*గణేష్ పాడు గున్నేపల్లి గ్రామాలలో బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె*
01.10.2025 - బుధవారం
దమ్మపేట మండలం గణేష్ పాడు గున్నేపల్లి గ్రామాలలో దసరా ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న గౌరవ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కోటగిరి సత్యంబాబు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. #కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్
*అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి ---ఎమ్మెల్యే జారె*
02.10.2025 - గురువారం
విజయదశమి సందర్భంగా దమ్మపేట మండలం నాచారం గ్రామంలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహ స్వామి జగదాంబ సమేత జయలింగేశ్వర స్వామివార్ల దేవాలయాలను గౌరవ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ* గారు సందర్శించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఈ సందర్భంలో మాట్లాడుతూ విజయదశమి పండుగ చెడుపై మంచి గెలిచిన రోజుగా అందరికీ స్ఫూర్తి కలిగిస్తుందన్నారు ఐకమత్యం సత్యం ధర్మం విజయాన్ని సాధిస్తాయని ఈ పండుగ మనకు గుర్తు చేస్తుందన్నారు అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ శాంతి సౌభాగ్యం ఆయురారోగ్యాలు సిద్ధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానన్నారు #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలసిన ఎమ్మెల్యే జారె
📅 02-10-2025, గురువారం
విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార & పౌర సంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నారాయణపురంలోని వారి స్వగృహంలో గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు తన సతీమణితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె గారు మంత్రివర్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. #కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్
*రాచూరుపల్లి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె*
📅 02.10.2025 - గురువారం
దమ్మపేట మండలం రాచూరుపల్లి గ్రామంలో స్థానిక యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు హాజరై విజేత జట్లకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. క్రీడలలో పాల్గొనడం వలన యువతలో మానసిక, శారీరక శక్తులు పెరుగుతాయని, సమాజంలో స్నేహభావం పెరుగుతుందని తెలిపారు. క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచే ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన రాచూరుపల్లి యూత్ సభ్యులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాకా రమేష్ గారు, మాజీ ఎంపీటీసీ నాయుడు శ్రీను గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరాముల ప్రసాద్ గారు, ముల్లపూడి వెంకటేశ్వరరావు గారు, మడకం రాజేష్ గారు, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్
పలు శుభకార్యాలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె
📅 29.09.2025 (సోమవారం)
అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ఈరోజు పలు శుభకార్యాలలో పాల్గొన్నారు.
అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రులలో భాగంగా నిర్వహిస్తున్న వేడుకలలో గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు పదిలం సత్తిబాబు - లక్ష్మీ దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు.
అలాగే కావడిగుండ్ల గ్రామంలో యువజన కాంగ్రెస్ నాయకుడు షేక్ బషీర్ - నస్రిన్ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమాలలో:
మండల పార్టీ అధ్యక్షులు తుమ్మా రాంబాబు
ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు
జూపల్లి ప్రమోద్
జేష్ఠ సత్యనారాయణ చౌదరి
కాంగ్రెస్ పార్టీ నాయకులు
తదితరులు పాల్గొన్నారు. #కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్
నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన నిధులపై మీడియా సమావేశం – ఎమ్మెల్యే జారె
📅 29.09.2025 (సోమవారం)
📍 అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయం
గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ఈరోజు అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో గతంలో నిర్మించబడిన 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేసి ఇండ్లు కేటాయించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అశ్వారావుపేట కొత్త మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ₹15 కోట్లు నిధులు మంజూరు చేసిందని తెలిపారు.
ఈ నిధులతో చేపట్టబోయే ప్రధాన పనులు:
✅ నూతన మున్సిపాలిటీ భవనం
✅ ఆధునిక మున్సిపల్ మార్కెట్
✅ పబ్లిక్ టాయిలెట్లు
✅ ట్యాంక్ బండ్ అభివృద్ధి
✅ దొంతికుంట చెరువు అభివృద్ధి
✅ సీసీ రోడ్లు & డ్రైనేజీలు
అదేవిధంగా,
అశ్వారావుపేట, దమ్మపేట, మందలపల్లి, చండ్రుగొండ బస్ స్టాండ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు.
నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త బీటీ రోడ్లు, రైతుల కోసం గ్రావెల్ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణం కోసం కూడా నిధులు సమీకరించామని, త్వరలోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో:
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు
ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు
దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి
ఎమ్మార్వో రామకృష్ణ
మున్సిపల్ కమిషనర్ నాగరాజు
పలు శాఖల అధికారులు, మండల నాయకులు, జూపల్లి ప్రమోద్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్
*వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే జారె*
📅 25.09.2025 – గురువారం
*రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే జారె నియామకం*
రంగారెడ్డి జిల్లా మన్నగూడలో నిర్వహించిన వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎమ్మెల్యే జారె గారిని రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
సభలో ప్రసంగించిన జారె గారు,
👉 ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ముందు తాను ఒక సాధారణ వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడిగా కృషి చేసి, రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి బహుమతులు అందుకున్నానని గుర్తుచేశారు.
👉 విద్యార్థుల శారీరక ఆరోగ్యం, క్రమశిక్షణ, ధైర్యాన్ని పెంపొందించడంలో క్రీడల పాత్ర అపారమని వివరించారు.
👉 తన వృత్తి ఉపాధ్యాయుడిగానే మొదలైందని, నేడు తాను ఈ స్థాయికి రావడానికి కూడా ఆ ఉపాధ్యాయ వృత్తే కారణమని అన్నారు.
👉 క్రీడా రంగ అభివృద్ధి కోసం, ఉపాధ్యాయుల గౌరవం పెంచే దిశగా ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మళ్ రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ చైర్మన్ శివ నాగిరెడ్డి, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ ప్రముఖులు మరియు అనేక మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. #కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్
*రైతు ప్రయోజనాల కోసం ఆత్మ కమిటీ కృషి చేయాలి — ఎమ్మెల్యే జారె*
📅 24.09.2025 – బుధవారం
అశ్వారావుపేట మండలకేంద్రంలోని శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్లో ఆత్మ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ *మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్* గారితో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అశ్వారావుపేట *ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు *సుంకవల్లి వీరభద్రరావు* గారు ఆత్మ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు మరో 25 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడుతూ, “రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆత్మ కమిటీ చురుకైన పాత్ర పోషించాలి. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ఈ కమిటీ వంతు కృషి అవసరం” అని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న *కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్* పథకాల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే, *ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అదనంగా మంజూరైన *1000 ఇళ్లకు సంబంధించిన *ఇందిరమ్మ ఇండ్ల అర్హత పత్రాలు* పంపిణీ చేశారు.
జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్
*ప్రత్యేక మాస్టర్ ప్లాన్ తో మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధి --- ఎమ్మెల్యే జారె*
*23.09.2025 - మంగళవారం*
ములుగు జిల్లా మేడారంలో గిరిజన దేవతలైన సమ్మక్క-సారలమ్మ అమ్మవారి గద్దెల అభివృద్ధి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి ధనసరి సీతక్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
*అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.*
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సమ్మక్క-సారలమ్మ గద్దెలను ఆధునికంగా అభివృద్ధి చేసి, యాత్రికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.
*ఈ చారిత్రాత్మక నిర్ణయం గిరిజన సమాజంతో పాటు తెలంగాణ ప్రజలకు గర్వకారణమని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు అభిప్రాయపడ్డారు.* #కాంగ్రెస్ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్
*చండ్రుగొండ – అన్నపురెడ్డిపల్లి – ములకలపల్లి మండలాలలో* *పర్యటించిన ఎమ్మెల్యే జారె*
*22.09.2025 – సోమవారం*
అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ఈ రోజు చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి మండలాల్లో పర్యటించారు.
ముందుగా చండ్రుగొండ మండల కేంద్రంలో చింతల వెంకటేశ్వర్లు గారికి అత్యవసర సర్జరీ కోసం రూ.2,50,000ల ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి చెక్కును అందించారు.
తరువాత అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, ములకలపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మానసిక అంగవైకల్య వికలాంగుల కోసం రూ.28,50,000ల వ్యయంతో నిర్మించబోయే మూడు భవనాలకు శంకుస్థాపన చేశారు.
అన్నపురెడ్డిపల్లి రైతు వేదికలో రూ.18,02,088, ములకలపల్లి రైతు వేదికలో రూ.32,03,712 నిధులతో చేపట్టబోయే పనులను ప్రారంభించారు. అలాగే ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
అన్నపురెడ్డిపల్లి సోషల్ వెల్ఫేర్ వసతిగృహం, ములకలపల్లి జూనియర్ కళాశాల, ములకలపల్లి కేజీబీవీ పాఠశాలలో రీనోవేషన్ & రిపేర్ వర్క్‌ల కోసం రూ.40 లక్షలతో చేపట్టబోయే పనులను ప్రారంభించారు.
చివరిగా ములకలపల్లి మండలం కంపగూడెం గ్రామంలో గ్రామస్థుల ఆహ్వానం మేరకు బతుకమ్మ వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాలలో మూడు మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్