#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలు 🙏
#ప్రతి రోజు సాయంత్రం - ప్రదోష కాలంలో
అమ్మవారుశివుడు ఆనంద తాండవంచేస్తూ ఉంటారట
__ ఈ సమయములో చేసే పూజలు అంటే __ #అమ్మవారికి చాల ఇష్ఠం అట*
అవి ఆర్ద్రనతకరి అని, అనంత తృతీయ, రసకల్యని అని వ్రతం చాలా ఇష్టం అని పురాణ వచనం.
ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయటం
#అత్యంత #ప్రీతికరం.🙏
ప్రతి #మంగళవారం అమ్మవారిని #సేవించడం,
#పూజ చేయటం, #అర్చన చేయటం, #వ్రతం చేయటం కూడా విశేషం అని అమ్మవారు చెపుతుంది*
#ఎవరు మంగళవారం #అమ్మవారిని
పూజ చేస్తారో వారికీ శత్రు పీడలు #ఉండవు !!
రోగ నివారణ, అప్పులు, రుణాలు తీరిపోతాయి * అని, కుజ గ్రహ దోషాలు జాతకం లో ఎక్కడ ఉన్న కూడా దోష పరిహారం అవుతుంది అని *
#అమ్మవారికి అత్యంత ప్రీతికర్మయిన రోజు
ఈ భౌమవారం (మంగళవారం) అని చెపుతారు. ఎవర్ని అయితే అమ్మవారు కరుణిస్తుందో
వారి ఇంటికి అమ్మవారు కదిలి వస్తుందట #
#పిలవని పేరంటంగా ఎవరు వస్తారో
వారే అమ్మవారి స్వరూపంగా చెపుతారు.
కృష్ణ చతుర్దశి (బహుళ చతుర్దశి ), ప్రతి మాసంలో అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి రోజున అమ్మవారిని స్తుతించటం వలన అమ్మవారి
కృపకి పాత్రులు కావచ్చు #
#నవరాత్రి ద్వయం అంటే శరన్నవరాత్రులు
( దసరా నవరాత్రి ), వసంత నవరాత్రులు,
( ఉగాది నుంచి శ్రీ రామ నవమి వరకు చేసేది)
అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన నవరాత్రులు*
#వసంత నవరాత్రులు ఎందుకు అమ్మవారికి ఇష్టం అంటే దేవి భాగవతం లో " శ్రీ రామో లలితాంబికా,
శ్రీ కృష్ణో శ్యామలంబ " అంటారు, అంటే శ్రీ రాముడు ఎవరో కాదు లలితా పరమేశ్వరే, స్వరూపం రాముడు, అవతారం లలితాంబ అని చెపుతారు *
#శ్రీ రాముడికి పూజ చేసిన అమ్మవారికి పూజ చేసినట్టే. అందుకనే శ్రీ రామ నవరాత్రులలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు.అమ్మవారు మనల్ని ఎలా ఏ రూపం లో అనుగ్రహిస్తుంది ?కాళి, చండి, బాల, లలిత, దుర్గ.
అనేక రూపాలలో ఉండి మనని నడిపిస్తుంది *
కరుణిస్తుంది అని #
#ఒకటి అని కాదు అమ్మవారు సకల_
వ్యాప్తం అయి ఉంది, మాత్రు రూపం, శాంతి రూపం , ఆకలి రూపంలో, జాతి రూపంలో, చైతన్య స్వరూపం,
నిద్ర రూపంలో, దయా రూపంలో, బుద్ది రూపంలో కూడా అమ్మవారు ఉంది మనని నడిపిస్తుంది 🍁
#అమ్మవారిని ఏమి కోరుకోవాలి ?
కొందరు పిల్లలు కావాలి అని,
ఇల్లు కట్టుకోవాలి అని,
పెళ్లి కావాలని రక రకాల కోరికలు కోరతాం *
కానీ ఏది కోరిన మళ్ళీ దాని వలన కలిగే సుఖం_ అల్పం, క్షణికం, అది తీరగానే మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది.మరి ఏమి కోరాలి ?
