పొట్టే కదా అని లైట్ తీసుకోకండి.. సమస్త రోగాలకు కారణమవుతుంది (వీడియో)
ఇప్పుడు చాలామందికి బెల్లీ ఫ్యాట్ సాధారణ సమస్యగా మారింది. మొదట్లో చిన్నగా కనిపించినా, కాలక్రమంలో అది పెరిగి ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుంది. బెల్లీ చుట్టూ పేరుకుపోయే కొవ్వు కేవలం ఆకారాన్ని మార్చడమే కాకుండా, శరీరంలోని ప్రధాన అవయవాల పనితీరును దెబ్బతీస్తుంది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
రూపాయి కట్టకుండానే రూ.30 లక్షలు బీమా
ఎల్పీజీ వంట గ్యాస్తో ప్రమాదం సంభవిస్తే వినియోగదారులకు ఉచితంగా బీమా వర్తిస్తుంది. ప్రమాదానికి గురైన కుటుంబానికి గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పరిహారం పొందవచ్చు. గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా ఈ బీమా వర్తింపజేస్తారు. ఆస్తి నష్టం జరిగితే రూ.2 లక్షలు, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే రూ.6 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు, తక్షణ సాయంగా రూ.25 వేలు అందజేస్తారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
Lokal App
లా విద్యార్థిపై మూకుమ్మడి దాడి.. కడుపు కోసి.. వేళ్లు నరికి!
యూపీలోని కాన్పూర్లో 22 ఏళ్ల లా విద్యార్థి అభిజీత్ సింగ్ చందేల్పై నలుగురు వ్యక్తులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. మందులు కొనుగోలు సమయంలో మెడికల్ షాపు అటెండెంట్ అమర్ సింగ్తో జరిగిన చిన్న గొడవ కాస్త పెద్ద ఘర్షణగా మారింది. అమర్ సింగ్, అతని సోదరుడు విజయ్, మరో ఇద్దరు కలిసి పదునైన ఆయుధాలతో విద్యార్థి కడుపు కోసి, వేళ్లు నరికేశారు. తీవ్ర రక్తస్రావంతో అభిజీత్ కుప్పకూలగా, పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
హైటెన్షన్ టవర్ పైనుంచి దూకాడు.. చివరికి (వీడియో)
TG: హై టెన్షన్ టవర్పైకి ఎక్కి ఓ గుర్తు తెలియని వ్యక్తి హల్చల్ చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో జరిగింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. టవర్పై ఉన్న వ్యక్తిని సురక్షితంగా కిందకు దించేందుకు ప్రయత్నాలు చేశారు. క్రేన్ సహాయంతో వ్యక్తిని కిందకు దించడానికి ప్రయత్నింగా ఒక్కసారిగా కిందకు దూకేశాడు. దీంతో తీవ్ర గాయలైన ఆ వ్యక్తిని 108 సహాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
#🌀తీవ్ర తుఫానుగా మారనున్న మొంథా..ప్రమాద హెచ్చరిక #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రేయాస్ అయ్యర్
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. అయితే పక్కటెముక గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం కావడంతో అతను సిడ్నీలోని ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం అతడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉన్నాడు. వైద్య నివేదికల ప్రకారం అతడు 5 నుండి 7 రోజుల వరకు ఆసుపత్రిలో ఉండాలని సమాచారం #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
#😰ప్రముఖ నటుడు ఆత్మహత్య చేసుకొని మృతి #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి
ఢిల్లీలో డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీకి వెళ్తున్న విద్యార్థినిపై ముగ్గురు యువకులు బైక్పై వచ్చి యాసిడ్ పోశారు. సదరు యువతి ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుంది. దీంతో ఆమె రెండు చేతులు, కొంత బాడీ పార్ట్ కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. విద్యార్థిని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీఎం రేవంత్కు దక్కని చోటు.. అందువల్లేనా?
TG: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసింది. అయితే ఇందులో తెలంగాణ నుండి ఒక్కరిని కూడా జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. సీఎం రేవంత్ బిహార్ ప్రజలను అవమానించారని ఎన్నికల వ్యూహకర్త జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే రేవంత్ను బిహార్లో అడుగుపెట్టనివ్వమన్నారు. రేవంతు ఓడించడానికి తాను తెలంగాణకు వస్తానని, దీన్ని మోదీ కూడా ఆపలేరని వ్యాఖ్యానించారు. ఈ ఎఫెక్ట్లనే సీఎం రేవంత్ను పార్టీ అధిష్టానం పక్కన పెట్టిందనే చర్చ జరుగుతోంది. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬











