# పంచాంగం #🌅శుభోదయం #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🙏సోమవార భక్తి స్పెషల్
🕉 *శ్రీ గురుభ్యోనమః* 🕉
*卐 🌺 పఞ్చాఙ్గమ్ 🌺卐*
*❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀*
🗓 *_తేది: ౨౯/౦౯/౨౦౨౫_*
*_కలిగతాబ్దాః ౫౧౨౬_*
*_సెప్టెంబర్ 29, 2025_*
*_స్వస్తి శ్రీ చాన్ద్రమాన_*
📜సంవత్సరః : శ్రీ విశ్వావసు నామ సంవత్సరః
⌛ఆయనమ్ : దక్షిణాయనమ్
🌦ఋతుః : శరదృతుః
🎡మాసః : ఆశ్వయుజమాసః
🌗 పక్షమ్ : శుక్ల / శుద్ధపక్షమ్
🔔తిథిః : సప్తమీ మ.12:05 పర్యన్తం. తదుపరి అష్టమీ
💢వాసరః : ఇందువాసరః (సోమవారము)
🌟నక్షత్రమ్ : మూలా రా.తె.03:13 పర్యన్తం. తదుపరి పూర్వాషాఢా
🔱యోగః : సౌభాగ్యమ్ రా.11:19 పర్యన్తం. తదుపరి శోభనమ్
☀కరణమ్ : వణిక్ / వణిజ మ.12:05 పర్యన్తం. తదుపరి భద్రః / విష్ఠి రా. 12:45 పర్యన్తం. ఆ తదుపరి బవః
🌅సూర్యోదయః : 06:06
🌄 సూర్యాస్తమయః : 06:07
🌞సూర్యరాశిః : కన్యా👩
🌜చన్ద్రరాశిః : ధనుః / ధనుస్సు🏹
🔯అభిజిత్ : ఉ.11:42 - 12:30 పర్యన్తం
🕓వర్జ్యమ్ : ఉ.09:51 - 11:35 పునః రా.01:29 - 03:13 పర్యన్తం
⌚అమృతకాలః : రా.08:16 - 10:00 పర్యన్తం
⏰దుర్ముహూర్తమ్ : మ.12:15 - 01:03 పునః మ.02:38 - 03:26 పర్యన్తం
🐍రాహుకాలః : ఉ.07:30 - 09:00 పర్యన్తం
😈యమగణ్డకాలః : ఉ.10:30 - 12:00 పర్యన్తం
🔮గుళికాకాలః : మ.01:30 - 03:00 పర్యన్తం
*_𝕝𝕝ॐ𝕝𝕝 దినవిశేషః: సరస్వతీ దేవీ పూజా, మూలా నక్షత్రమ్, తిరుమల శ్రీవారి స్వర్ణరథరంగ డోలోత్సవమ్, దేవీ త్రిరాత్ర వ్రతారంభః, ప్రపంచ హృదయ దినోత్సవమ్ 𝕝𝕝卐𝕝𝕝_*
*_𝕝𝕝ॐ𝕝𝕝 శ్రీ దేవీ శరన్నవరాత్రులు 8వ రోజు నేటి అలంకారం: దేవీ మహాగౌరీగా దర్శనమ్_*
*_ఇంద్రకీలాద్రిపై: శ్రీ సరస్వతీ దేవీగా దర్శనమ్ 𝕝𝕝卐𝕝𝕝_*
*_🔆 బతుకమ్మ పండుగ : 9వ రోజు - సద్దుల బతుకమ్మ 🔆_*
*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*
#🌅శుభోదయం #venkateswara #వెంకటేశ్వరస్వామి #🙏శనివారం భక్తి స్పెషల్ 💐
*దివ్య ఆనందనిలయం*
*~~~~~~~~~~~~*
*తిరుమల తిరుపతి*
*~~~~~~~~~~*
వైష్ణవాలయాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచి నిరంతరాయంగా అభివృద్ది చెందుతూ వైదిక కార్యక్రమాలు, భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమోగే పవిత్ర ఆలయంగా ప్రసిద్దికెక్కింది తిరుమల శ్రీనివాసుని దివ్య ఆలయం. ఈ ఆలయంలో స్వామివారు నవరత్న ఖచిత దివ్యాభరణాలతో, పట్టు పీతాంబరాలతో, జవ్వాజి-కస్తూరి మొదలగు పరిమళ ద్రవ్యాలతో కూడిన ఊర్ద్వపుండ్రంతో స్వామివారు ప్రకాశిస్తుంటారు. స్వామివారు చతుర్భుజాలతో, నాగభరణాలతో ఉంటారు. ఊర్ద్వ హస్తాలలో శంఖు, చక్రాలు ధరించబడి ఉంటాయి.
అధో హస్తాలలో కుడిహస్తం అభయహస్తంగాను, వామహస్తం కఠిహస్తంగాను ఉంటాయి. ఇక వక్షస్థలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఈ మహిమాన్వితమైన స్వామివారు స్వర్ణరేకుపూతలతో కూడిన దివ్య ఆనందనిలయంలో కొలువుదీరి ఉంటారు. ఈ ఆనంద నిలయం దివ్యవిమానం, రెండు గోపురాలతో, మూడు ప్రాకారాలతో, సప్తద్వారాలతో, నిర్మింపబడి ఉంటుంది.
విమానాంతార్థుడైన ఆ భగవంతుని శ్రీమన్నారాయణుడని, వైకుంఠ వాసుడని, ఆపద మొక్కుల వాడని, ఆనాధరక్షకుడని, ఆపద్భాంధవుడుని, వడ్డీకాసులవాడని ఇలా పలు నామాలతో భక్తులు వారి వారి మనోప్రవృతిని బట్టి వెంకన్నను పిలుస్తుంటారు. శ్రీనివాసుని స్థానం వెంకటగిరి. ఇది సాక్షాత్తు వైకుంఠంలో పాలసముద్రంపై గల ఆదిశేషువు అని పురాణాల్లో కీర్తింపబడి ఉంది. ఈ పర్వతానికి వృషభాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి, శేషాద్రి, గరుడాద్రి అని అనేక నామాంతరాలు ఉన్నాయి. ఈ ఆగ్నిపై ఉండే వృక్షాలు, జంతువులు, పక్షులు తదితరాలు అన్ని పరమశక్తి సంపన్నులైన రుషులుగా వెంకటాచల మహత్యం అభివర్ణిస్తోంది. వేంకటాద్రి వాసునికి జరిగే పూజాకైంకర్యాలు అన్ని వైఖానస ఆగమశాస్త్రోక్తంగా నిర్వహిస్తుంటారు. ఆ ఆగమం శ్రీనివాసుని అర్చించడానికే వైదిక పద్దతిలో ఆవిర్భవించిందన్నది పెద్దల మాట. మాసపూజలు, వారపూజలు, నిత్యపూజలు, నైమిత్తి పూజలు అన్ని కూడా ఈ ఆగమ విధానంతోనే అర్చకులు నిర్వహిస్తుంటారు. ఈ పూజలన్నింటిలోను ఒక ప్రత్యేకతను సంతరించుకునేది బ్రహ్మోత్సవం.
వేంకటాచల మహత్యంలో స్వామివారి బ్రహ్మోత్సవాల గురించి ప్రస్తావించబడింది. రవి కన్యామాసంలో ప్రవేశించిన తరువాత వచ్చే శ్రవణానక్షత్రం రోజున అవబృదమనే కార్యక్రమాన్ని నిర్ణయించుకుని దానికి తొమ్మిదిరోజులు నవాహ్నిక బ్రహ్మోత్సవాలుగా నిర్వహిస్తున్నారు.
