ShareChat
click to see wallet page
search
సాధారణంగానే హిందువులు తిథుల్లో ఏకాదశిని విశిష్టమైనది భావిస్తారు. ఒక ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అందులోనూ ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి (జులై 6) అత్యంత పవిత్రమైనది. ఇది ఆషాడమాసంలో వచ్చే తొలి ఏకాదశి తిథి కావడం వల్ల తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీన్ని శయన ఏకాదశి, పద్మా ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీమహావిష్ణువు శయనావస్థలోకి (యోగనిద్రలోకి) ప్రవేశిస్తారని పురాణగాథలు చెబుతున్నాయి. ఈ కాలాన్ని చాతుర్మాసంగా పిలుస్తారు. అంతేకాదు, తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు కావున భక్తులు ఈ రోజు ఉపవాసం ఉండి.. విష్ణువుని పూజిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. తొలి ఏకాదశి ఉపవాస దీక్ష చేసేవారు ఉదయమే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహానికి ప్రత్యేకంగా అలంకరించుకోవాలి. అనంతరం ఆవునేతితో దీపారాధన చేసి, పసుపు రంగు పువ్వులతో, తులసి దళాలతో, అక్షింతలతో స్వామివారిని పూజించాలి. ఈ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. పాలు, పళ్లులాంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. మరుసటి రోజైన ద్వాదశి ( జులై 7) నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. #తోలి ఏకాదశి #toli eakadasi subhakanshalu #toli ekadashi special #🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ #ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
తోలి ఏకాదశి - ShareChat