RAMAKRISHNA. B
ShareChat
click to see wallet page
@2163187996
2163187996
RAMAKRISHNA. B
@2163187996
ఐ లవ్ షేర్ చాట్, ఐ లవ్ తెలుగు సంస్కృతి.
🪷🌹🔱🙏🪔ఓం గం గం గం గణపతయే నమః 🪷🌹🔱🙏🪔 #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
🙏మన సాంప్రదాయాలు - ఐశ్వర్యాన్ని ఇచ్చే గణేశ మంత్రం  విఘ్న: గణేశమేకదంతం చ హేరంబం నాయకం లంబోదరం శూర్పకర్ణం . గజవక్త్రం గుహాగ్రజం. d సామవేదాంతర్గతమైన గణపతి మంత్రములను నామములుగా. స్తోత్రముగా . స్వయంగా శ్రీహరి, పార్వతీ దేవికి చెప్పిన స్తోత్రమిదిః ఈ శ్లోకంలోని. విఘ్నేన శ్వరుని కృపతో సర్వ విఘ్నములు . చెప్పినంతనే . నామాలు నివారింపబడతాయిః ఈ అష్టకం చాలా మహిమాన్వితమైనది  ఎనిమిది వినాయకస్వామి నామాలతో కూడిన ఈ  86504 ప్రతిరోజు ఉదయం; . సాయంత్రం పఠిస్తే అలష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి: . శివలోకం ప్రాజెక్ట్ 95 ఐశ్వర్యాన్ని ఇచ్చే గణేశ మంత్రం  విఘ్న: గణేశమేకదంతం చ హేరంబం నాయకం లంబోదరం శూర్పకర్ణం . గజవక్త్రం గుహాగ్రజం. d సామవేదాంతర్గతమైన గణపతి మంత్రములను నామములుగా. స్తోత్రముగా . స్వయంగా శ్రీహరి, పార్వతీ దేవికి చెప్పిన స్తోత్రమిదిః ఈ శ్లోకంలోని. విఘ్నేన శ్వరుని కృపతో సర్వ విఘ్నములు . చెప్పినంతనే . నామాలు నివారింపబడతాయిః ఈ అష్టకం చాలా మహిమాన్వితమైనది  ఎనిమిది వినాయకస్వామి నామాలతో కూడిన ఈ  86504 ప్రతిరోజు ఉదయం; . సాయంత్రం పఠిస్తే అలష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి: . శివలోకం ప్రాజెక్ట్ 95 - ShareChat
*🪷🌹🙏🪔ఓం శ్రీ సరస్వతిదేవ్యై నమః 🪷🌹🙏🪔* #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి
🙏మన సాంప్రదాయాలు - శివలోకం ప్రాజెక్ట్ సీరీస్పితి ప్రౌర్థిన సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ధవతు మే సదా పద్దపత్ర విశాలాక్షీ పధ్శక్ేసర వర్ణినీ సరస్వతీ నిత్యం పద్శాలయా మాం పాతు యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదంద మండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైస్సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాద్యాపహా శరణం కరవాణి శర్తదం తే చరాచరోపజీవ్యం ಏಂಣಂ ನಾಣಿ కరుణాస్ృశైఃకటాక్షపాతైః కురు మా మంబ కృతర్ధసార్ధవాహమ్: శివలోకం ప్రాజెక్ట్ సీరీస్పితి ప్రౌర్థిన సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ధవతు మే సదా పద్దపత్ర విశాలాక్షీ పధ్శక్ేసర వర్ణినీ సరస్వతీ నిత్యం పద్శాలయా మాం పాతు యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదంద మండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైస్సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాద్యాపహా శరణం కరవాణి శర్తదం తే చరాచరోపజీవ్యం ಏಂಣಂ ನಾಣಿ కరుణాస్ృశైఃకటాక్షపాతైః కురు మా మంబ కృతర్ధసార్ధవాహమ్: - ShareChat
_*🪷🌹🔱🙏🪔"కార్తీక సోమవారం విశిష్టత" గురించి శివలోకం మీ కోసం...*_ 🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷 కార్తీకమాసంలో శ్రీమహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవార వ్రతం. కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజునైనా స్నాన, దానాలు, జపాలు ఆచరించేవారికి వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు. ఈ సోమవార వ్రతవిధి ఆరురకాలుగా ఉంది. *1. ఉపవాసం:* 🪷🪔🪷🪔🪷 ఉపవాసం చేయగలిగిన వారు కార్తీకసోమవారం రోజున పగలు అంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తరువాత తులసీతీర్థం మాత్రమే స్వీకరించాలి. *2.ఏకభుక్తం:* 🪷🪔🪷🪔🪷 రోజంతా ఉపవాసం ఉండలేనివారు ఉదయం యథావిధిగా స్నానం, జపం ముగించుకుని, మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో, తులసీతీర్థమో స్వీకరించాలి. *3 నక్తం :* 🪷🪔🪷🪔 సోమవారం రోజున పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కానీ, ఉపాహారం కానీ స్వీకరించాలి. *4.అయాచితం :* 🪷🪔🪷🪔🪷🪔 భోజనం కోసం తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారంతట వారే భోజనానికి ఆహ్వానిస్తే, భోజనం మాత్రమే చేయాలి. దీన్నే అయాచితం అని అంటారు. *5.స్నానం :* 🪷🪔🪷🪔🪷 పైన పేర్కొనబడిన వాటిల్లో వేటినీ చేసే శక్తిలేనివారు నమంత్రక స్నానం, జపం చేస్తే సరిపోతుంది. *6. తిలాపాపం :* 🪷🪔🪷🪔🪷🪔 మంత్రం, జపం విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీకసోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది. పైన చెప్పిన ఆరు పద్ధతులలో ఏ ఒక్కటి ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ, తెలిసి కూడా ఏ ఒక్క పద్ధతినీ ఆచరించనివాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంబీపాక రౌరవాది నరకాలని పొందుతారు అని ఆర్షవాక్యం. ఈ సోమవార వ్రతాన్ని ఆచరించడం వలన అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యాన్ని పొందుతారు. కార్తీకమాసంలో అన్ని సోమవారాలు ఉదయం అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజు అంతా భగవంతుడిని ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పకుండా శివసాయుజ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవారు నమక చమక శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి. కార్తీకసోమవారం రోజున శివాలయాలలో నేతితో దీపం వెలిగించేవారికి అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. సోమవారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఆలయాలలో పంచముఖ దివ్వెలతో దీపాలను వెలిగించడం ద్వారా శుభఫలితాలను పొందగలరు. కార్తీకసోమవారం బ్రాహ్మీముహూర్తంలో స్నానం చేసి 'హరహరశంభో' అంటూ శివుణ్ణి స్తుతిస్తే సర్వపాపాల నుండి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలను పొందుతారు. 🪷🪔🪷🪔 సమాప్తమ్. 🪷🪔🪷🪔 #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ మీ... శివలోకం ప్రాజెక్ట్
🙏మన సాంప్రదాయాలు - 565 ನ್ಮನೌಂಂ ప్రత్యేకత శివలోకం ప్రాజెక్ట్ 565 ನ್ಮನೌಂಂ ప్రత్యేకత శివలోకం ప్రాజెక్ట్ - ShareChat
_*🪷🌹🙏🪔"నక్త వ్రతం అంటే..." శివలోకం మీ కోసం....*_ 🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱🙏🪷🌹🔱 నక్తం అంటే రాత్రిపూట అని అర్థం. పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేయటాన్ని నక్తవ్రతమని , నక్త భోజనమని అంటారు. రాత్రిపూట తినమన్నారు కదా అని పది గంటలో , పదకొండు గంటలకో చేయకూడదు. సూర్యాస్తమయం అయి చుక్కలు కనిపించే సమయానికి చేయాలి. ఇలా చేయటం ఆరోగ్య ప్రదం. ఈ విధి విధానాన్ని తెలుసుకోకుండా ఇష్టానుసారం భోజనం చేస్తే అది వ్రత పుణ్యఫలాన్ని ఇవ్వకపోగా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ప్రమాదముంది. అందుకే.. పెద్దల పర్యవేక్షణలో వ్రతాలను ఆచరించటం మేలు. ఈ వ్రతం కేవలం కార్తీకంలోనే కాదూ సంవత్సరంలో అన్ని మాసాలలోనూ , కొన్ని ప్రత్యేక తిథులలో ఆచరించటం ఆరోగ్యానికి క్షేమకరమని , పుణ్యప్రదమని తెలియచెబుతోంది లింగపురాణం. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రమే భోజనం చేసే ఈ వ్రతాన్ని ఎందుకాచరించాలి ? అసలు ఉపవాసాలుంటూ ఏమీ తినకుండా ఉండేటప్పుడు ఎందుకు ఉద్యోగాలు చేయాలి , ధనాన్ని ఎందుకు సంపాదించాలి ? అని కొందరికి కలిగే సందేహాలకు ఈ కథా సందర్భంలో సమాధానాలు దొరుకుతాయి. గృహస్తుడు అని అంటే తానొక్కడూ తిని కూర్చోకూడదు. అతడిమీద ఎన్నెన్నో జీవులు ఆధారపడి ఉంటాయి. వాటన్నింటికీ భోజనం పెట్టటం ద్వారా తృప్తి కలిగించాకే గృహస్తుడు తినాలి. దేవతలు ఉదయం పూట , ఋషులు మధ్యాహ్నవేళ , పితృదేవతలు అపరాహ్ణవేళ , గుహ్యకులు లాంటివారు సాయంసంధ్య సమయాలలో భోజనం చేస్తారు. అందుకని వారందరికీ వారి వారి సమయాలలో ఆహారాన్ని నివేదించి.. చుక్కలు కనిపించేటప్పుడు గృహస్తుడు తినాలి. గృహస్తుడిచ్చిన ఆహారం మీద పశు పక్ష్యాదులు , సూక్ష్మ జీవులు ఆధారపడుతుంటాయి. వాటన్నింటికీ ఆహారాన్ని ఇచ్చేందుకు మనిషి ధర్మబద్ధంగా సంపాదించాలి. నక్తవ్రతం కేవలం ఒంటిపూట ఉపవాసంతోనే ముగియదు. ఆ సందర్భంగా కొన్ని కొన్ని దానాలు , ధర్మాలు చేయాల్సి ఉంటుంది. దీని వెనుక సర్వభూతదయ అనే సామాజికాంశం కనిపిస్తుంది. ప్రాతఃకాలస్నానం , భస్మ , రుద్రాక్ష ధారణ , భగవన్నామ స్మరణలు , ప్రణవ శివ షడక్షర మహామంత్ర జపాలు చేయాలి. మితంగా పెసరపప్పు , బియ్యం కలిపి వండిన అన్నాన్ని భుజించి , సత్య సంభాషణలు చేస్తూ చాపమీద పడుకోవాలి. పుష్యమాసంలో ఈ వ్రతాన్ని చేస్తే నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఈ మాసంలో రెండు పక్షాలలో వచ్చే అష్టమి తిథులు , పూర్ణిమనాడు వ్రతంచేసి , ఆవునెయ్యితో రుద్రుడికి అభిషేకించాలి. ధాన్యాన్ని శివుడికి నివేదించటం , కపిల గోవును , ఎద్దును దానం ఇవ్వటం వల్ల ఆగ్నేయాది లోకాలు ప్రాప్తిస్తాయి. మాఘమాసంలో పెసరపప్పు , నెయ్యితో కూడిన భోజనాన్ని తినాలి. ఈ మాసంలోని చతుర్దశి , పౌర్ణమిలలో వ్రతం చేయొచ్చు. నెయ్యి , గొంగళి , నలుపురంగు ఆవు , ఎద్దులను దానం చేయటం వల్ల యమధర్మరాజు సంతుష్టుడవుతాడు. ఫాల్గుణ మాసంలో నెయ్యి , పాలతో వండిన పాయసాన్ని నివేదించాలి. చతుర్దశి , అష్టమి , పూర్ణిమలలో నక్తవ్రతం చేసి రుద్రాభిషేకాన్ని నిర్వహించాలి. గోమిధునాన్ని దానం చేసే వారికి చంద్రసాయిజ్యం లభిస్తుంది. చైత్రమాసంలో చేపడితే నిరుతిలోకం లభిస్తుంది. వైశాఖంలో వ్రతం చేసి తెల్లటి ఆవును , ఎద్దును దానమిస్తే అశ్వమేధ ఫలం దక్కుతుంది. జ్యేష్టమాసంలో నెయ్యి కలిపిన పదార్థం నివేదించి అర్ధరాత్రి వరకూ గోశాలలో గోవులకు సేవలు చేస్తూ ధూమ్రవర్ణంలో ఉన్న గోమిధునాన్ని దానం చేయాలి. ఆషాఢంలో చెరకు రసం నెయ్యి , పేలపిండి , ఆవుపాలను స్వీకరిస్తూ వ్రతాన్ని చేసే వారికి వరుణ లోక ప్రాప్తి కలుగుతుంది. శ్రావణమాసంలో అరవై రోజులలో పంట కొచ్చిన వరి ధాన్యాన్ని శివుడికి నైవేద్యం పెట్టాలి. చిత్ర వర్ణాలున్న గోమిధునాన్ని దానం ఇవ్వటం , పూర్ణిమనాడు ఆవునెయ్యితో శివుడిని అభిషేకించటం , అన్నదానం చేయటం వల్ల వాయు సాయిజ్యం లభిస్తుంది. ఆశ్వయుజంలో నల్లనిరంగులో ఉండే గోమిధునాన్ని దానమివ్వాలి. పున్నమినాడు రుద్రాధ్యాయంతో శివుడిని అభిషేకించి పూజిస్తే ఈశానలోకం లభిస్తుంది. కార్తీక మాసంలో నెయ్యితో కూడిన క్షీరాన్నాన్ని నివేదించి కపిల గోమిధునాన్ని దానమివ్వటం , అన్నదానాలు చేస్తే సూర్యలోకార్హత పొందుతారు. మార్గశిరంలో నెయ్యి , పాలతో కూడిన యవధాన్యంతో వండిన అన్నాన్ని నివేదించటం , వేద పండితులకు , దరిద్రులకు , సత్పురుషులకు పున్నమినాడు శివాభిషేకం అయిన తర్వాత భోజనాలు పెట్టడం , తెలుపు రంగుగల గోమిధునాన్ని దానమివ్వటం వల్ల సోమలోక నివాస అర్హత లభిస్తుంది. నక్తవ్రతం అన్నిమాసాల్లోనూ చేయవచ్చంటోంది లింగపురాణం. అహింస , సత్యం , దొంగతనానికి పాల్పడకుండా ఉండటం , బ్రహ్మచర్యం , ఓర్పు , దయ , ఉదయం , మధ్యాహ్నం సాయం కాలాలలో స్నానం చేయటం , ఇలాంటివన్నీ వ్రతం వల్ల ప్రాప్తించే మంచి అలవాట్లు. శుక్ల , కృష్ణ పక్షాలలో చతుర్దశి , అష్టమి తిథులలో ఈ వ్రతాన్ని ప్రతినెలా అందరూ చేస్తూ ఉంటే సమాజంలో అశాంతి అనేదే ఉండదు అని అంటోంది లింగపురాణం. 🪷🌹🔱🙏🪷🌹🪔 మీ... శివలోకం ప్రాజెక్ట్ #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
🙏మన సాంప్రదాయాలు - నక్త వ్రతం అంటే క్ట్ శివలోకం ప్రాజ్ె నక్త వ్రతం అంటే క్ట్ శివలోకం ప్రాజ్ె - ShareChat
_*🪷🌹🔱🪔🙏కార్తీక పురాణ అధ్యాయములు వాటి అవగాహన శివలోకం మీ కోసం....*_ 🪷🌹🔱🪔🪷🌹🔱🪔🪷🌹🔱🪔🪷🌹🔱🪔🪷🌹🔱🪔🪷🌹🔱🪔🪷🌹🔱 1 వ అధ్యాయము : కార్తీకమాహత్మ్యము గురించి జనకుడు ప్రశ్నించుట, వశిష్టుడు కార్తీక వ్రతవిదానమును తెలుపుట, కార్తీకస్నాన విదానము. 2 వ అధ్యాయము : సోమవార వ్రత మహిమ, సోమవార వ్రతమహిమచే కుక్క కైలాసమేగుట. 3 వ అధ్యాయము : కార్తీకస్నాన మహిమ, బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. 4 వ అధ్యాయము : దీపారాధన మహిమ, శతృజిత్ కథ. 5 వ అధ్యాయము : వనభోజన మహిమ, కిరాత మూషికములు మోక్షము నొందుట. 6 వ అధ్యాయము : దీపదానవిధి - మహత్యం, లుబ్దవితంతువు స్వర్గమున కేగుట. 7 వ అధ్యాయము : శివకేశవార్చనా విధులు. 8 వ అధ్యాయము : శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం, అజామీళుని కథ. 9 వ అధ్యాయము : విష్ణు పార్షద, యమదూతల వివాదము. 10 వ అధ్యాయము : అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము. 11 వ అధ్యాయము : మంథరుడు - పురాణమహిమ. 12 వ అధ్యాయము : ద్వాదశీ ప్రశంస, సాలగ్రామ దాన మహిమ. 13 వ అధ్యాయము : కన్యాదానఫలము, సువీరచరిత్రము. 14 వ అధ్యాయము : ఆబోతునకు అచ్చుబోసి వదులుట (వృషోసర్గము), కార్తీకమసములో విసర్జింపవలసినవి, కార్తీక మాస శివపూజాకల్పము. 15 వ అధ్యాయము : దీపప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతిలో నరరూపమొందుట. 16 వ అధ్యాయము : స్తంభదీప ప్రశంస, దీపస్తంభము విప్రుడగుట. 17 వ అధ్యాయము : అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము. 18 వ అధ్యాయము : సత్కర్మానుష్ఠానఫల ప్రభావము. 19 వ అధ్యాయము : చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణము. 20 వ అధ్యాయము : పురంజయుడు దురాచారుడగుట. 21 వ అధ్యాయము : పురంజయుడు కార్తీక ప్రభావము నెరంగుట. 22 వ అధ్యాయము : పురంజయుడు కార్తీకపౌర్ణమీ వ్రతము చేయుట. 23 వ అధ్యాయము : శ్రీరంగక్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. 24 వ అధ్యాయము : అంబరీషుని ద్వాదశీ వ్రతము. 25 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని శపించుట. 26 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని శరణు వేడుట. 27 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. 28 వ అధ్యాయము : విష్ణు (సుదర్శన) చక్ర మహిమ. 29 వ అధ్యాయము : అంబరీషుడు దూర్వాసుని పుజించుట - ద్వాదశీ పారాయణము. 30 వ అధ్యాయము : కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి. 🌹🪔🌹🪔🌹🪔🌹 మీ.... శివలోకం ప్రాజెక్ట్ #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
🙏మన సాంప్రదాయాలు - కార్తీక పురాణము శివలోకం ప్రాజెక్ట్ కార్తీక పురాణము శివలోకం ప్రాజెక్ట్ - ShareChat
_*🪷🌹🔱🪔"ఓం నమఃశివాయ పంచాక్షరీ మంత్రం పరమార్ధం" శివలోకం మీ కోసం....*_ 🪷🌹🔱🪷🌹🔱🪷🌹🔱🪷🌹🔱🪷🌹🔱🪷🌹🔱🪷🌹🔱🪷🌹🔱🪷🌹🔱 🌹🔱"ఓం నమః శివాయ" అనేది కేవలం అక్షరాలు మాత్రమే కాదు, అది ప్రకృతినే కదిలించ గల మహా బీజాక్షర సమూహం. 🌹🔱ఓం నమః శివాయ, ఇదే పంచాక్షరీ మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెప్తారు. ‘రుద్రం’లో వేదాల మధ్యభాగంలో ‘నమశ్శివాయ’ అనే మంత్రం లిఖితపూరకంగా లభించింది. ఆగమనాలలో దీని అర్థాన్ని విస్తృతంగా వివరించారు. 🌹🔱పంచాక్షరీ మంత్రం మన ఆత్మ, శరీరం ఉనికి అనీ, ఇది అందరినీ రక్షించే రక్షణ మంత్రమని పండితుల విశ్వాసం. దీనికి సరైన అర్థం ఇవ్వడం చాలా కష్టం. ఓం అనే దానికి ‘నేను నమస్కరిస్తున్నాను’ అని కూడా ఓ అర్థం. కాని ఈ మాత్రం వివరణతో ఆ మంత్రానికి సరైన నిర్వచనం ఇచ్చినట్టు కాదు. 🌹🔱‘శివ’ అంటే పవిత్రుడు అని అర్థం. అందుకే ‘పవిత్రతకు తల వంచి నమస్కరించడం’ అనే అర్థం చెప్పవచ్చు. పుస్తకాలలో ‘శివుడు’ అనే పదానికి చెప్పే ‘వినాశకారుడు’ అనే అర్థాన్ని మాత్రమే తీసుకుంటే సరిపోదు. 🌹🔱శివుడు అంటే నాశనం లేనివాడు అని, మంత్రానికి ఉన్న అర్థం కన్నా, ఆ శబ్దం నుంచి వచ్చే ధ్వని తరంగాలకు ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి మిగిలిన మంత్రాలలాగే ఈ మంత్రానికీ అర్థం కన్నా శబ్దమే ప్రధానం. అందువల్ల ఈ పదాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలి. 🌹🔱శివుడు అంటే ‘నిరాకారుడు’ అనే అర్థాన్ని చెబుతారు. అలాగే ఆయనను ‘పరమశివుడు’ అని కూడా అంటుంటారు. అంటే ‘భగవంతుని అంశ’ అని అర్థం. 🌹🔱ఈ అంశ అందరిలోనూ అంతర్భాగంగా ఉంటుందని, ఇది విడదీయలేనిదని శైవుల విశ్వాసం. అయితే ఇది మనిషిలో నుంచి విడిపోవడానికి బయటకు కనిపించే పదార్థం వంటిది కాదు. హృదయానికే హృదయంలాంటిది. ఇది అయిదు అక్షరాల సమాహారం. 🌹🔱ఓం నుంచే అన్నీ ఆవిర్భవించాయి. న, మ, శి, వ, య మంత్రం ఓం కారంతో ప్రారంభం అవుతుంది. ఓం… మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని పెద్దలు చెబుతున్నారు. 🌹🔱ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి. ‘న’ అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తుందన్నప్పటికీ ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అన్నారు. న అంటే భూమి, మ అంటే నీరు, శి అంటే నిప్పు, వ అంటే గాలి, య అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు పురాణాలు నిర్వచనం చెప్పాయి. 