#My post# #😇My Status
#Konda Kintali Stories#
#బోగీ శుభాకాంక్షలు#
#తెలుగు టెక్స్ట్ పోస్టుల కు 50 రోజుల్లో 13వందల ఫాలోయర్స్, 15k వీక్షణలు#
#ధన్యవాదాలు🌹🙏👍#
కేవలం 50 రోజుల్లో "కొండ కింతలి స్టోరీస్" పేరున పెట్టే పోస్టులకు 15k వీక్షకులు సపోర్ట్ చేసి ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
పోస్టులు - టెక్స్ట్ రీడింగ్ - చదవాలంటే ..
సుమారు 6 నుండి 12 నిముషాల వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి పాఠకులు ఇస్తున్నందుకు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతాభివందానాలు.
మీ తీరిక సమయాల్లో నా ప్రొఫైల్లో ఉన్న పోస్టులను చదవాలంటే ఫేస్బుక్ యాప్ లో
పైన( భూతద్దం) మాగ్నిగియర్ గుర్తును క్లిక్ చేసి "Prabhakararao Kintali" అని టైప్ చేసి లింక్ ఓపెన్ చేస్తే నా ప్రొఫైల్ లో నిక్షిప్తమై ఉన్న పోస్టులన్నిటినీ మీరు చూసి చదవగలరు. చదవడమే కాకుండా మీ అమూల్యమైన స్పందనలు కామెంట్ రూపంలో తెలియజేయగలందులకు విన్నవించుకుంటున్నాను. ఇట్లు మీ KPR.
(KondaKintali).🌹❤️🙏👍.
#My post# #😇My Status
#Konda Kintali Stories#
#ఆ పరేషాన్#: మినీ కథ:
"నిన్న కడుపు నొప్పితోవచ్చిన పేషేంట్కి ఎపెండిసైటీస్ అని చెప్పి ఈ రోజు ఆపరేషన్ చేయాలి రమ్మని చెప్పారు కదా డాక్టర్ " డాక్టర్ని నర్స్ అడిగింది.
"అవును ఈరోజు 11గంటలకి ఎప్పాయింట్మెంట్ ఇచ్చాం కదా వస్తున్నారా"? డాక్టర్ అడిగాడు.
"ఆ పేషెంట్ నిన్న ఇంటికెళ్లి వాము వాటర్ తాగితే కడుపునొప్పి తగ్గిపోయిందట, ఆపరేషన్ అవసరం లేదని ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు" అంది నర్స్ డాక్టరుతో.
"ఛిఛి, డామిట్!..యూస్ లెస్ ఫెలోస్. సరే...12గంటలకి ఎపాయింట్మెంట్ ఇచ్చిన ఆ కిడ్ని పేషేంట్ ఆపరేషన్ క్యాన్సిల్ చేయండి". నర్స్ తో చెప్పాడు డాక్టర్ పరేషాన్ అయిపోయి.
"ఎందుకు సార్ "నర్స్
డాక్టరుని అడిగింది.
"లేకుంటే, నీవిస్తావా కిడ్నీ" డాక్టర్ నర్స్ పై తన ఉక్రోషాన్ని వెళ్లగక్కేడు.
By KondaKintali.
#My post# #😇My Status
గ్రాంఫోన్ రికార్డ్ ప్లేయర్ లో పాటలు వింటే థ్రిల్లింగా ఉండేది. మరి మీరు విన్నారా!?
#My post#
Wishing Happy New year to all readers & viewers. Konda Kintali.
#My post# # Konda Kintali Stories# #సాంప్రదాయ వస్త్రధారణ#
భారతదేశం అనేక సంస్కృతులు, భాషలు, మతాలు, ఆచారాల సమ్మేళనం. “వివిధతలో ఏకత్వం” అనే నినాదానికి నిజమైన రూపం భారతదేశం. ఇక్కడి సంప్రదాయాలు, ఆచారాలు మన జీవన విధానాన్ని, విలువలను ప్రతిబింబిస్తే, వస్త్రధారణ మన సంస్కృతికి కనిపించే ప్రతీకగా నిలువెత్తు నిదర్శనం నిలుస్తుంది.
భారతీయ సంప్రదాయాలు తరం నుండి తరానికి మౌఖికంగా, ఆచరణ ద్వారా బదిలీ అవుతూ వచ్చాయి. పెద్దలను గౌరవించడం
అతిథి దేవోభవః అనే భావన
పండుగలను కుటుంబంతో కలిసి జరుపుకోవడం
శుభకార్యాలు, వివాహాలు, నామకరణాలు, పూజలు వంటి ఆచార సాంప్రదాయాలు సంస్కారాలు భారతీయ జీవన తత్వానికి ఆధారాలు. దీపావళి, సంక్రాంతి, దసరా, ఈద్, క్రిస్మస్ వంటి పండుగలు మత భేదం లేకుండా సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయి.
భారతీయ వస్త్రధారణ యొక్క వైవిధ్యం
భారతదేశంలో ప్రాంతం, వాతావరణం, సంస్కృతి ఆధారంగా వస్త్రధారణలో విస్తారమైన వైవిధ్యం కనిపిస్తుంది.
