#🔴జూలై 20th అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 మోదీ.. గ్రాఫ్ డౌన్!
దశాబ్దకాలం పాటు ఇష్టా రాజ్యంగా.. ఒక రకంగా నియంతృత్వ పోకడలతో అంతా తానే అన్నట్టు వ్యవహరించిన ప్రధాని నరేంద్ర మోదీ తడబడుతున్నారు. సంప్రదింపులు, సమీక్షలు వంటి పదాలకు అర్థం తెలియదన్నట్టు ఏకపక్షంగా చట్టాలను చేసిన ఒకప్పటి బీజేపీ అధినాయకత్వం.. ఇప్పుడు ప్రతీ విషయంలో పీఛేముడ్ అన్నట్టు వ్యవహరిస్తున్నది.
మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ధరలను కట్టడి చేయడంలో ఎన్డీయే సర్కారు ఘోరంగా విఫలమైంది. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలోనూ ఫెయిలైంది. దీన్ని ధ్రువపరుస్తూ.. 11 ఏండ్ల మోదీ ప్రభుత్వ పాలనలో ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి రెండు అంశాలు అతి పెద్ద వైఫల్యాలని ‘ఇండియాటుడే-సీ వోటర్’ ఇటీవల చేసిన సర్వేలో ఏకంగా 42 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఇక, రూపాయి పతనం, కంపెనీల మూసివేత, ఎగుమతుల క్షీణతతో దేశ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అన్నింటికీ మించి మోదీ మూడో దఫా పాలనలో శాంతి-భద్రతలు అదుపు తప్పాయి. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో హత్యలు, లైంగిక దాడులు, దోపిడీలు నిత్యకృత్యంగా మారిపోయాయి.