#శంకరాచార్య అంటారు " నన్ను కరుణించు,
నాతో ఉండు" మోక్షం వద్దు,విద్య వద్దు,
సంపదలు వద్దు, కానీ నీ నామ స్మరణ చాలు,
నాతో ఉండాలి. ఎప్పుడూ నీ పాదాల చెంత
భక్తీ కలిగి ఉండాలి, ఎప్పుడు కరుణిస్తూ ఉండాలి, నన్ను ధర్మమయిన మార్గం లో నడిపించాలి,
అని కోరుకోవాలి అంటారు...🙏
ఓం శ్రీ మాత్రే నమః🙏🙏
సర్వోజన సుఖినోభావంత్
https://youtube.com/shorts/AyfOYigGLC0?si=bLIYZzEAbs1xZb4j #🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹
https://youtube.com/shorts/nxQl3n8DVkY?si=mL0MFzPOrafzn7HF #🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 మహిషాసుర మర్దిని స్తోత్రము
🙏🌸🙏🌸🙏🌸🙏
అయి గిరినందిని నందితమేదిని విశ్వ-వినోదిని నందనుతే
గిరివర వింధ్య-శిరోఽధి-నివాసిని విష్ణు-విలాసిని జిష్ణునుతే |
భగవతి హే శితికంఠ-కుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 1 ||
సురవర-హర్షిణి దుర్ధర-ధర్షిణి దుర్ముఖ-మర్షిణి హర్షరతే
త్రిభువన-పోషిణి శంకర-తోషిణి కల్మష-మోషిణి ఘోషరతే |
దనుజ-నిరోషిణి దితిసుత-రోషిణి దుర్మద-శోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 2 ||
అయి జగదంబ మదంబ కదంబవన-ప్రియవాసిని హాసరతే
శిఖరి-శిరోమణి తుఙ-హిమాలయ-శృంగనిజాలయ-మధ్యగతే |
మధుమధురే మధు-కైతభ-గంజిని కైతభ-భంజిని రాసరతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 3 ||
అయి శతఖండ-విఖండిత-రుండ-వితుండిత-శుండ-గజాధిపతే
రిపు-గజ-గండ-విదారణ-చండపరాక్రమ-శౌండ-మృగాధిపతే |
నిజ-భుజదండ-నిపాటిత-చండ-నిపాటిత-ముండ-భటాధిపతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 4 ||
అయి రణదుర్మద-శత్రు-వధోదిత-దుర్ధర-నిర్జర-శక్తి-భృతే
చతుర-విచార-ధురీణ-మహాశయ-దూత-కృత-ప్రమథాధిపతే |
దురిత-దురీహ-దురాశయ-దుర్మతి-దానవ-దూత-కృతాంతమతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 5 ||
అయి నిజ హుంకృతిమాత్ర-నిరాకృత-ధూమ్రవిలోచన-ధూమ్రశతే
సమర-విశోషిత-శోణితబీజ-సముద్భవశోణిత-బీజ-లతే |
శివ-శివ-శుంభనిశుంభ-మహాహవ-తర్పిత-భూతపిశాచ-పతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 6 ||
ధనురనుసంగరణ-క్షణ-సంగ-పరిస్ఫురదంగ-నటత్కటకే
కనక-పిశంగ-పృషత్క-నిషంగ-రసద్భట-శృంగ-హతావటుకే |
కృత-చతురంగ-బలక్షితి-రంగ-ఘటద్-బహురంగ-రటద్-బటుకే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 7 ||
అయి శరణాగత-వైరివధూ-వరవీరవరాభయ-దాయికరే
త్రిభువనమస్తక-శూల-విరోధి-శిరోధి-కృతాఽమల-శూలకరే |
దుమి-దుమి-తామర-దుందుభి-నాద-మహో-ముఖరీకృత-దిఙ్నికరే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 8 ||
సురలలనా-తతథేయి-తథేయి-తథాభినయోదర-నృత్య-రతే
హాసవిలాస-హులాస-మయిప్రణ-తార్తజనేమిత-ప్రేమభరే |
ధిమికిట-ధిక్కట-ధిక్కట-ధిమిధ్వని-ఘోరమృదంగ-నినాదరతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 9 ||
జయ-జయ-జప్య-జయే-జయ-శబ్ద-పరస్తుతి-తత్పర-విశ్వనుతే
ఝణఝణ-ఝింఝిమి-ఝింకృత-నూపుర-శింజిత-మోహితభూతపతే |
