ShareChat
click to see wallet page
search
#హరి హర వీర మల్లు 💥💥 *హరి..హర.. ఓ విషాదాంత గాధ❗* JULY 30, 2025💃 సనాతన ధర్మాన్ని ఆలంబన చేసుకుని అల్లుకున్న ఆసక్తికరమైన కథతో వచ్చిన సినిమా హరి హర వీరమల్లు. గోల్కొండ నుంచి ఢిల్లీ చేరిన కోహినూర్ వజ్రాన్ని వెనక్కు తీసుకురావడం అన్నది కనిపించే లక్ష్యం. ఢిల్లీ సుల్తాన్ దగ్గర బందీగా వున్న సనాతన ధర్మ పరిరక్షకులను విడిపించి తీసుకురావడం అన్నది అసలు లక్ష్యం……. ఆలోచన..ఆలంబన చేసుకున్న కథ మంచివే. కానీ ఎక్కడో, ఎందుకో..ఎలాగో మిస్ ఫైర్ అయింది. దాంతో సినిమా బాక్సాఫీస్ విజయం సాధించకలేపోయింది. దాని వల్ల బయ్యర్లు దారుణంగా కుదేలయిపోయే పరిస్థితి ఏర్పడింది. దానికి ఏది.. ఏమిటి కారణం అనేది అంత సులువుగా చెప్పేది కాదు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్న రీతిగానే హరి హర బాక్సాఫీస్ ఫెయిల్యూర్ కు అనేకానేక కారణాలు. ఆ సంగతి పక్కన పెడితే ఏపీలో సినిమాను కొన్న బయ్యర్ల పరిస్థితి ఏమిటి అన్నది పాయింట్. ఏపీ అంటే సీడెడ్ మినహా మిగిలిన ఆంధ్ర అంతా కలిపి 50 కోట్ల మేరకు బయ్యర్లు ఈ సినిమాను కొనడానికి వెచ్చించారు. ఇప్పటి వరకు చూసుకుంటే ఖర్చులు పోను సగం మేరకు రికవరీ అయింది. మిగిలిన సగం మేరకు ఇక వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే రేపటి నుంచి థియేటర్లలోకి కొత్త సినిమా వస్తోంది. కాస్త క్రేజ్ వున్న కింగ్ డమ్ సినిమా రావడం వల్ల గురు, శుక్ర, వారాలు జనం దృష్టి అటే వుంటుంది. శని, ఆదివారాలు మళ్లీ హరి హర వైపు కొంత వరకు చూడొచ్చు. కానీ అది సరిపోదు. [30/07, 20:04] Venkateswara Rao P: హరి హర సినిమా మంగళవారం నాటికే చాలా అంటే చాలా వరకు జారిపోయింది. థియేటర్లు రెంటల్ లెక్కన చూసుకుంటే దాదాపు అన్ని ఏరియాలు డెఫిసిట్ లోకి వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో ఎలాగూ పర్సంటేజ్ లు కడతారు కనుక అది వేరే సంగతి. కానీ బయ్యర్ల పరిస్థితి ఏమిటి అన్నదే పాయింట్. ఉత్తరాంధ్ర 12 కోట్ల మేరకు ఇచ్చి తీసుకున్నారు. మరో నాలుగైదు కోట్ల వరకు రావాల్సి వుంది. అక్కడ బయ్యర్ రెగ్యులర్ గా సినిమాలు చేసే వారు కాదు. రేర్ గా సినిమాలు పంపిణీ చేస్తూ వుంటారు. ఈస్ట్ లో బయ్యర్ లేరు. అందువల్ల థియేటర్ల యజమానులు నేరుగా నిర్మాతకే అడ్వాన్స్ లు పంపారు. దాదాపు ఆరు కోట్ల మేరకు ఇలా అడ్వాన్స్ లు పంపారని తెలుస్తోంది. ఒక్కో థియేటర్ కు లక్ష నుంచి నాలుగైదు లక్షల వరకు డెఫిసిట్ వస్తుంది. అందువల్ల వీరంతా వెళ్లి అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్ద మొత్తాలు కాదు. వెస్ట్ బయ్యర్ ది చిత్రమైన పరిస్థితి అని తెలుస్తోంది. నిర్మాత కొంత మొత్తం వెస్ట్ బయ్యర్ కు గతంలో ఇవ్వాల్సి వుంది. ఇప్పుడు సెటిల్ మెంట్ లో భాగంగా, ఆ మొత్తం పోను మరికొంత చెల్లించి ఈ సినిమా తీసుకున్నారు. ఇప్పుడు చూస్తుంటే గతంలో రావాల్సిన మొత్తానికి మరి కొంత అదనంగానే పోగొట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. గుంటూరు..నెల్లూరు కలిసి ఒకే బయ్యర్ తీసుకున్నారు. సాధారణంగా ఆయన ఆచి తూచి, అన్నీ తెలుసుకుని సినిమాలు తీసుకుంటారని, రిస్క్ అన్నది దగ్గరలో లేకుండా చూసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ వుంది. అలాంటి బయ్యర్ లాస్ట్ మినిట్ లో 12 కోట్ల మేరకు చెల్లించి రెండు ఏరియాలకు తీసుకున్నారు. ఇప్పుడు దాదాపు మూడు కోట్ల మేరకు పొగట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాది ఇదే పరిస్థితి. ఇవన్నీ ఇలా వుంచితే బయ్యర్లు పోగొట్టుకునే మొత్తాల సంగతి అలా వుంచితే ఒక్క ఏపీ (సీడెడ్ మినహా) 10 కోట్ల మేరకు జిఎస్టీలు కట్టాలి. అది ఇచ్చినా బయ్యర్లు కొంత మేరకు హ్యాపీ అవుతారు. కానీ అలా ఇచ్చే పరిస్థితి నిర్మాత దగ్గర వుందా అన్నది అనుమానం. ఏపీ సంగతి ఇలా వుంటే సీడెడ్ సంగతి పెద్దగా తేడా లేదు. నైజాం లెక్కలు ఎవరికీ తెలియవు. మైత్రీ సంస్థ, పీపుల్స్ మీడియా సంస్థ కలిసి ఈ సినిమాను ఏ మేరకు తీసుకున్నారు, ఏ మేరకు చెల్లింపులు చేసారు ఇవన్నీ బయటకు పూర్తిగా రాలేదు. 33 కోట్ల మేరకు నిర్మాతకు వచ్చినట్లు వార్తలు వున్నాయి. ఇక్కడ ఇప్పటికి 17 కోట్ల మేరకు మాత్రమే రికవరీ వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఓ మంచి ఆలోచన, మంచి కథతో చేసిన మంచి ప్రయత్నం ఇలా విషాదాంతగా మిగిలింది.
హరి హర వీర మల్లు 💥💥 - ShareChat