*`విమాన నిర్మాణ వైశిష్ట్యం`*
తిరుమల క్షేత్రంలో ‘ ఆనంద నిలయ విమానం’ అనే ప్రసిద్ధమైన పేరును పొంది ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బంగరు గోపురం ‘త్రితల గోపురం’ (మూడంతస్తుల గోపురం) అని చెప్పబడుచున్నది. క్రింది మొదటి రెండంతస్థులు దీర్ఘచతురస్త్రాకారంగానూ, మూడవది అయిన చివరి అంతస్థు వర్తులాకారంగానూ నిర్మింపబడినది.
*`నిర్మాణ వర్ణన`*
వేసరశైలిలో ఏకకలశ శిఖరంలో నిర్మింపబడిన ఈ బంగారు గోపురం ఎత్తు కలశంతో సహా 37 అడుగులా 8 అంగుళాలు. ఈ గోపురం కింద నిర్మింపబడిన ప్రాకారం ఎత్తు 27 అడుగులా 4 అంగుళాలు. అనగా భూమితలం నుంచి బంగారు కలశం వరకు కూడా మొత్తం ఆనందనిలయ విమానం ఎత్తు 65 అడుగులా 2 అంగుళాలు. బంగారు శిఖరంలో దీర్ఘచతురస్రాకారపు మొదటి అంతస్థు 10 అడుగులా 6 అంగుళాలు ఎత్తును కలిగి ఉంది. ఈ భాగంగా ఎలాంటి బొమ్మలు లేవు. కేవలం చిన్న చిన్న లతలు, తీగలు, మకరతోరణాలు, చిన్న శిఖరాలు మాత్రమే ఇందులో ఉన్నాయి.
ఇక గోపురంలోని దీర్ఘచతురస్రాకారపు రెండవ అంతస్థు 10 అడుగులా 9 అంగుళాల ఎత్తును కలిగి ఉండటమే కాకుండా ఇందులో చుట్టూ 40 బొమ్మలు ఏర్పాటుచేయబడినవి. ఈ రెండవ అంతస్థులోనే ఉత్తర దిక్కున పడమటి వారకు (వాయవ్యమూలకు) ‘శ్రీ వేంకటేశ్వర స్వామి’ ఉత్తరాభిముఖంగా వేంచేసి దర్శనమిస్తూ ఉన్నాడు. ఈయనే ‘విమాన వేంకటేశ్వర స్వామి’. ఇక గోపురంలోని చివరి అంతస్థు వర్తులాకారాన్ని కలిగి ఉండి, 16 అడుగులా 3 అంగుళాల ఎత్తులో విరాజిల్లుతోంది. ఈ భాగంలో మహాపద్మంతో పాటు 20 బొమ్మలు ఉన్నాయి. ఈ చివరి వర్తులాకారంలోనే నాలుగు మూలల్లో 8 సింహాల బొమ్మలు ఉన్నాయి. అనగా ఒక్కొక్క మూలలోచిన్న పద్మాన్ని పరివేష్టించిన రెండు సింహాల వంతున నాలుగు మూలల్లో మొత్తం 8 సింహాలున్నాయి. బంగారు కలశానికి ఆనుకొని కింది భాగంలో ఉన్న ‘మహాపద్మ’ చిలకలు, లతలు, హంసలు మున్నగు చిత్రాలతో అత్యంత విలక్షణంగా ఆకర్షణీయంగా విరాజిల్లుతూ ఉంది.
*_𝕝𝕝 ॐ 𝕝𝕝 శ్రీవేఙ్కటేశ చరణౌ శరణం ప్రపద్యే 𝕝𝕝 卐 𝕝𝕝_*
#🌼9 రోజుల బతుకమ్మ🎉 #🌅శుభోదయం #good morning #⛳భారతీయ సంస్కృతి #🇮🇳 మన దేశ సంస్కృతి
*_𝕝𝕝ॐ𝕝𝕝 28/09/2025 - బతుకమ్మ పండుగ : 8వ రోజు - వెన్న ముద్దల బతుకమ్మ 𝕝𝕝卐𝕝𝕝_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*
*వెన్న ముద్దల బతుకమ్మ*
*━❀꧁ 🔆 ꧂❀━*
ఎనిమిదవ రోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి దేవాలయం వద్ద ఆట, పాటల మధ్య చెరువులో వేస్తారు.