నటిత-నటార్ధ-నటీనట-నాయక-నాటకనాటిత-నాట్యరతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 10 ||
అయి సుమనః సుమనః సుమనః సుమనః సుమనోహర కాంతియుతే
శ్రితరజనీరజ-నీరజ-నీరజనీ-రజనీకర-వక్త్రవృతే |
సునయనవిభ్రమ-రభ్ర-మర-భ్రమర-భ్రమ-రభ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 11 ||
మహిత-మహాహవ-మల్లమతల్లిక-మల్లిత-రల్లక-మల్ల-రతే
విరచితవల్లిక-పల్లిక-మల్లిక-ఝిల్లిక-భిల్లిక-వర్గవృతే |
సిత-కృతఫుల్ల-సముల్లసితాఽరుణ-తల్లజ-పల్లవ-సల్లలితే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 12 ||
అవిరళ-గండగళన్-మద-మేదుర-మత్త-మతంగజరాజ-పతే
త్రిభువన-భూషణభూత-కళానిధిరూప-పయోనిధిరాజసుతే |
అయి సుదతీజన-లాలస-మానస-మోహన-మన్మధరాజ-సుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 13 ||
కమలదళామల-కోమల-కాంతి-కలాకలితాఽమల-భాలతలే
సకల-విలాసకళా-నిలయక్రమ-కేళికలత్-కలహంసకులే |
అలికుల-సంకుల-కువలయమండల-మౌళిమిలద్-వకులాలికులే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 14 ||
కర-మురళీ-రవ-వీజిత-కూజిత-లజ్జిత-కోకిల-మంజురుతే
మిలిత-మిలింద-మనోహర-గుంజిత-రంజిత-శైలనికుంజ-గతే |
నిజగణభూత-మహాశబరీగణ-రంగణ-సంభృత-కేళితతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 15 ||
https://t.me/SriAnamdalahari
కటితట-పీత-దుకూల-విచిత్ర-మయూఖ-తిరస్కృత-చంద్రరుచే
ప్రణతసురాసుర-మౌళిమణిస్ఫురద్-అంశులసన్-నఖసాంద్రరుచే |
జిత-కనకాచలమౌళి-మదోర్జిత-నిర్జరకుంజర-కుంభ-కుచే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 16 ||
విజిత-సహస్రకరైక-సహస్రకరైక-సహస్రకరైకనుతే
కృత-సురతారక-సంగర-తారక సంగర-తారకసూను-సుతే |
సురథ-సమాధి-సమాన-సమాధి-సమాధిసమాధి-సుజాత-రతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 17 ||
పదకమలం కరుణానిలయే వరివస్యతి యోఽనుదినం న శివే
అయి కమలే కమలానిలయే కమలానిలయః స కథం న భవేత్ |
తవ పదమేవ పరంపద-మిత్యనుశీలయతో మమ కిం న శివే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 18 ||
కనకలసత్కల-సింధుజలైరనుషింజతి తె గుణరంగభువం
భజతి స కిం ను శచీకుచకుంభత-తటీపరి-రంభ-సుఖానుభవం |
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాశి శివం
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 19 ||
తవ విమలేఽందుకలం వదనేందుమలం సకలం నను కూలయతే
కిము పురుహూత-పురీందుముఖీ-సుముఖీభిరసౌ-విముఖీ-క్రియతే |
మమ తు మతం శివనామ-ధనే భవతీ-కృపయా కిముత క్రియతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే || 20 ||
అయి మయి దీనదయాళుతయా కరుణాపరయా భవితవ్యముమే
అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుమితాసి రమే |
యదుచితమత్ర భవత్యురరీ కురుతా-దురుతాపమపా-కురుతే
జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
🙏🌸🌸🌸🌸🌸🙏
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 🕉️ నేడు విజయ దశమిన అమ్మలగన్నయమ్మ శ్రీరాజరాజేశ్వరీదేవిగా దర్శనం ఇస్తున్నారు.🕉️
శ్రీ దుర్గ !
