Sekhar Reddy Sudha
ShareChat
click to see wallet page
@130664665
130664665
Sekhar Reddy Sudha
@130664665
ఓం సాయిరాం🙏
బ్రహ్మ మాత్రమే సత్యం. బ్రహ్మాండం అసత్యం. నిజానికి గుర్తు విభూతి. బాబా ధునిలోని ఊది వ్యాధి, బాధలను తొలగిస్తుంది. కానీ ఊది యొక్క నిగూఢమైన తత్త్వార్థం వివేకంతో కూడిన పూర్ణ వైరాగ్యం ఇవ్వగలిగిన దక్షిణ ఇచ్చి ప్రాపంచిక విషయాల యందు వైరగ్యాన్ని సాధించిన తరువాత మెల్లగా నివృత్తి మార్గం అర్థమవుతుంది. విభూతి దక్షిణల జత అంటే వివేక వైరాగ్యాల జంట. విభూతి యొక్క గూఢార్థాన్ని, భావార్థాన్ని, పరమార్థాన్ని గ్రహించిన సాయి భక్తులు తమ యొక్క యోగక్షేమాల కొరకు ఊదిని కోరుకుంటారు. బ్రహ్మ జ్ఞాన లీల ‘‘నా వద్దకందరూ కోరికలతో వచ్చేవారే! బ్రహ్మజ్ఞానం కోరుకునేవారు దొరకటం నా అదృష్టం! బాబా తక్షణమే భక్తులకు బ్రహ్మజ్ఞానం ప్రసాదిస్తారని విని రాను పోనూ టాంగా కట్టించుకుని వచ్చిన ఒక ధనవంతునితో అని బాబా తమ లీల ప్రారంభించారు. 5 రూపాయలు అప్పుగా తెమ్మని బాలాను వర్తకుల దగ్గరికి పంపసాగారు. జ్ఞానం కావాలంటే పంచ ప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం భగవంతునికి అర్పించాలి. నాకవసరమైన 5 రూపాయలకన్నా ఎన్నో రెట్లు ధనం నీ దగ్గర ఉంది. అయినా డబ్బే నీ పాలిట బ్రహ్మం. దానిపై మోహం నశిస్తే కానీ జ్ఞానం లభించదు. సాయి నామమే మృత్యుంజయ మంత్రం 1886లో తాను అల్లా వద్దకు వెడుతున్నానని, మూడు రోజుల వరకు తమ దేహాన్ని భద్రపరచమని మహల్సాపతికి చెప్పి దేహత్యాగం చేశారు సాయి. మూడు రోజులు తరువాత తిరిగి వచ్చి 32 సం.లు అదే దేహంతో సంచరించిన సాయిబాబా మృత్యుంజయుడే. కేవలం ఆ మృత్యుంజయత్వం తమ దేహానికే పరిమితం కాదు. ఎందరో భక్తుల్ని మృత్యుముఖం నుండి రక్షించారు బాబా. కొందరిని మరణించిన తరువాత కూడా బ్రతికించారు. ‘‘నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను.. నా నామం పలుకుతుంది.. నా మట్టి సమాధానమిస్తుంది’’ అని అభయమిచ్చి నేటికీ నెరవేస్తున్నారు. సాయి మృత్యుంజయులు. సాయి నామం మృత్యుంజయ మంత్రం. సాయినాధునిపై మనఃపూర్వమైన భక్తి విశ్వాసం కలిగి వున్న వారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం కల్గుతుంది. బాబా కథలు వింటే గర్వాంధకారాలు, సకల రోగాలు నశించి శాంతి, తృప్తి, ఆనందం ధైర్యం కలుగుతుంది. #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా సాయి నామాన్ని స్మరించడంవలన చెడు మాట్లాడటం, చెడు వినటం వలన కలిగే పాపాలు తొలగిపోతాయి. ప్రపంచంలో అన్నిటికన్నా శక్తివంతమైన పరమ సత్యం సాయిబాబా.