🌹🔱ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రపడి, మనసు ప్రశాంతం అవుతుందని పండితులు చెబుతారు. 🌹🔱దీనిని పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమోగుణం, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు. 🌹🔱ఈ పంచాక్షరీకి అనంతమైన అర్థం పరమార్థం ఉంది. ఈమంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాలతో నిండిన శరీరం శుభ్రపడుతుంది. 🌹🔱ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది. 'న' భూమికి సంబంధించిన భాగాలను, 'మ' నీటికి సంబంధించిన భాగాలను, 'శి' అగ్నికి సంబంధించిన భాగాలను, 'వ' గాలికి సంబంధించిన భాగాలను, 'య' ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి. 🌹🔱మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంతవరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు. 🌹🔱అందువల్లే "ఓం నమః శివాయ" అనే పదాన్ని పదేపదే ఉచ్చరిస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని పౌరాణికులు చెబుతున్నారు. _*🌹🙏🔱ఓం నమః శివాయ 🔱🙏🌹*_ 🪷🌹🔱🪷🌹🔱🪷 _*మీ.... శివలోకం ప్రాజెక్ట్*_ #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
🙏మన సాంప్రదాయాలు - ఓం నమఃశివాయ 'మంత్రంపరమార్ధం శివలోకం ప్రాజెక్ట్ ఓం నమఃశివాయ 'మంత్రంపరమార్ధం శివలోకం ప్రాజెక్ట్ - ShareChat
_*🪷🌹🔱🙏🪔కార్తీక పురాణము - ఐదవ రోజు పారాయణము,తొమ్మిదవ అధ్యాయము:*_ 🪷🪔🪷🪔🪷🪔🪷 🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔 యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు ముఖాలు కలవారు అయిన విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. 'ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలు ఏమిటి? పాపాత్ములు ఎవరు? పుణ్యాత్ములు ఎవరు? యమదండనకు అర్హులైన వారు ఎవరు? అవన్నీ మాకు వివరంగా చెప్పండి' విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం ఇవ్వసాగారు 'సూర్యచంద్రులు వాయువు ఆకాశ గోసంధ్యలూ దశదిశ కాలాలూ మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలను విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదూతలారా! శ్రద్ధగా వినండి. వేదమార్గాన్ని విడిచిపెట్టిన స్వేచ్చాపరులూ, సాధుజనంతో బహిష్కరింప బడినవారూ యమదండనకు అర్హులు. బ్రాహ్మణుడినీ, గురువునూ, రాగినీ పాదాలతో తొక్కేవాడు, తల్లిదండ్రులతో గొడవపడేవాడూ, అసత్యవాదీ, జంతువులను హింసించేవాడూ, దానం చేసిన దాన్ని తిరిగి ఆశించేవాడూ, డాంబికుడూ (గొప్పలు చెప్పుకునేవాడు), దయలేనివాడూ, పరభార్యతో సంగమించేవాడూ, డబ్బులు తీసుకున్న పక్షం వహించేవాడూ, చేసిన దానాన్ని బైటపెట్టుకునేవాడూ, మిత్రద్రోహినీ, కృతఘ్నులనీ, ఇతరుల మగపిల్లలను చూసి ఏడ్చేవాడినీ, కన్యాశుల్కాలతో జీవించేవాడినీ, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను వదిలిపెట్టినవాడినీ, నిత్యకర్మలు చేయనివాడినీ, ఇతరులు పెట్టిన భోజనాన్ని కించపరిచేవాడినీ, కేవలం భోజనం గురించే ఆలోచించేవాడినీ, ఇతరులు చేసే దానాన్ని నిరోధించేవాడినీ, యాచించిన (అడుక్కుంటున్న) బ్రాహ్మణుడికి ఇవ్వనివాడినీ, శరణాగతులను దండించేవాడినీ, నిత్యం స్నానసంధ్యలు విడచినవాడినీ, బ్రాహ్మణ అశ్వ గోహత్య ఇలాంటి పాపం చేసిన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిళుడు అంటారా? వీడు చేయని పాపం అంటూ లేదు. బ్రాహ్మణ జన్మ ఎత్తి, దాసీసంగమ దాసుడయి చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా తీసుకు వెళ్ళడానికి అర్హుడు ఎలా అయ్యాడు?' యమదూతల సమాధానాన్ని విని విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు 'ఓ యమదూతలారా! ఉత్తమలోక అర్హత కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఎటువంటి కారణం వలనకాని దుష్టగుణం నుండి మంచిమార్గంలో కలిసేవాడు, నిత్యం దైవచింతనాపరుడు, స్నానసంధ్యా జపహోమ చేసినవాడు మీ యమలోకంలోకి అర్హులు కారు. ఓ యమదూతలారా! అసూయ లేనివారై, జపాగ్ని హోత్ర నిర్వాహకులై, సర్వ కర్మలనూ బ్రహ్మార్పణం చేసేవారు, జలాన్నగోదాతలు, వృషోత్సర్జనా కర్తలూ యమలోకాన్ని పొందడానికి అనర్హులు. విద్యాదాత (గురువులు) పరోపకార శీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జపంచేసేవారు, వివాహ ఉపనయనాలను చేయించేవారూ అనాథ ప్రేత సంస్కారకర్తా వీళ్ళు ఎవరూ మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యం సాలగ్రామాన్ని అర్చించి, ఆ తీర్థాన్ని తీసుకునేవాడూ, తులసీ మాలికలు ధరించేవాడు, గృహ ప్రాంగణంలో తులసిని పెంచేవాడూ, భాగవతాన్ని పఠించేవాడూ, పూజించేవాడూ, వినేవాడూ, సూర్యుడు మేష-తుల-మకర సంక్రాంతులలో ఉండగా ప్రాతఃస్నానం ఆచరించేవాడూ వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసిగాని, తెలియకగాని హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు, పాపవిముక్తులు అవుతారు. ఓ యమదూతలారా! ఇన్ని మాటలు ఎందుకు? ఎవడైతే మరణకాలంలో హరినామ స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణు లోకానికే వస్తాడు.' ఈ విధంగా సాగుతున్న యమ, విష్ణుదూతల సంవాదం అంతా విన్న అజామిళుడిలోని జీవుడు తన శరీరం దాసీ సాంగత్యం వంటి పాపాలను తలచుకుని దుఃఖిస్తున్న జీవుడు స్పృహలోకి వచ్చి ఆశ్చర్యం చెందాడు. 'ఇది ఏమి ఆశ్చర్యం? ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేనీ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపొతే నా నాలుకపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది?' అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణం చేయసాగాడు. కాబట్టి రాజా! కేవలం హరినామ స్మరణమే అంతటి ముక్తిప్రదం అయినది. కాగా హరికి ప్రియంకరమైన కార్తీక వ్రతం ఆచరిస్తే ఎంతపుణ్యం కలుగుతుందో ఊహించు ...' అంటూ ఆపాడు వశిష్టుడు. తొమ్మిదవ అధ్యాయం సమాప్తం *పదవ అధ్యాయం:* 🪷🪔🪷🪔🪷🪔 జనక ఉవాచ: 'వశిష్టా! ఈ అజామీళుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యముడికి ఏమని విన్నవించారు? అన్నీ పూర్తి వివరంగా చెప్పు' వశిష్ట ఉవాచ: 'నీవు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను విను. విష్ణుదూతల చేత తిరస్కరించబడిన యమదూతలు తమ ప్రభువైన యముడిని చేరి ఇలా చెప్పసాగారు. *యమదూతల ఆరోపణ - యముని ఉపదేశం:* 🪷🪔🪷🪔🪷🪔🪷 'అయ్యా! పాపాత్ముడూ, దురాచారుడూ, నిందిత కర్మలు చేసేవాడూ అయిన అజామీళుడిలోని జీవుడిని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి, అతనిని మానుండి విడిపించి, తమతో వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళను ఎదిరించలేక మేము ఇలా ఖాళీ చేతులతో వచ్చాము' అని యమకింకరులు చెప్పింది విని, రవ్వంత కోపానికి గురి అయిన యముడు జ్ఞానదృష్టితో అంతా చూసిన తరువాత 'కింకరులారా! 'కించిదపి పుణ్య విహీనోపి' అజామీళుడు అనే పాపి, అంత్యకాలంలో హరినామ స్మరణం చేయడం వలన సమస్తపాపాలనూ నశింప చేసుకుని, విష్ణుప్రియుడై, విష్ణుదూతల చేత తీసుకొనిపోబడ్డాడు. తెలిసి తాకినా, తెలియక తాకినా సమస్త జాతులనూ అన్నం ఆరగిస్తారో అదే విధంగా దుష్టత్ములై, మహిమను తెలుసుకోలేక పోయిన ఆ శ్రీహరి యొక్క నామస్మరణం చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలూ దహించబడిపోతాయి. ఇక, భక్తిభావంతో స్మరించినవారు కేవలం కైవల్య పధగాములే అవుతారు' అంటూ సేవకులకు ఎంతవరకూ చెప్పాలో అంతవరకూ మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనలో పడిపోయాడు. *అజామీళుడి పూర్వజన్మం:* 🪷🪔🪷🪔🪷 అజామీళుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చన చేసేవాడిగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నానసంధ్యలు చేయకుండా, దైవంపట్ల చిత్తమూ, దేవుడి ద్రవ్యాలను అపహరించేవాడు అయి ఉండేవాడు. బ్రాహ్మణుడు అయి ఉండీ కూడా మధుపానం, దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. అర్చకుడు అయి ఉండీ కూడా వివిధ ఆభరణ భూషితుడై స్వేచ్చా విహారాలు చేసేవాడు. బహుభాషియై యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలంలో అదే గ్రామంలో దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్రంతో బాధపడుతూ, అన్నం కోసం పట్టణాలు, పల్లెలు తిరుగుతూ యాయవార వృత్తిని చేస్తూ ఉన్నాడు. ఒకానొకసారి అతనికి లభించిన యాయవార వస్తువులు అన్నింటినీ మోసుకొని వచ్చ భార్యను పిలిచి 'చాలా ఆకలిగా వుంది. త్వరగా వంట చేయి. ముందు కొన్ని మంచినీళ్ళు ఇవ్వు. అవి తాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను' అన్నాడు. కాని, యవ్వనం, మదంతో వున్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన ప్రియుడి గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. అందుకు కోపం తెచ్చుకున్న భర్త చేతికి అందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామం ఆలోచనలకు అంతరాయం కలిగించాడు అనే కోపంతో అతన్ని తన ముష్టిఘాతం ఇచ్చింది. అలసీ, బడలికగా ఉన్న ఆ బ్రాహ్మణుడు అందుకోసం పరితాపంలో ఆమెనూ, ఇంటినీ వదిలిపెట్టి గ్రామం విడిచి వెళ్ళి, భిక్షాటన చేస్తూ బ్రతకడం మొదలుపెట్టాడు. మొగుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ ఇల్లాలు, మొగుడు తెచ్చినవి అన్నీ సుష్టుగా తిని, మొగుడు ఇచ్చినవి అన్నీ అలంకరించుకుని, మొగుడు తెచ్చిన మంచి చీర కట్టుకుని, తాంబూలం తింటూ ఒకానొక రజకుడి యింటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగం చేయవలసిందిగా కోరింది. కానీ, నీతిమంతుడు అయిన ఆ రజకుడు, ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో కోరుకున్న కోరిక నెరవేరని ఆ బ్రాహ్మణ ఇల్లాలు వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇంతకుముందు చెప్పుకున్న ఈశ్వర ఆలయం అర్చకుడిని చూసి, సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడు అయిన వీడు, ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా, అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ పతిత సద్వంశ సంజాత అయిన కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమిలాడి తెచ్చుకుని, అది మొదలు అతని మాటలకు తుచ తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన, మరణం తరువాత అ శివార్చకుడు రౌరవాది మహానరకాలను అనుభవించి, అనుభవించి సత్వవిష్టుడి కొడుకు అయిన అజామీళుడుగా జన్మించి, కార్తీక పౌర్ణమి రోజున శివసందర్శనం, అంత్యకాల హరినామ స్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుడి జన్మలో ఇతనితో సంభోగం జరిపిన బ్రాహ్మణ పతిత కూడా కొంతకాలానికి మరణించి, నరకం అనుభవించి - కన్యాకుబ్జంలోని ఛండాలగృహంలో బాలికగా జన్మించింది. కాని, ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళు ఆ పిల్లను అడవిలో వదిలేశారు. ఆ వనంలో నివశించే ఒక బ్రాహ్మణుడు ఆ బాలిక అరణ్యరోదన విని. జాలిపడి, తనతో తీసుకుని వెళ్ళి, తన ఇల్లాలికి పెంపకం కోసం ఇచ్చాడు. ఆ దాసీదాని దగ్గర పెరిగిన ఈ పిల్లకే తరువాత కాలంలో అజామీళుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా! నువ్వు అడిగిన అజామీళుడి పూర్వ కథ ఇది. సమస్తమైన పాపాలకూ హరినామ స్మరణకన్నా ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. అది సాధ్యం కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించవలసి ఉంటుంది. జనక నరపాలా! ఎవరి నాలుక హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశం లేదు. ఎవరైతే ఇతర చింతలు అన్నిటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారని అనడంలో ఏమీ సందేహం లేదు! మోక్షం ఆసక్తి కలవారు మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదే విధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గం కూడా మహోత్కష్ట పుణ్య ప్రదాయిని అయి పాతకాలను పారద్రోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రత ఆచరణకు మాత్రమే వుండడం వలన, ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో, వాళ్ళు నరకప్రాప్తులు అవుతారు అని తెలుసుకో. పాపనాశిని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షానికి అర్హులే అవుతున్నారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. తొమ్మిదవ - పదవ అధ్యాయాలు ఐదవరోజు పారాయణ సమాప్తం 🪷🪔🪷🪔🪷🪔🪷 మీ... శివలోకం ప్రాజెక్ట్ #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
🙏మన సాంప్రదాయాలు - కార్తీక పురాణము శివలోకం ప్రాజెక్ట్ కార్తీక పురాణము శివలోకం ప్రాజెక్ట్ - ShareChat
_*🪷🌹🙏🪔కార్తీక పురాణము - నాలుగవ రోజు పారాయణము,ఏడవ అధ్యాయం శివలోకం మీ కోసం....*_ 🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔🪷 'ఓ జనక రాజేంద్రా! కల్మష అగ్ని అయిన కార్తీకమాసంలో పుష్ప అర్చన, దీపవిధానాలు చెబుతాను విను. *పుష్పార్చన ఫలదాన దీపవిధి విశేషాలు:* 🪷🪔🪷🪔🪷🪔 ఈ కార్తీకమాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలతో పూజించడం వలన కమలంలో కూర్చునే లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్ళలో స్థిరవాసం ఏర్పరచుకుంటుంది. తులసీదళాలతోకానీ, జాజిపువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకమాసంలో భక్తితో పండ్లు దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లలా చెదిరిపోతాయి. ఉసిరిచెట్టు క్రింద విష్ణువును ఉసిరికాయలతో పూజించేవారిని తిరిగి చూడడానికి యముడికి కూడా శక్తి చాలదు. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీదళాలతో పూజిస్తారో, వారినిమించిన ధన్యులు ఎవరూ ఉండరు అనడం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణసమేతుడై, ఉసిరిచెట్టు ఉన్న తోటలో వనభోజనం చేసేవారి మహాపాతకాలు సైతం మట్టికలిసిపోతాయి. బ్రాహ్మణసమేతులై ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామ పూజ చేసేవాళ్ళు వైకుంఠాన్ని పొంది, విష్ణువులా ఆనందిస్తారు. ఎవరైతే కార్తీకమాసంలో నిష్ణువు ఆలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో కానీ, అరటి స్తంభాలతో కానీ మండపం కట్టినవాళ్ళు వైకుంఠంలో విష్ణువు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండప్రణామం చేసినవాళ్ళు అశ్వమేథ పుణ్యం లబ్దిపొందే వారు అవుతారు. విష్ణువుకి ఎదురుగా జప, హోమ, దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానం చేసి తడిబట్టతో ఉన్నవాడికి వస్త్రదానం చేసినవాడు పదివేల ఆశ్వమేథాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరంపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి ఎగిరిపోతాయి. నల్లని, లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజ చేసినవారికి పదివేల యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీకమాసంలో ఏ స్త్రీ అయితే బృందావనంలో గోమయంతో (ఆవుపేడ) అలికి, పంచరంగులతోనూ, శంఖ, పద్మ-స్వస్తిక్ వంటి రంగవల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకి ప్రియురాలు అవుతుంది. విష్ణుసన్నిధిలో నందాదీపాన్ని అర్పించడం వల్ల కలిగే పుణ్యాన్ని వేయినోళ్ళ ఆదిశేషుడైనా పొగడలేడు. ఈ కార్తీకమాసంలో శివుణ్ణి జిల్లెడుపూలతో పూజించినవాడు దీర్ఘాయుష్మంతుడై చివరికి మోక్షాన్ని పొందుతాడు. విష్ణు ఆలయమండపాన్ని అలంకరించినవాడు హరిమందిరంలో స్థాయి అవుతారు. హరిని మల్లెపూలతో పూజించినవారి పాపాలు సర్వనాశనమై పోతాయి. తులసీ, గంధంతో సాలగ్రామ పూజ చేసినవాడు వైకుంఠాన్ని పొందుతాడు. విష్ణుసన్నిధిలో నాట్యం చేసినవారి యొక్క పూర్వసంచిత పాపలు అన్నీ పూజ్యం అయిపోతాయి. భక్తితో అన్నదానం చేసేవాడి పాపాలు గాలికి మబ్బుతునకలా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీకమాసంలో నువ్వులదానం, మహానదీ స్నానం, బ్రహ్మపత్ర భోజనం, అన్నదానం ఈ నాలుగూ ఆచరించడం ధర్మంగా చెప్పబడుతూ వుంది. స్నాన, దానాలు ఆచరించనివాడూ, పిసినారి అయి యథాశక్తిగా చేయనివాడూ నూరుజన్మలు కుక్కగా పొట్టి చివరికి ఛండాల యోనిలో జన్మిస్తాడు. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి, తరువాత వంద పుట్టుకలూ శునకయోనిలో జన్మిస్తారు. కార్తీకమాసంలో శ్రీహరిని కదంబపుష్పాలతో పూజించినవాడు సూర్యమండలాన్ని ఛేదించుకుని స్వర్గానికి వెడతాడు. పద్మాలతో పూజించినవాడు చిరకాలం సూర్యమండలంలోనే నివసిస్తాడు. ఓ జనక మహారాజా! కార్తీకమాసంలో ఎవడైతే అవిసెపువ్వుల మాలను తాను ధరించి తరువాత అవిసెపువ్వుల మాలికలతో శ్రీహరిని పూజిస్తాడో వాడు స్వర్గాధిపతి అవుతాడు. మల్యాలతో, తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక్క సూక్ష్మాన్ని చెబుతాను విను - ఆశక్తులు అయినవాళ్ళు - శ్లో || కార్తీక భానువరేతు స్నానకర్మ నమాచరేత్ ! మాసస్నా నేన యత్పుణ్యం తత్పుణ్యం లభతేనృప !! శ్లో || ఆద్యే తిమే మధ్య మే చ దినే యః స్నానమాచరేత్ ! మాసస్నాన ఫలం తేన లభతే నాత్ర సంశయః !! 