జై దుర్గ |
కనకదుర్గాంబ కరుణించిరావమ్మ |
కాపాడుబ్రోవమ్మ దయచూపరావమ్మ !
దరిజేర్చు మాయమ్మ!
దీవించు ఓయమ్మ |
దీనుణ్ని నేనమ్మ !
నా ప్ర్రార్ధన వినవమ్మ !
నీ దివ్యరూపంబు మనసార ధ్యానింప |
నీ అభయ హస్తంబు నా శిరము నుంచగా!
నీ కరుణ వీక్షంబు, నాపైన కురిపింప!
నీ శక్తి లవలేశం నాపైన ప్రసరింప!
బంధాలు తొలగంగ నవరాత్రులు చేయంగ!
నీకధలు చాటంగ ఆకధలు వినంగ!
జ్ఞాన_యజ్ఞములు గావింప ఆ యజ్ఞములు తిలకింప| సామీప్యం బడయంగ |
సంతోషము కలిగింది.
నీ సంకల్ప భావంబు నా మనమున ఎల్లవేళలా ఉండేలా అనుగ్రహించు తల్లీ|
జగన్మాత !
ఓం శ్రీ రాజరాజేశ్వరీదేవి నమస్తే నమః !
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 *దసరా రోజున బంగారం ఇచ్చి పుచ్చుకోవడం వెనుక ఉన్న కథ* ...!
పూర్వం ప్రతిష్ఠానపురంలో నివసిస్తూన్న దేవదత్తుని తనయుడు కౌత్సుడు. తండ్రి కౌత్సుని విద్యాభ్యాసము కొరకు వరతంతు అనే ఋషికి బాధ్యతను అప్పజెప్పాడు. వరతంతు గురువు వద్ద విద్యను అభ్యసించాడు కౌత్సుడు. దేవదత్తుని కుమారుడు కౌత్సుడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి ఐనది. గురుకులమునుండి ఇంటికి వెళ్ళే తరుణం వచ్చింది.
"గురువర్యా! మీకు ఏ గురుదక్షిణను నేను ఇవ్వవలెను? మీరు ఏదైనా వస్తువులను తెమ్మని ఆనతి ఇస్తే తెస్తాను" వరతంతు దరహాసముతో "నీ శ్రద్ధాసక్తులూ, వినయవిధేయతలే నాకు నీవు ఇస్తూన్న నిజమైన గురుదక్షిణ, అది చాలును నాకు! నీవు పరిపూర్ణ విద్యావంతునివైనావు. నాకు ఆ తృప్తి చాలును" అంటూ ఆశీస్సులు ఇచ్చాడు. కానీ కౌత్సునికి మనసులో ఎంతో వెలితి! ఇన్ని ఏళ్ళుగా భోజనము పెట్టి సాకిన గురు దంపతులు కన్నవారిని తలపించేలా చదువులు చెప్పారు. అట్టి మహనీయులకు ఏమి ఇవ్వక తాను గృహోన్ముఖుడు ఐతే ఎలా?" అదుచే శిష్యపరమాణువు పట్టు విడువక "మీ కోసం ఏదో ఒకటి నేను తెస్తాను,చెప్పండి స్వామీ!”
అయ్యవారికి ఈ బాలుని మొండితనం చిరాకు తెప్పించింది. విసుగుతో "ఐతే నాకు బంగారు నాణెములు కావాలి. నేను నీకు 14వేదములు నేర్పాను. ఒక్కొక్క శాస్త్రానికీ ఒక్కొక్క కోటి చొప్పున 140 కోట్ల హేమ టంకములు తీసుకురా!" అని పలికాడు.
అందుకు "సరే!" నని కౌత్సుడు అంగీకరించి, వరతంతు వద్ద సెలవు తీసుకున్నాడు.
హిందూ ధర్మచక్రం.