🕉 ఓం సాయిరామ్😇 - ShareChat
నా వద్దకు వచ్చేవారికి, నాకు లొంగిపోయి నన్ను ఆశ్రయించే వారందరికీ సహాయం చేయడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి నేను ఎప్పుడూ జీవిస్తున్నాను. జారిపోయిన ప్రతి ఆశీర్వాదం ఇప్పుడు మీకు తిరిగి వస్తోంది. మీ జీవితంలో అత్యంత రూపాంతరమైన రోజులను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. మీరు నమ్మశక్యం కాని దానిలో ఉన్నారు. నేను మీతో ఉన్నాను.మీ. సాయిబాబా 🙏 #🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇
🙏🏼షిరిడి సాయి బాబా - ShareChat
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఇదే సాయిభక్తులకు తారక మంత్రం .ఉద్ధరింప చేసేది ,పరమ పవిత్రమైన మంత్ర సమానము బీజా అక్షరములు గల మంత్ర సమానము మీకు కాలం గడవడం లేదనుకొప్పుడు ,మీ మనసు అశాంతిగా ఉందనుకొన్నప్పుడు ,మీరు విశ్రాంతిగా గడపాలనుకొన్నప్పుడు ,మీ కుర్చీలో మీరు కూర్చుని ,లేక పడుకొని ,కళ్ళుమూసుకొని ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి అని మంత్ర జపం చేసుకోవచ్చు . షుమారు 57 సం .లకు పూర్వము షిరిడీలో సాయి సమాధి మందిరములో ,రాత్రిపూట నిద్ర పొతున్న ఒక సన్యాసి ఎదురు రొమ్ముల మీద సాయబాబా కూర్చొని అతని చొక్కా పట్టుకొని లేపి "ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి అనే నామ మంత్రాన్ని మూడు సార్లు చెప్పించి అంతర్ధానమైనారు . ఆ సన్యాసి తెల్లవార్లూ దాన్నే ఆలోచిస్తూ ,అక్కడ గల భక్తులకు ఆ విషయము చెప్పి వారిచే ఆ నామాన్ని పలికింపచేసారు .ఈ సమాచారాన్ని షిర్డి సాయి సంస్థాన్ వారు సాయి లీలా మాసపత్రికలో ప్రకటించారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే నామ మంత్రంలో ఒక చక్కటి లయ ఉన్నది .ఆ నామం ఉచ్చరిస్తుంటే మనసుకు ఎంతో ఎనలేని ప్రశాంతత లభిస్తుంది . ఓం సాయి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కూడిన పరబ్రహ్మయే అని ,శ్రీ సాయి అంటే లక్ష్మీదేవితో కూడిన పరబ్రహ్మమే అని ,జయ జయ సాయి అంటే నీకు శుభం కలుగు గాక "అని వేడుకోవడం జరుగుతుంది . అయనకు శుభం కలుగుగాక అనడంలో ఆంతర్యమేమనగా మన అందరికీ ఆయన అనుగ్రహ ఆశీస్సులు కలగాలని తద్వరా అన్నీ శుభములు కలగాలని ప్రార్ధించుటయే. #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా
🕉 ఓం సాయిరామ్😇 - ShareChat