నేటి రోజు బెల్లం మెత్తగా దంచుతారు. ఈ బెల్లంలో నువ్వులు కలిపిన తర్వాత వెన్న కలుపుతారు. వెన్న లేకపోతే నెయ్యి ఉపయోగిస్తారు. మూడింటినీ బాగా కలిపిన తర్వాత ముద్దలు చేస్తారు. ఈ వెన్న ముద్దలను నైవేద్యంగా పెడతారు.
#🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🙏హ్యాపీ నవరాత్రి🌸 #good morning #🌅శుభోదయం #🔥శ్రీ మహాచండీ దేవి🦅
*_𝕝𝕝ॐ𝕝𝕝 28/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 7వ రోజు - అలంకారం: దేవీ కాళరాత్రీగా దర్శనమ్ 𝕝𝕝卐𝕝𝕝_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*
*_దేవీ కాళరాత్రీ_*
*━❀꧁🔆꧂❀━*
*శ్లో𝕝𝕝 ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్ఠమం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత||*
*_”దేవీ కాళరాత్రీ" ధ్యాన శ్లోకం_*
*_శ్లో𝕝𝕝 ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా| లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ| వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా | వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||_*
"కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.
కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను "శుభంకరి" అనియు అంటారు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు.
కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూత, ప్రేత, పిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.
*_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo శ్రీ కాళరాత్రీదేవ్యై నమః 𝕝𝕝卐𝕝𝕝_*
#🔥శ్రీ మహాచండీ దేవి🦅 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🌅శుభోదయం #🙏హ్యాపీ నవరాత్రి🌸 #good morning
*_𝕝𝕝ॐ𝕝𝕝 28/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 7వ రోజు - అలంకారం: “ఇంద్రకీలాద్రి”పై అమ్మవారు "శ్రీ మహాచండీ దేవీ" అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. 𝕝𝕝卐𝕝𝕝_*
#🔥శ్రీ మహాచండీ దేవి🦅 #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🌅శుభోదయం #good morning #🙏హ్యాపీ నవరాత్రి🌸
*_𝕝𝕝ॐ𝕝𝕝 28/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 7వ రోజు - అలంకారం: “ఇంద్రకీలాద్రి”పై అమ్మవారు "శ్రీ మహాచండీ దేవీ" అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. 𝕝𝕝卐𝕝𝕝_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*
*_శ్రీ మహాచండీ దేవీ_*
*❀━꧁🔆꧂━❀*
శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు 7వ రోజు శ్రీ మహాచండీ దేవి అలంకారములో దర్శనమిస్తారు.
*_శ్లో𝕝𝕝 దేవానాం కార్యసిద్ధ్యర్థం_ మావిర్భవతిసా యదా |*
*_ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యా ప్యభిధీయతే |_*
దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహా చండీ అమ్మవారు ఉద్భవించినది.
శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు.
శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే. శ్రీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, ఏ కోరికలతో ప్రార్థిస్తామో ఆ కోరికలు అన్నీ సత్వరమే లభిస్తాయి.