అటు తర్వాత బహు యోచన చేసాడు. తండ్రి, హితుల సలహా తీసుకున్నాడు. ధర్మదాత అని పేరు పొందిన రఘు మహారాజు వద్దకు వెళ్ళాడు (రఘు చక్రవర్తి వంశీయుడే శ్రీరామచంద్రుడు, కనుకనే ఆతనిని 'రఘుపతి" అని కూడా పిలుస్తారు)
కౌత్సుడు వెళ్ళే వేళకు రఘు చక్రవర్తి "విశ్వజిత్ యజ్ఞము"ను చేసాడు. యజ్ఞ యాగాలు చేసే ప్రభువులు 'అడిగిన వారికి లేదనకుండా దానము చేయాలి. ఆ ప్రకారము అప్పటికే ప్రజలందరికీ రాజభవనములోని డబ్బు, దస్కమూ, సొమ్ములను యావత్తూ తన సర్వస్వము దానము చేసేసాడు. ఆయన కోటలోకి - ధనమును యాచించుటకు వచ్చినప్పుడు రఘు చక్రవర్తి కోశాగారం ఖాళీ ఐంది. కౌత్సుడు తన ’గురుదక్షిణ’ సంగతి తెల్పగా, ఖిన్నుడు ఐనాడు ఆ చక్రవర్తి.
"కౌత్సా! ఎల్లుండి రమ్ము!" అని చెప్పాడు.
మూడురోజుల గడువులోపల రాజు అంత ధనాన్ని తీసుకురావాలనుకున్నాడు. అతను ఇంద్రుని వద్దకు వెళ్ళి ద్రవ్యమును కోరాడు. ధనపతి కుబేరుని పిలిచాడు మహేంద్రుడు. "కుబేరా! రఘు సామ్రాట్టు ముఖ్యపట్టణము అయోధ్య. ఆ రాజధానిలోని షాణు, అపర్తి చెట్లు పై స్వర్ణ నాణాల వర్షము పడేలా చేయి!" అంటూ అజ్ఞాపించాడు సురపతి. అయోధ్యలో ఎడతెరిపి లేకుండా సువర్ణ వర్షం కురిసింది. అలాగ వర్షించిన ధనమును పూర్తిగా కౌత్సునికి ఇచ్చేసాడు రఘువు. [సురవర అనుగ్రహముతో లభించిన అగణిత అపరంజి రాసులు అవి!]
కానీ కౌత్సుడునికి డబ్బు అంటే వ్యామోహము లేదు. తన గురుదక్షిణకు అవసరమైన 140 కోట్లు మాత్రమే తీసుకున్నాడు కౌత్సుడు. అతడు"మహాప్రభువుకు కృతజ్ఞతలు" చెప్పి గృహోన్ముఖుడైనాడు.
గురువు గారు కోరిన నాణెములు తీసుకుని తక్కినవి రఘురాజుకు తిరిగి ఇచ్చేసాడు కౌత్సుడు.
దానముగా ఇచ్చిన వాటిని మళ్ళీ తీసుకోకూడదు రాజు. కావున రఘువు "ఈ డబ్బును నేను తీసుకోను" అంటూ నిరాకరించెను. అప్పడు కౌత్సుడు మిగిలిన డబ్బును ప్రజలకు అందరికీ పంచాడు. అయోధ్యా పట్టణమునందు తెల్ల ఆరె చెట్ల పైన కనకవర్షము కురిసిన రోజు ఆశ్వీజ శుక్ల దశమి.
పథాన్ నివాసి ఐన కౌత్సుని అన్వేషణ వలన ఆపతి తరువుల కుందన వృష్టి కురిసి, ధనరాసులనిలయాన్ని చేసింది అయోధ్య నగరము సిరి సంపదలు పొంగులు వారి సుఖసంతోషములతో విలసిల్లసాగినది. నాటినుండీ ప్రజలు అత్తి చెట్టు ఆకులను/తెల్ల ఆరె చెట్టు పత్రములను' పసిడి 'కి ప్రతీకలుగా భావిస్తూన్నారు. ఇరుగుపొరుగువారికీ, బంధు మిత్రులకూ ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటూండడం నవ రాత్రి, దసరాల ఆనవాయితీ ఐనది.
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 🌹🙏పరదేవి సూక్తం🙏🌹
పరదేవి ధ్యానమ్ : -
1..ఓం యోగ్మ్యాద్యామర కార్యనిర్గతమహత్తేజః సముత్పద్యతే,
2--భాస్వత్పూర్ణశశాంక చారువదనా నీలోల్లసత్ భ్రూలతామ్,
3..గౌరీతుంగ కుచద్వయా తదుపరి స్ఫూర్జ త్ప్రభామండలం,
4.బంధూకారుణ కాయకాంతిరతిభిః శ్రీ చండికామాశ్రయే.