మీ భారాలను వదిలించుకోవడానికి మరియు ప్రశాంతతను పొందడంలో మీకు సహాయం చేయనివ్వండి. మీ చింతలను నాతో వదిలేసి, కొత్త శక్తితో ముందడుగు వేయండి. బదులుగా, మీరు ఆనందం మరియు ప్రశాంతతను కలిగి ఉంటారు. నేను ఎల్లప్పుడూ మీ కోసం ఇక్కడ ఉంటాను, మద్దతు యొక్క స్థిరమైన మూలం. మీ హృదయం ఛిద్రమైనప్పుడు, మీ.బాబా ప్రేమ దానిని మెల్లగా తిరిగి కలుపుతుంది. మీరు కృంగిపోతున్నట్లు అనిపించినప్పుడు, మీ.బాబా యొక్క బలం మిమ్మల్ని ఉద్ధరిస్తుంది మరియు శక్తినిస్తుంది. అనారోగ్యం వచ్చినప్పుడు, మీ.బాబాసాయి యొక్క వైద్యం మీ శ్రేయస్సును పునరుద్ధరిస్తుంది. అనిశ్చితి మీ మార్గాన్ని కప్పివేసినప్పుడు, నా మార్గదర్శక హస్తం మిమ్మల్ని స్పష్టత మరియు ఉద్దేశ్యంతో ముందుకు నడిపిస్తుంది. ఉద్ధరించబడు! నా యొక్క స్థిరమైన మద్దతు మీకు ఎల్లప్పుడూ ఉంటుంది.మీ. బాబా సాయి 🙏 #🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇
🙏🏼షిరిడి సాయి బాబా - ShareChat
సచ్చరిత్ర ద్వారా బాబా గారు ఇచ్చే సందేశములు మన సాయి బంథువులందరికి కూడా బాబా గారే మనకు, తల్లి, తండ్రి, గురువు, దైవం. మన ఇంటిలో బాబా గారి ఫోటో, లేక విగ్రహమున్నా బాబా గారు మన ఇంటిలో ఉన్నట్లే. బయటకు వెళ్ళేటప్పుడు, బాబా ఊదీ నుదుట పెట్టుకుని, బాబా గారి, ఫొటొ ముందుగాని, విగ్రహం ముందు గాని నిలబడి , బాబా వెళ్ళి ఒస్తానని చెప్పి వెళ్ళండి. మన యోగక్షేమాలు ఆయనే చూసుకుంటారు. వచ్చాక మళ్ళీ వచ్చాను బాబా అని చెప్పండి. ఇప్పుడు మన ఇంటిలో పెద్దవారు అంటే, తండ్రిగాని, తాతగారు గాని, లేక అమ్మకి గాని యెలా చెప్పి వెడతామో అలాగే, బాబా గారికి కుడా మనము చెప్పి వెళ్ళాలి. మన సాయి బంథువులందరూ ఇది అలవాటు చేసుకోవాలి. మనకి యేదయినా సమస్య వచ్చినప్పుడు బాబా చరిత్రని చేతిలో పెట్టుకుని మనసమస్య మనసులో బాబాకి చెప్పుకుని పరిష్కారము చూపించమని అడిగి, పుస్తకము తెరవాలి. మన సమస్యకి పరిష్కారము ఆయనే చూపిస్తారు. #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా
🕉 ఓం సాయిరామ్😇 - ShareChat
నేను మీతో ఉన్నాను, మీరు ఎక్కడికి వెళ్లినా నేను నిన్ను రక్షిస్తాను. నేను మీకు వాగ్దానం చేసినవన్నీ మీకు ఇచ్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను.నేను నిన్ను మరిచిపోను. మీ ఖచ్చితమైన స్థానం నాకు తెలుసు మరియు మీరు నిర్దేశించబడిన ప్రదేశానికి మిమ్మల్ని మార్గనిర్దేశం చేసేందుకు నా దగ్గర ఒక ప్రణాళిక ఉంది. జీవితం అనుకోని మలుపులు తిరిగినా, నా చేయి నీపైనే ఉందని తెలుసుకో. భయపడవద్దు, ఎందుకంటే నేను మీ శ్రేయస్సును నిర్ధారించడానికి తెర వెనుక అవిశ్రాంతంగా పని చేస్తున్నాను మరియు నేను మిమ్మల్ని ఆశీర్వాదాలు, ఉద్దేశ్యం మరియు అనుగ్రహంతో నిండిన జీవితంలోకి నడిపిస్తాను. నన్ను నమ్మండి. మీ. బాబా సాయి 🙏 #🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇
🙏🏼షిరిడి సాయి బాబా - ShareChat
