S.HariBlr (Bangalore)
1K views • 3 months ago
#😇My Status #పురాణ గాథలు/కథలు #హిందూ పురాణ కథలు *శ్రీ కృష్ణుని మాయకు బ్రహ్మదేవుడే ఓడిపోయాడు* వృందావనంలో శ్రీకృష్ణుడు గోవులను మేపుతూ గడిపిన రోజులలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఇది. ఒకసారి బ్రహ్మదేవుని మనసులో శ్రీకృష్ణుని మహిమను పరీక్షించాలని సంకల్పం కలిగింది. "నందుని కుమారుడైన ఈ కృష్ణునిలో నిజంగా ఎంతటి దైవత్వం ఉందో చూద్దాం" అని ఆయన భావించాడు. ఒక రోజు మధ్యాహ్న భోజనం అనంతరం శ్రీకృష్ణుడు కదంబ వృక్షం నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. సమీపంలో గోవులు, దూడలు, గోపబాలులు కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. కొద్దిసేపటి తరువాత కృష్ణుడు ఒక్కసారిగా లేచి చూసే సరికి అక్కడ గోవులు, దూడలు, గోపబాలులు ఎవ్వరూ కనిపించలేదు. "వీరంతా ఎక్కడికి వెళ్లారు?" అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు వారందరి కోసం వెతకడం ప్రారంభించాడు. ఎంత వెతికినా గోవులు, దూడలు, గోపబాలులు ఎక్కడా కనిపించలేదు. వారు ఎలా కనిపిస్తారు? బ్రహ్మదేవుడు వారందరినీ తీసుకెళ్లి ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు. ధ్యానించిన కృష్ణుడికి జరిగిన విషయమంతా వెంటనే తెలిసిపోయింది. తనను పరీక్షించాలనే ఉద్దేశంతోనే బ్రహ్మదేవుడు ఈ లీలా చేశాడని ఆయన గ్రహించాడు.
14 shares