స్త్రీల వస్త్రధారణ చీర, సల్వార్ కమీజ్, లెహంగా, ఘాగ్రా, మేఖలా చాదర్ వంటి సంప్రదాయ వస్త్రాలు. పురుషుల వస్త్రధారణ ధోతీ, కుర్తా, పంచె, లుంగీ, షెర్వాణీ మొదలైనవి. కానీ గ్లోబలైజేషన్ వల్ల ఫ్యాషన్ అనుకరణ పేరిట వస్త్రధారణలో ముఖ్యంగా స్త్రీల అంగాంగ ప్రదర్శనలు వెర్రితలలు వేస్తోంది. యువతను రెచ్చగొట్టే విధంగా జాతికి జుగుప్సాకరంగా
మారిపోతున్నాయి.
చీర కట్టు భారతీయ స్త్రీల గౌరవం, సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. కాంచీపురం, బెనారస్, పోచంపల్లి, పటోలా వంటి చీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇవి మన సంప్రదాయాల సమన్వయం.
నేటి యువత పాశ్చాత్య వస్త్రాలను ధరించినా, పండుగలు, శుభకార్యాల్లో సంప్రదాయ వస్త్రాలనే ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు. ఇది భారతీయ సంస్కృతికి ఉన్న బలాన్ని సూచిస్తుంది.ఆధునికతను స్వీకరిస్తూనే సంప్రదాయాలను గౌరవించడం భారతీయుల ప్రత్యేకత. ఇది శుభపరిణామం.
భారతదేశ సంప్రదాయాలు మన విలువలకు పునాది కాగా, వస్త్రధారణ మన సంస్కృతికి ప్రతిబింబం. కాలం మారినా, తరాలు మారినా, భారతీయ సంప్రదాయాలు మరియు వస్త్రధారణ మన గుర్తింపుగా నిలుస్తాయి. వాటిని సంరక్షించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత.
By KondaKintali
#Konda Kintali Stories#
#నేటి ప్రేమలు# మినీ హాస్య కథ:
“మనం ప్రేమించుకున్నంత ఘాడంగా ఈప్రపంచంలో ఏజంటా లేరు కదా రాధా!”. పార్క్ లో రాధ ప్రక్కన కూర్చొని ఆకాశం వైపు తదేకంగా చూస్తూ లాన్ లోని చేతికందిన గడ్డిపరకలు పీకుతూ ఎమోషనయ్యాడు మధు.
“అవును మధు, మొదట్లో తొక్కలోప్రేమని అనుకున్నాగాని, ఈ నాలుగు సంవత్సరాలూ నాచూట్టూ కుక్కలా తోకాడిస్తూ తిరిగితిరిగి చక్కగానీ ప్రేమలో పడేశావు నన్ను. కానీ తరువాత తెలిసింది, నీవు గడ్డిపరకలు పీకడం తప్పా మరేమీ చేత కాదని. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చి ఈ మాట నీతో చెప్పవలసి వస్తుంది.
ఇప్పుడు మనం ఎప్పటికీ చిరకాల స్నేహితుల్లాగేఉండి, కలకాలం విడిపోయి మధుర జ్ఞాపకాల్లో ఉండిపోదాం మధూ".
"అదేంటి అలా అంటావ్"! కోపంగా కసురుకొని సడెన్ గా లేచాడు మధు చేతిలోని గడ్డిపరకలు నేలకు విసిరి కొడుతూ.
“నేనన్నది, నీవు విన్నది కరక్టే. ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లన్నీ ఫెయిలయ్యి, ఇంకా పదకొండు సప్లిమెంటరీలు రాయాల్సుంది నీవు. అవెప్పుడు గట్టెక్కుతాయో, ఉద్యోగం, సద్యోగం సంగతి ఎప్పుడో ఆదేవుడికే ఎఱుక. అలా అని వెనక ఆస్తి పాస్తులు ఏమీ లేవు" మనసులోని మాట నిర్మొహమాటంగా అడిగింది రాధ.
మధు ఏదో చెప్పబోయాడు. మధ్యలో ఆపి రాధ " నేను చెప్పింది ముందు వినూ" ..
" మావాళ్లు ఒక సంబంధం చూశారు. అబ్బాయి నీఅంత హేండ్సమ్ లేకపోయినా, ఐఏయస్ సెలక్టయ్యాడు. బోలెడు ఆస్థికూడా ఉందట. ఒప్పేసు కున్నా మరి”. కూల్ గాచెప్పింది రాధ.
పార్క్ లో బఠాణీలు, చాట్ అమ్మేవాడు వచ్చి "ఏమైనా కావాలా" అని అడిగాడు.
"చూడు మధు, నా దృష్టి లో నీకంటే వీడు నయం..ప్రేమ కడుపునింపదు తెలుసుకో" .
ఇలా అన్నానని బాధపడకు అంది రాధ.
By KondaKintali.