🌹'కార్తీకమాసం'లో ఆదివారంనాడుగాని లేదా శుక్ల పాడ్యమినాడుగని, పూర్ణిమనాడుగాని, అమావాస్యనాడుగాని సంకల్ప సహితంగా ప్రాతఃస్నాన మాచరించడం వలన ఆ మాసం అంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది' ఆపాటి శక్తి కూడా లేనివాళ్ళు కార్తీకమాసం నెలరోజులూ ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా, విన్నా కూడా స్నానఫలాన్ని పొందుతారు. ఇది కేవలం ఆశక్తులకే సుమా! మహీశా! కార్తీకమాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించెవాడి పాపాలు నశించిపోతాయి, కార్తీకమాసంలో విష్ణుపూజ కోసం ఇతరులకు సహకరించేవాడు స్వర్గాన్ని పొందుతాడు. తాము స్వయంగా సంకల్ప పూర్వకంగా విష్ణువును పూజించేవాళ్ళు అవ్యయపదాన్ని పొందుతారు. కార్తీకమాసం సాయంకాలాలలో దేవాలయాలలో శివ-విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గలోకంలో వుండి తరువాత ధృవలోకాన్ని పొందుతారు. ఇలా ఈ కార్తీకమాసంలో ఎవడైతే హరిహరులను స్మరించకుండా ఉంటాడో వాడు ఏడు జన్మలపాటు నక్కగా పుడతాడు అనడంలో ఏమీ సందేహం లేదు. ఏడవ అధ్యాయం సమాప్తం *ఎనిమిదవ అధ్యాయం:* 🪷🪔🪷🪔🪷 వశిష్టుడు చెప్పినది అంతా విని జనకుడు ఇలా అడుగుతున్నాడు ... 'మహర్షీ! మీరు చెప్పినవి అన్నీ విన్న తరువాత నాకు ఒక సందేహం కలుగుతోంది. వర్ణసంకరం మొదలైన మహాపాపాలను చేసిన దుర్మార్గులు పవిత్రమైన వేదాలలో ప్రాయశ్చిత్తాలు చేసుకోకుండానే పరిశుద్ధులు కారు' అని సమస్త ధర్మశాస్త్రాలూ ఘోషిస్తుండగా, కేవలం కార్తీక వ్రతం ఆచరణతోనే సమస్త పాపాలూ హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతున్నారని చెప్పడంలోని మర్మం ఏమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యంతోనే గొప్పగొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డళ్ళతో కూడా కూలనటువంటి సాధ్యంకాని మహాపర్వతాన్ని కేవలం కొనవ్రేలి గోటితో కూల్చడం సాధ్యం అవుతుందా? అగ్నిలో దగ్ధం అవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంటల మీద కొద్దిపాటి నీళ్ళు చల్లినంత మాత్రాన, అగ్నిప్రమాదం తొలగిపోతుందా? ఏ మహానదీ ప్రవాహంలోనో కొట్టుకునిపోయే వారిని, ఓపాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానై కొండమీద నుంచి క్రిందికి దూకి పడేవాడు - కొండచరియలలోని ఏ లతనో పట్టుకున్నంత మాత్రం చేతనే పాతవేగాన్నుంచి సంరక్షించబడతాడా? వశిష్టా ఈ విధమైన సంఘటనల రీత్యా మహాపాపులైనవాళ్ళు సహితం అతి స్వల్ప కార్యమైనా కార్తీకవ్రతం ఆచరించడం వలన పాపరహితులు, పుణ్యాత్ములూ ఎలా అవుతారు? వీటికి నీ సమాధానం ఏమిటి? జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసం చేస్తూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు వశిష్టుడు. *జనకుడి ప్రశ్నలకు వశిష్టుడి జవాబు:* 🪷🪔🪷🪔🪷🪔 వశిష్ట ఉవాచ: మంచి విమర్శే చేశావు మహారాజా! చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలేగాని, స్థూలరూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదీకాక, వేదశాస్త్ర పురాణాలు అన్నీ కూడా అనేక ధర్మసూక్ష్మాలను మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని సందర్భాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్పపుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తూ ఉంటాయి. ధర్మాలు అన్నీ గుణత్రయంతో కూడుకుని స్వల్పా, స్వల్పాలను సిద్ధింప చేసుకుంటాయి. మూల ప్రకృతి అయిన 'మహామాయ' కారణంగానే సత్వరజస్తమస్సులనే మూడు గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వ గుణ ప్రధానమైనవి ధర్మసూక్ష్మాలు. కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తం అన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి. తర్కం దైవం ఇతర చింతనతో సాగించే దైవసంబంధ పద్ధతులు, ఆచరించే దానధర్మాలు, ఇవి అన్నీ కూడా ధర్మం యొక్క స్థూలస్వరూపాలు. ఇవి తమోగుణం వలన ఏర్పడతాయి. వీటిల్లో సత్వగుణం ప్రధానంగా ఆచరించే ధర్మాలు స్వల్పంగా తోచినప్పటికీ దేశకాలయోగ్యాదులు వలన విశేష ఫలాలను ఇస్తాయి. దేశం అంటే పుణ్యక్షేత్రం, కాలం అంటే పుణ్యకాలం, యోగ్యమంటే పాత్రత బ్రహ్మజ్ఞత కలవాళ్ళు. ఈ మూడింటినీ చింతించకుండా చేసే సర్వధర్మాలూ, తామసాలు - వీటివలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలు అని వేరే చెప్పక్కరలేదు కదా! జనకరాజా! అన్నిటికీ కర్మమే మూలం. ఎవరి కర్మలను బట్టి వారికి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానం అనేది ఉండడం వలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్నపూర్వకంగా అయినా ఆచరించాలి. ఆ విధంగా మూడూ కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మం అక్షయఫలితాన్ని ఇస్తుంది. రాజా! పర్వతం అంత ఎత్తు కట్టెలను పేర్చి, వాటిమధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణం ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపం ఆ యింటి చీకట్లను ఎలా తొలగిస్తుందో, గుండిగెడు మురికినీళ్ళను ఒక్క ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో అదే విధంగా, తెలిసిగాని, తెలియకగాని పుణ్యకాలంలో, పుణ్యక్షేత్రంలో, పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మం