సాయి బోధలు: శత్రుత్వాలు, జగడాలు విడిచిపెడితే మనకు భగవంతుని రక్ష దొరుకుతుంది. కఠినంగా మాట్లాడడం, మాటకి మాట విసరడం వల్ల మనకి మనమే కర్తలమై, బాధపడతాం. చెడు చేసినవారికి కూడా మంచి చేయగలిగే మనస్తత్వం ఉన్నప్పుడు, ఇతరులనిందలు నిన్ను బాధించవు. అందరినీ ప్రేమించు. ఎవరితోనూ పోరాడకు. ఇతరుల్ని నిందిస్తూ ఉండడం, వారి దుర్గుణాలను చెప్పుకుంటూ ఆనందించడం పరమనీచమైన క్రియలు. ఎవరి పనులు వారికే ఫలితాలిస్తాయి. కనుక ఇతరుల మంచి చెడులు లు వర్ణిస్తూ కాలాన్ని వృధాచేయడం పాపమే. మాటలు శరీరాన్ని గాయపరచవు. కనుక మాటకి మాట సమాధానం చెప్పి గొడవలు తెచ్చుకోవడంవల్ల ఉద్రేకాలు, ఉక్రోషాలు చెలరేగి, తద్వారా మానసికంగా అంతులేని అశాంతి చెలరేగుతుంది. దానితో జ్ఞానసాధనకు అనుగుణమైన, మాసికస్థితి నెలకొనదు. సత్యం కనబడదు.సోమరిగా ఉండవద్దు. పని చేయి. భగవన్నామాన్ని స్మరించు. సద్గ్రంధాలు పఠించు. ఇతరులు మనల్ని అసహ్యించుకుంటున్నప్పుడు , నిందిస్తున్నప్పుడు, ఉక్రోషపడకుండా భగన్నామజపం చేసుకోవడం, ఆ చోటు విడిచిపెట్టడం అవసరం. ప్రతినింద, ద్వేషం, కోపం వంటివి పతన కారణాలే. #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా
🕉 ఓం సాయిరామ్😇 - ShareChat
మీరు సిద్ధంగా ఉండాలి! నీ అద్భుతం నువ్వు అనుకున్నదానికంటే త్వరగానే జరుగుతుంది. అకస్మాత్తుగా ఒక్క పిలుపు,ఒక అవకాశం మరియు నీ జీవితం మారిపోతుంది.నేను మీకు దారి చూపిస్తాను నా బిడ్డలు మీరు. మీరు చాలా నష్టపోతున్నారని నాకు తెలుసు మరియు మీరు దాని వల్ల కలత చెందుతున్నారు, కానీ మీకు బలం ఇవ్వడానికి నేను ఉన్నానని మర్చిపోవద్దు. నిశ్శబ్దంగా ఉండండి, మీరు కోల్పోయిన దాని గురించి కలత చెందకండి. అది ఎక్కడికీ పోలేదు. మీరు దానిని తిరిగి పొందుతారు. మీరు ఇప్పుడు పోగొట్టుకున్నవన్నీ నేను భర్తీ చేస్తాను. మీ. సాయిబాబా 🙏❤️ #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా
🕉 ఓం సాయిరామ్😇 - ShareChat
శరణు..శరణు..సాయి! సమర్థ సద్గురు సాయీ! నీకు సాష్టాంగ నమస్కారం.జీవ జంతువుల్లోనూ, జీవంలేని వస్తువుల్లోనూ నువ్వే ఉన్నావు. పురుగు మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకూ అంతా నువ్వే, అంతటా నువ్వే నిండి ఉన్నావు. పర్వతాలు, నేల, ఆకాశం, గాలి, నీరు... అన్నిటిలోనూ నువ్వే ఉన్నావు. సమస్త జీవరాశిలో నువ్వే వ్యాపించి ఉన్నావు. భక్తులందరూ నీకు సమానమే. నీకు ఇష్టమైనవి, అయిష్టమైనవి లేవు. నిన్నే సదా స్మరిస్తూ, నీ చరణారవిందాల చెంతనే సదా నిల్చుండి 'శరణు శరణు సాయీ!' అంటే చాలు మా కోరికలన్నీ తీరుస్తావు. మా జీవిత పరమావధిని నెరవేరుస్తావు. సంసారం మహాసముద్రం. దీనిని దాటటం చాలా కష్టం. విషయ సుఖాలనే కెరటాలు దురాలోచన అనే ఒడ్డును బలంగా తాకుతూ ధైర్యమనే వృక్షాలను పడగొడుతూంటాయి. అహంకారమనే గాలి రయ్యిన వీస్తూ మహా సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తుంది. అలజడి రేపుతుంది. కోపం, అసూయ, ద్వేషాలనే