డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి
ఢిల్లీలో డిగ్రీ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీకి వెళ్తున్న విద్యార్థినిపై ముగ్గురు యువకులు బైక్పై వచ్చి యాసిడ్ పోశారు. సదరు యువతి ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుంది. దీంతో ఆమె రెండు చేతులు, కొంత బాడీ పార్ట్ కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. విద్యార్థిని ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు తెలుస్తోంది #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీఎం రేవంత్కు దక్కని చోటు.. అందువల్లేనా?
TG: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసింది. అయితే ఇందులో తెలంగాణ నుండి ఒక్కరిని కూడా జాబితాలో చేర్చకపోవడం గమనార్హం. సీఎం రేవంత్ బిహార్ ప్రజలను అవమానించారని ఎన్నికల వ్యూహకర్త జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే రేవంత్ను బిహార్లో అడుగుపెట్టనివ్వమన్నారు. రేవంతు ఓడించడానికి తాను తెలంగాణకు వస్తానని, దీన్ని మోదీ కూడా ఆపలేరని వ్యాఖ్యానించారు. ఈ ఎఫెక్ట్లనే సీఎం రేవంత్ను పార్టీ అధిష్టానం పక్కన పెట్టిందనే చర్చ జరుగుతోంది. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
వివాహితపై కానిస్టేబుల్ లైంగిక దాడి!.. కేసు నమోదు
TG: కానిస్టేబుల్ లైంగిక దాడి చేసినట్లు ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మనస్పర్థల వల్ల ఓ మహిళకు భర్తతో గొడవలు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న బయ్యారం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ దినేష్ తనతో పరిచయం పెంచుకున్నట్లు తెలిపింది. మాయమాటలు చెప్పి దినేష్ తనను లోబర్చుకున్నాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దినేష్్ప కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి చెప్పారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
వివాహేతర సంబంధం.. అడ్డిస్తున్నాడని భర్తను చంపిన భార్య
TG: హైదరాబాద్లోని మీర్పేట్ పరిధిలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి సంధ్య సహోద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనికి భర్త విజయ్ కుమార్ అడ్డువస్తున్నాడని కర్రతో కొట్టి చంపింది. మృతదేహాన్ని బాత్రూమ్లో పడేసి, ప్రమాదవశాత్తు మరణించినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే అంత్యక్రియల సమయంలో మృతుడి తల్లి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు విచారించగా తానే చంపినట్లు నేరాన్ని అంగీకరించింది. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
గత కొన్ని రోజులుగా రాకెట్లా దూసుకుపోతున్న బంగారం ధరలు సోమవారం కాస్త తగ్గడంతో వినియోగదారులకు కొంచెం ఊరట లభించింది. బులియన్ మార్కెట్లో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,140 తగ్గి రూ.1,24,480కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,050 తగ్గి రూ.1,14,100గా ఉంది. అయితే, రేట్లు పడిపోవడంతో పెట్టుబడిదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
కేజీ రూ.1,70,000 వద్ద వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం
AP: కర్నూల్లో స్లీపర్ బస్సు అగ్నిప్రమాదం ఘటన మరవకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి ముళ్ళ కంపలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬
#🚨హై అలర్ట్..దూసుకొస్తున్న మోంథా తుపాను🌀 #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
#🏆భారత మహిళల జట్టు: ODI ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌కు క్వాలిఫై #🗞️అక్టోబర్ 27th అప్‌డేట్స్💬











