చిన్నారికి అరుదైన వ్యాధి.. రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఇస్తేనే బతికే అవకాశం!
TG: వికారాబాద్ (D) బొంరాస్పేట (M) వడిచర్ల పరిధి ఊరేనికి తండాకు చెందిన ముడావత్ శ్రీను, గోరీబూయి దంపతుల ఐదేళ్ల కొడుకు ముడావత్ జగన్ అరుదైన స్పైనల్ మస్కులర్ ఆట్రోపీ (ఎస్ఎంఏ) వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి రూ.16 కోట్లు విలువ చేసే జోలెజెన్స్మా అనే ఇంజక్షన్ అమెరికా నుంచి తెప్పించి ఇవ్వాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం బాలుడు ప్రతీ 12 గంటలకు ఒకసారి సిరప్ వేసుకుంటేనే మామూలుగా ఉంటున్నాడు. తల్లిదండ్రులు తమ కొడుకును కాపాడాలని ఎమ్మెల్యే, సీఎం రేవంత్రెడ్డిని వేడుకుంటున్నారు. దాతలు #🗞️అక్టోబర్ 26th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
ప్రధాని మోదీని చంపేందుకు కుట్ర!
CIA ఏజెంట్, యూఎస్ స్పెషల్ ఆఫీసర్ టెర్రెస్ జాక్సన్తో కలిసి ప్రధాని మోదీని హత్య చేసేందుకు అమెరికా కుట్ర చేసిందనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. ఆగస్టు 31న ఢాకాలోని హోటల్ గదిలో జాక్సన్ అనుమానాస్పద రీతిలో మరణించడం మిస్టరీగా మారింది. దీంతో మోదీని చంపేందుకు కుట్ర జరిగిందనే వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే భారత్, రష్యా నిఘా విభాగాల ఉమ్మడి ఆపరేషన్ ద్వారా ఈ కుట్రను భగ్నం చేశారని చెబుతున్నారు. మరోవైపు జాక్సన్ మృతిపై అనుమానాలు లేవని బంగ్లా ప్రభుత్వం ప్రకటించింది. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 26th అప్‌డేట్స్💬
తుఫాన్ ప్రభావం.. సముద్రంలో కార్తీక స్నానాలు నిలిపివేత
మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకెళుతోంది. బంగాళాఖాతంలో వాయుగుండంగా ఉన్న తుఫాన్ తీరానికి సమీపంలోకి రాగానే ఉద్ధృతి పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గాలి వేగం గంటకు 100 కిమీకి పైగా ఉండే అవకాశం ఉందంది. ప్రజలను అప్రమత్తం చేస్తూ.. కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ను అధికారులు మూసివేశారు. సముద్రంలో కార్తీక స్నానాలు నిలిపివేయమని సూచించారు. తుఫాన్ ప్రభావిత మండలాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అధికారుల సెలవులు రద్దు చేశారు #🗞️అక్టోబర్ 26th అప్‌డేట్స్💬 #🆕Current అప్డేట్స్📢
కాసేపట్లో పెళ్లి.. పెళ్లికూతురు గుండెపోటుతో మృతి
పంజాబ్లోని ఫరీద్ కోట్ జిల్లా బర్గాడి గ్రామానికి చెందిన 20 ఏళ్ల పూజ అనే యువతి పెళ్లికి కొన్ని గంటల ముందే గుండెపోటుతో మృతి చెందింది. దుబాయ్ పనిచేస్తున్న యువకుడితో అక్టోబర్ 24న ఆమె వివాహం జరగాల్సి ఉంది. సంగీత్ వేడుకలతో ఇల్లంతా హ్యాపీగా ఉన్న టైంలో ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 26th అప్‌డేట్స్💬
ఉరేసుకుని మహిళా లెక్చరర్ ఆత్మహత్య
AP: మానసికంగా కుంగిపోయిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కడప జిల్లా పొద్దుటూరు సిటీ ఈశ్వర్రెడ్డి నగర్లో జరిగింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు అక్కా చెల్లెళ్లు తాత వద్ద పెరిగారు. ఇటీవల అక్క కవిత పెళ్లి కాగా మహేశ్వరి(26) తతయ్య వద్దే ఉంటూ అతడి బాగోగులు చూసుకుంటూ చాపాడు మండలంలోని ఓ కాలేజ్లో లెక్చరర్గా పని చేస్తోంది. పేరెంట్స్ చనిపోవడం, అక్కకు పెళ్లవడంతో ఒంటరిగా ఫీలైన మహేశ్వరి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అక్క కవిత ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు #🗞️అక్టోబర్ 26th అప్‌డేట్స్💬 #🆕Current అప్డేట్స్📢
మరో పక్క సోషల్ మీడియా.. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇదే న్యూస్‌కు సంబంధించిన అప్డేట్స్ ను ఇస్తూనే ఉంది. అయినా కానీ.. మన టాలీవుడ్ సెలబ్రిటీలకు చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. ఈ ప్రమాద ఘటనను ఉద్దేశిస్తూ ఒకరిద్దరు మినహా.. పెద్ద హీరోలెవరూ ట్వీట్ చేయకపోవడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో అయితే పెద్ద చర్చనే లేవనెత్తుతోంది. టాలీవుడ్ లో జరిగే ప్రతీ మంచీ చెడుకు దాదాపు సెలబ్రిటీలందరూ రియాక్టవుతుంటారు. తమ తోటి సెలబ్రిటీల జీవితాల్లోని సంతోషకరమైన క్షణాలపై.. బాధాకర పరిస్థితులపై పోస్టులు పెడతుంటారు. ఒకరి పోస్టులను మరొకరు రీట్వీట్లు కూడా చేస్తుంటారు. వాటితో వైరల్ కూడా అవుతుంటారు. కానీ ఇలాంటి భయంకరమైన ప్రమాదలప్పుడు మాత్రం మన సెలబ్రిటీలు సైలెంట్ గా ఉండడం ఎంత వరకు కరెక్ట్ అని వీళ్ల ఫాలోవర్సే ఇప్పుడు నెట్టింట ప్రశ్నిస్తున్నారు. సెలబ్రిటీల తీరు మారాలి.. ఇలాంటి సందర్భాల్లో కూసింతైన మానవత్వం చూపించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. #🗞️అక్టోబర్ 26th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
మద్యం తాగించి... లైంగిక దాడిచేసి... చివరికి
HYD: అమీర్పేట్ గ్రీన్ ల్యాండ్స్ వద్ద అస్సాంకు చెందిన లీసా(30) అనే మహిళపై లైంగిక దాడిచేసి హత్య చేసిన నిందితుడిని పంజాగుట్ట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడు అనంతపురం జిల్లాకు చెందిన వై.రెడప్ప(38)గా గుర్తించారు. నిందితుడు ఆమెకు మద్యం తాగించి ఈఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 25th అప్‌డేట్స్💬
ఉరేసుకుని అంగన్వాడీ టీచర్ ఆత్మహత్య!
TG: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని అంగన్వాడి టీచర్ ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సనుగుల గ్రామానికి చెందిన గొట్టే పరిమళ(39) దేవుని తండా గ్రామంలో అంగన్వాడి టీచర్ గా పని చేస్తోంది. ఆమెకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పరిమళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని వివరించారు. #🗞️అక్టోబర్ 25th అప్‌డేట్స్💬 #🆕Current అప్డేట్స్📢