పరదేవి సూక్తం..
1. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే బీజే-సురాసురత్రిభువననిదానే - దయాంకురే- సర్వదేవతేజోరూపిణి- మహామహా - జయజయ మహాలక్ష్మి - జగదానంద మహిమే-మహామహామయస్వరూపిణి - విరించీశతః సురవరదే- చిదానందే-విష్ణుదేహావృతే - మహామృతమోహిని
2.మధుకైటభవిధ్వంసిని - సత్వరదానే - తత్పరే - మహాసుధాబ్ధి వాసిని మహామహితేజో వధారిణి - సర్వాధారే - సర్వకార్యకారణే, చింత్యరూపే ఇంద్రాది నిఖిల నిర్జరసేవితే - సామగాయనగాయని - పూర్ణోదయాకారిణి విజయే - జయంత్యపరాజితే - రక్తాంకుశే- సూర్యకోటి సంకాశే- చంద్రకోటి సుశీతలే.
3. అగ్నికోటి దహనశీలే- యమకోటి క్రూరే - ఓంకారనాదబిందురూపే- నిగమాగమ మార్గదాయిని - మహిషానురనిర్దళిని-ధూమ్రలోచనవధపరాయణే చండముండాది శిరచ్ఛేదిని- రక్తబీజాది రుధిరశోషిణి - రక్తపానప్రియే -మహాయోగిని - భూత బేతాళ భైరవాది తనువిధాయిని.
4. నిశుంభ శుంభ శిరచ్ఛేదిని - అఖిలసుఖదాయిని - త్రిదశరాజ్యదాయిని సర్వస్త్రీ రత్నరూపిణి దివే - దేహే -నిర్గుణే - సదసద్రూపధారిణి - సురవరదే -సహస్రారే - అయుతాక్షరే - సప్తకోటి చాముండారూపిణి - నవకోటి కాత్యాయిని - అనేకరూపే - లక్ష్యాలక్ష్యస్వరూపే.
5. ఇంద్రాణి - బ్రహ్మాణి - రుద్రాణి- ఈశాని - భీమే- భ్రామరి - నారసింహి త్రయస్త్రింశత్కోటి దేవతే - అనంతకోటి బ్రహ్మాండనాయికే - చతుర్ధశ శతలక్షముని జనసంస్తుతే - సప్తకోటి మంత్రరూపే మహాకాలరాత్రి ప్రకాశే- కలాకాష్ఠాదిరూపిణి చతుర్ధశభువనాభయకారిణి - గరుడగర్భిణి.
6. క్రౌంకార హౌంకార శ్రీంకార క్షౌంకార జూంకార సౌంకార- ఐంకార హ్రాంకార హ్రీంకార హౌంకార నానా బీజకూటనిర్మిత శరీరే - సకల సుందరి గణసేవిత చరణారవిందే - త్రిపురసుందరి - కామేశదయితే- కరుణారసకల్లోలిని - కల్పవృక్ష వనాంతస్థే - చింతామణి మందిరనివాసే- చాపిని- ఖడ్గని
7. చక్రిణి - గదిని- పద్మిని- నీలభైరవారాధితే - సమస్త యోగినీచక్రపరివృతే -కాలి - కంకాలి- తారే- తుతారే- సుతారే- జ్వాలాముఖి - ఛిన్నమస్తకే- భువనేశ్వరి - త్రిపురే- త్రిలోకజనని - విష్ణువక్షఃస్థలాంతఃకారిణి - అమితే- అమరాధిపే-అనుపమచరితే - గర్భభయాది దుఃఖాపహారిణి.
8.ముక్తిక్షేత్రాధిష్ఠాయిని - శివే - శాంతే - కుమారికే- దేవీసూక్తదశశతాక్షరే చండి - చాముండే - మహాకాలీ మహాలక్ష్మీ మహాసరస్వతీ - తిత్రయీవిగ్రహే ప్రసీద ప్రసీద – సర్వమనోరథాన్ పూరయపూరయ - సర్వారిష్ట విఘ్నాన్ ఛేదయ ఛేదయ- సర్వగ్రహపీడా జ్వరోగ్రభయం విధ్వంసయ విధ్వంసయ.