*_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo శ్రీ మహాచండీదేవ్యై నమః 𝕝𝕝卐𝕝𝕝_*
#🌅శుభోదయం #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #శుక్రవారం #మంగళవారం #good morning
# పంచాంగం #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #శుక్రవారం #మంగళవారం #🙏శనివారం భక్తి స్పెషల్ 💐
🕉 *శ్రీ గురుభ్యోనమః* 🕉
*卐 🌺 పఞ్చాఙ్గమ్ 🌺卐*
*❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀*
🗓 *_తేది: ౨౮/౦౯/౨౦౨౫_*
*_కలిగతాబ్దాః ౫౧౨౬_*
*_సెప్టెంబర్ 28, 2025_*
*_స్వస్తి శ్రీ చాన్ద్రమాన_*
📜సంవత్సరః : శ్రీ విశ్వావసు నామ సంవత్సరః
⌛ఆయనమ్ : దక్షిణాయనమ్
🌦ఋతుః : శరదృతుః
🎡మాసః : ఆశ్వయుజమాసః
🌗 పక్షమ్ : శుక్ల / శుద్ధపక్షమ్
🔔తిథిః : షష్ఠీ ఉ.10:22 పర్యన్తం. తదుపరి సప్తమీ
💢వాసరః : భానువాసరః (ఆదివారము)
🌟నక్షత్రమ్ : జ్యేష్ఠా రా.01:09 పర్యన్తం. తదుపరి మూలా
🔱యోగః : ఆయుష్మాన్ రా.11:09 పర్యన్తం. తదుపరి సౌభాగ్యమ్
☀కరణమ్ : తైతులః ఉ.10:22 పర్యన్తం. తదుపరి గరః / గరజి రా. 11:14 పర్యన్తం. ఆ తదుపరి వణిక్ / వణిజ
🌅సూర్యోదయః : 06:06
🌄 సూర్యాస్తమయః : 06:07
🌞సూర్యరాశిః : కన్యా👩
🌜చన్ద్రరాశిః : వృశ్చికః🦂రా.తె.03:55 పర్యన్తం. తదుపరి ధనుః / ధనుస్సు🏹
🔯అభిజిత్ : ఉ.11:43 - 12:31 పర్యన్తం
🕓వర్జ్యమ్ : ఉ.శే.06:41 వ.
⌚అమృతకాలః : మ.03:29 - 05:14 పర్యన్తం
⏰దుర్ముహూర్తమ్ : సా.04:15 - 05:03 పర్యన్తం
🐍రాహుకాలః : సా.04:30 - 06:00 పర్యన్తం
😈యమగణ్డకాలః : మ.12:00 - 01:30 పర్యన్తం
🔮గుళికాకాలః : మ.03:00 - 04:30 పర్యన్తం
*_𝕝𝕝ॐ𝕝𝕝 దినవిశేషః: 𝕝𝕝卐𝕝𝕝_*
*_𝕝𝕝ॐ𝕝𝕝 శ్రీ దేవీ శరన్నవరాత్రులు 7వ రోజు నేటి అలంకారం: దేవీ కాళరాత్రీగా దర్శనమ్_*
*_ఇంద్రకీలాద్రిపై: శ్రీ మహాచండీ దేవీగా దర్శనమ్ 𝕝𝕝卐𝕝𝕝_*
*_🔆 బతుకమ్మ పండుగ : 8వ రోజు - వెన్న ముద్దల బతుకమ్మ 🔆_*
*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*
#🏵️శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి🕉️ #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #శుక్రవారం #మంగళవారం #🙏హ్యాపీ నవరాత్రి🌸
*_𝕝𝕝ॐ𝕝𝕝 27/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 6వ రోజు - అలంకారం: “ఇంద్రకీలాద్రి”పై అమ్మవారు "శ్రీ లలితా త్రిపురసుందరీ దేవీ" అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. 𝕝𝕝卐𝕝𝕝_*
#🌅శుభోదయం #శుక్రవారం #🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #🙏హ్యాపీ నవరాత్రి🌸 #మంగళవారం
*_𝕝𝕝ॐ𝕝𝕝 27/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 6వ రోజు - దేవీ కాత్యాయనీగా దర్శనమ్ 𝕝𝕝卐𝕝𝕝_*