అనంతపాపాలనూ దగ్ధం చేసి, మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. *అజామీళో పాఖ్యానము:* 🪷🪔🪷🪔🪷🪔 బహుకాలం పూర్వం కన్యాకుబ్జక్షేత్ర వాసి, సార్థక నామధేయుడు అయిన సత్వనిష్టుడు అనే బ్రాహ్మణుడికి అజామిళుడు అనే కుమారుడు ఉండేవాడు వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహంలోని ఒకానొక దాసితో సాంగత్యం పెట్టుకుని తల్లిదండ్రులను వదిలి ఆ దాసీదానితోనే భోజనం, పడక అన్నింటినీ చేస్తూ, కామాంధుడై, వైదికకర్మలు అన్నింటినీ విడిచిపెట్టి, కేవలం కామంపై ఆసక్తికలవాడై ప్రవర్తించసాగాడు. దీనివల్ల బంధువులు అంతా అతన్ని వదిలివేశారు. కులంవాళ్ళు వెలివేశారు. అందుకని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవలసి వచ్చిన అజామిళుడు ఛండాలపు వాడలోని ఒకానొక దాసిదానితో కాపురం పెట్టి, కుక్కలనూ, మృగాలనూ ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బ్రతికే జనాలలో లీనమై, మధుమాంసాలు తినడం అలవాటు చేసుకుని కాలం గడపసాగాడు. ఇలా ఉండగా ఒక రోజు అతని ప్రియురాలు అయిన దాసిది కల్లు త్రాగడానికి తాడిచెట్టు ఎక్కి, కొమ్మ విరగడం వలన క్రిందపడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసీదానికి యవ్వనవతి అయిన కూతురు వుంది. మహాపాపాత్ముడూ, మహా కామాంధుడూ అయిన అజామిళుడు, తనకి కూతురువరస అని కూడా తలచుకోకుండా ఆ పిల్లనే వరించి, ఆమెతోనే కామభోగాలను అనుభవించసాగాడు. కాముకుడు అయిన అజామిళుడు, తన కూతురుతోనే అనేకమంది బిడ్డలను కన్నాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందలుగా ఉన్నప్పుడే మరణించగా, చివరగా పుట్టి మిగిలిన బిడ్డకు 'నారాయణ' అని నామకరణం చేసి అత్యంత ప్రేమగా పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిద్రపోతున్నా ఏం చేస్తున్నా సరే ఎప్పుడూ అతన్నే స్మరించుకుంటూ 'నారాయణా - నారాయణా' అని పిలుచుకుంటూ తన్మయుడు అవుతూ ఉండేవాడు. కాలం గడిచి అజామిళుడు కాలం చేసే సమయం ఆసన్నమైంది. అతడిలోని జీవుడిని తీసుకొని పోవడానికిగాను ఎర్రని గడ్డాలు, మీసాలు కలిగి, చేతిలో దండపాశాలను ధరించిన భయంకర రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిళుడు, ప్రాణం పోయే సమయంలో కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక, ఎక్కడో దూరంగా స్నేహితులతో ఆటలలో మునిగి ఉన్న కుమారుడి కోసం 'నారాయణా ! ఓ నారాయణా! తండ్రీ నారాయణా!' అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతని కొడుకుకు వినబడలేదు. అతనూ రాలేదు. కాని, దగ్గరికి వచ్చిన యమదూతలు ఆ 'నారాయణ' నామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ప్రత్యక్షం అయిన విష్ణుదూతలు 'ఓ యమదూతలారా! అడ్డుతొలగండి. యితడు మాచే తీసుకొని వెళ్ళడానికి తగినవాడే కానీ మీరు తీసుకుని వెళ్ళదగినవాడు కాదు' అని హెచ్చరించారు. వికసించిన పద్మాలలాగా విశాలమైన నేత్రాలు కలవాళ్ళూ, పద్మమాలలు ధరించినవారు, కిరీట కుండలాలు ధరించినవారు, వివిధ ఆభరణాలు ధరించినవారు, పీతాంబర వస్త్రాలు ధరించిన పవిత్ర విష్ణుదూతలను చూసి, విభ్రాంతి చెందిన యమదూతలు 'అయ్యా! మీరెవరు? యక్ష, గాంధర్వ, సిద్ధచారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువు అయిన యమధర్మరాజు మాకు విధించిన ధర్మం రీత్యా తీసుకొని వెళ్లనున్న ఈ జీవిని మీరెందుకు తీసుకుని వెళుతున్నారు? అని అడగడంతో, విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. 🌸🌺🌸🌺🌸🌺🌸 నాలుగవ రోజు పారాయణ సమాప్తం 🪷🪔🪷🪔🪷🪔🪷 _*మీ... శివలోకం ప్రాజెక్ట్*_ #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
🙏మన సాంప్రదాయాలు - కార్తీక పురాణము శివలోకం ప్రాజెక్ట్ కార్తీక పురాణము శివలోకం ప్రాజెక్ట్ - ShareChat
_*🪷🌹🔱🙏🪔కార్తీకమాసం లో దానాలు చేయడం వలన కలిగే ఫలితాల గురించి శివలోకం మీ కోసం....*_ 🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🪷🌹🪔🌹🪔🪷🌹🪔🪷 1. బియ్యాన్ని దానం చేస్తే – పాపాలు తొలుగుతాయి. 2. వె౦డిని దానం చేస్తే – మనశ్మా౦తి కలుగుతుంది. 3. బ౦గారం దానం చేస్తే – దోషలు తొలుగుతాయి. 4. ప౦డ్లను దానం చేస్తే – బుద్ధి. సిద్ధి కలుగుతాయి. 5. పెరుగు దానం చేస్తే – ఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది. 6. నెయ్యి దానం చేస్తే – రోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు. 7. పాలు దానం చేస్తే – నిద్ర లేమిఉండదు. 8. తేనె దానం చేస్తే – స౦తానంకలుగుతుంది. 9. ఊసిరి కాయలు దానం చేస్తే – మతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది. 10. టె౦కాయ దానం చేస్తే – అనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది. 11. దీపాలు దానం చేస్తే – క౦టి చూపు మెరుగు పడుతుంది. 12. గోదానం చేస్తే – ఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి. 13. భూమిని దానం చేస్తే – బ్రహ్మలోకదర్శనం లభిస్తుంది. 14. వస్త్రదానం చేస్తే – ఆయుష్షు పెరుగుతు౦ది. 15. అన్న దానం చేస్తే – పెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది. పైవన్నీమన వేదాల్లో చెప్పినవే… వీటి‌లో మీకు సాధ్యపడేది ఒక్కటైన చేయ్యమని అర్థం. చేసే సహాయం చిన్నదైనా సరే మనస్తూర్తిగా, శ్రద్ధగా చేస్తే ఫలితం అధికంగా కలుగుతుంది. 🪷🌹🔱🙏🪔🪷🌹 మీ... శివలోకం ప్రాజెక్ట్ #🙏మన సాంప్రదాయాలు #⛳భారతీయ సంస్కృతి #🙏ఓం నమః శివాయ🙏ૐ
🙏మన సాంప్రదాయాలు - కార్తీక దానఫలం )( శివలోకం ప్రాజెక్ట్ కార్తీక దానఫలం )( శివలోకం ప్రాజెక్ట్ - ShareChat