మొసళ్లు నిర్భయంగా సంచరిస్తూంటాయి. మరోపక్క 'నేను', 'నాది' అనే స్వార్థాల వంటి సుడిగుండాలు గిర్రున తిరుగుతూంటాయి. మంచితనం, వివేకం అనేవి ఆ సుడిగుండంలో పడి కొట్టుకుపోతూంటాయి. పరనింద, అసూయ, ఓర్వలేని తనం అనే చేపలు అక్కడక్కడా తిరుగాడుతూంటాయి. ఇలాంటి మహాసముద్రమనే సంసారాన్ని దాటటం కష్టమే అయినా, మనకు సమర్థ సద్గురువైన సాయిబాబా అండగా ఉన్నారు. బాబా మహర్షులతో అగస్త్యుని వంటి వారు. అనగా, వ్యామోహాలు భౌతికవాంఛలపై ఆసక్తిని నశింపచేసే వారు. బాబా ప్రకాశాలలో సూర్యుని వంటి వారు. సూర్యుడు జ్ఞానానికి సంకేతం. బాబా తన జ్ఞాన ప్రకాశాలతో భక్తుల మదిలో అలముకున్న అజ్ఞానపు చీకట్లను తొలగిస్తారు. బాబా లీలలు దీపస్తంభాలు. అవి ఈ భవసాగరాన్ని సురక్షితంగా దాటించే వెలుగుదివ్వెలు. బాబా! మా మనసులు చెదిరిపోనివ్వకుండా స్థిరంగా ఉంచు. మేము నిన్ను తప్ప మరేమీ కొరము. నీ ఉపదేశాలను నిత్యం ఆచరిస్తాం. నీ లీలల్ని సదా గానం చేస్తాం. మా బుద్ధులు నీవు చూపిన దారిలో పయనించేలా చూడు" అని ప్రార్థిస్తే బాబా మనల్ని చేయిపట్టి నడిపిస్తారు. #🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇
🙏🏼షిరిడి సాయి బాబా - ShareChat
సాయి దివ్య నామం - పరమ పుణ్య ధామం అకార, ఉకార, సంయుక్తం ఓంకారం . అదే చరాచర సృష్ఠిలో నిండివున్నా ప్రణవ నాదం. అదే మన వేదములకు మూలం . మనలో వ్యాపించి ఉన్న దివ్య శక్తిని సద్గురువై తన పలుకుల ద్వారా చర్యల ద్వారా తెలుపకనె తెలిపిన మహా మహిమాన్వితుడు శిరిడిలో వెలసిన సాయి మహారాజు. ఈశ్వరుడై ఈ ప్రపంచాన్ని సృష్టించి రక్షించే సాక్షీభూతుడు. ఓం సాయి అంటే మనలో ఆ ఓంకార శక్తిని ప్రచోదితం చేస్తారు సాయి. శ్రీ అంటే శుభములు, సుఖములు, సంపదలు సంతోషములు మొదలైనవి. శ్రీ సాయి. అంటే మనకు అవసరమైన అన్ని శుభాలనూ అత్యంత ప్రేమ వర్షిస్తారు. సాయి. శ్రీసాయి అనే నామోచ్చారణ సకల పాపహరణం దివ్యమంత్రం. జయ.అంటే జయము. జయ జయ అంటే అఖండమైన విజయం పరంపర, జయ జయ సాయి. అంటే మనకు కావలసిన విజయాలన్నింటినీ ప్రసాదిస్తారు సాయితండ్రీ. త్రికరణ శుద్ధితో ఈ మూడింటినీ కలిపి ఓంసాయి, శ్రీసాయి, జయజయ సాయి' అని అఖండ స్మరణ లేదా భజన చేసే వారికి ఐహికంగా కావలసినవన్నీ ఇవ్వడమే కాకుండా జన్మ కర్మ బంధాలనుండి కూడా తప్పించే బాధ్యత స్వీకరిస్తారు సాయి. త్రికరణ శుద్ధితో చేసే నామజపం ఎంతోశక్తివంతమైనది సాయినామంఎక్కడ అఖండంగా సాగుతుందో ఆ ప్రదేశం అంతా పరమ పవిత్రమౌతుంది. అక్కడకు సాయినాథుడు వేంచేసి ఉంటారు. తమ దివ్యానుగ్రహ ఫలాలనందించి మానవ జన్మకు ధన్యతచేకూరుస్తారు. కాబట్టి ఆ సాయి అఖండ నామ స్మరణం చేద్దాం, ముక్తిని పొందుదామo. #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా
🕉 ఓం సాయిరామ్😇 - ShareChat