కాదు ఈ మధ్య తరచుగా పలు విమానాలలో సాంకేతిక లోపాలు పదే పదే తలెత్తుతూ విమానాలను అత్యవసరంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే ప్రయత్నంలో అనేక ప్రమాదాలు తలెత్తుతుండటంతో విమానయానం అనేది ప్రస్తుతం మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే ఓ తంతు కార్యక్రమంలా తయారు అయ్యింది అనే మాట సత్యదూరం కాదు.
ఏమైనా ఇక నుంచి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు సెలవిచ్చినట్లు కలియుగం అంతానికి ఇలాంటి అత్యంత విషాధకరమైన,కడు దుఃఖభరితమైన విమానయాన ప్రమాదాలు ఓక సూచిగా, నిలుస్తున్నాయా,నాంది పలుకుతున్నాయా అనే సందేహం ప్రతి ఒక్క మానవాళికి తప్పక రాకమానదు.
అన్నింటికి మించి ఇక నుంచి విమానంలో ప్రయాణించాలన్న,విహరించాలన్న మన ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని,మన నిండు ప్రాణాల మీద గంపెడు ఆశలు వదలుకొని మరీ విమాన ప్రయాణానికి తప్పని భాగ్యంగా నడుం బిగించాల్సిందే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విమానయానం అనేది యావత్తు మానవాళికి ఎంతో సాహసం,దుస్సాహాసం,దైర్యే సాహసలక్ష్మీ తరహాలో అధిక శ్రమ,విపరీత ఒత్తిడితో కూడిన ప్రక్రియగా అవతరించింది అనే మాట అక్షర సత్యం!🛩️🛩️🛩️🛩️✈️✈️✈️✈️🛫🛫🛫🛫
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #hyderabad flight