9. సర్వత్రిభువన జీవజాతం వశయ వశయ- మోక్షమార్గం ప్రదర్శయ ప్రదర్శయ అజ్ఞానమార్గం ప్రణాశయ ప్రణాశయ అజ్ఞానతమం నిరశయ నిరశయ-ధనధాన్యాది వృద్ధిం కురు కురు - సర్వకల్యాణాని కల్పయ కల్పయ మాం రక్ష రక్ష - సర్వాపద్భ్యో నిస్తారయ నిస్తారయ- మమ వజ్రశరీరం సాధయ సాధయ.
10. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే స్వాహా నమస్తే నమస్తే నమస్తే స్వాహా పరదేవ్యా ఇదం సూక్తం యః పఠేత్ ప్రయతోనరః, సర్వసిద్ధిమవాప్నోతి సర్వత్ర విజయీభవేత్.
🌹శ్రీ మాత్రే నమః 🌹
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 శ్రీ మాతృలింగం- (కరవీరపురం) భక్తులకు సంవత్సరంలో కేవలం ఐదు రోజులు (దేవీ నవరాత్రి1 ఒకరోజు, చైత్ర, శ్రావణ,మాఘ, కార్తీక మాస4 రోజులు) మాత్రమే దర్శనం 🌸🙏🌸
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #శమీ వృక్షం (జమ్మిచెట్టు) గొప్పతనం*
ముస్లింల ఆధీనంలో ఉన్న బహ్రేయిన్ దేశంలోని భయంకరమైన ఎడారిలో ఒక జమ్మి చెట్టు ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని చూడడానికి ప్రతీ ఏడాది దాదాపు 50 వేల మంది పర్యాటకులు వస్తున్నారు. దీని వయసు 400 ఏళ్ల పై మాటే. ఏ ప్రాణీ బ్రతికే అవకాశంలేని ఎడారిలో ఈ ఒక్క చెట్టే నిలిచి ఉంది. ఇది ప్రకృతిలోనే అరుదైన వింతల్లో ఒకటి. ఇది ఎలా నిలిచి ఉందో నేటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వారికి తెలిసిన విషయం ఒక్కటే షజరత్ అల్ హయత్ అని పిలిచే ఈ చెట్టు భూమిలో కిలోమీటర్ల కొద్దీ వేళ్లు పంపి నీరు సేకరిస్తోందని తేల్చారు. అంతేకాదు దీని ఆకులు వాతావరణంలో ఉండే కొద్ది పాటి తేమ కూడా సేకరిస్తుందని అంటున్నారు.
జమ్మి చెట్టు ఎంత దుర్భర పరిస్థితుల్లో అయినా జీవించగలదని చెప్పడానికి ఇదే సజీవతార్కాణంగా ఘోరమైన ఎడారిలో నిలిచింది.
జమ్మిచెట్టు హిందువులకే కాక మహ్మదీయులకు కూడా ప్రాణప్రదమైన చెట్టు. అరబ్బు ఎమిరేట్ల దేశానికి జమ్మిచెట్టు జాతీయ వృక్షం. రాజస్థాన్ రాష్ట్రవృక్షం కూడా జమ్మిచెట్టే.
ఆంధ్రవ్యాసుల వారిని ఒక సారి ఒకభక్తుడు జమ్మిచెట్టు గురించి ప్రశ్నించాడు. పాండవులు జమ్మిచెట్టు మీదే ఎందుకు ఆయుధాలు దాచారు? అనేక వృక్షాలు ఉన్నాయి కదా అని అడిగాడు.
దానికి వారు ఇచ్చిన సమాధానం ఇది.
జమ్మిచెట్టు వేదకాలం నాటి నుంచీ పరమ పూజ్యమైన వృక్షం. దీనికి ఉన్న ప్రాధాన్యత హిందూధర్మంలో మరో చెట్టుకులేదు. ఇందులో అగ్ని దాగి ఉందని సనాతనుల నమ్మకం. ఇది స్త్రీతత్త్వానికి చెందింది. రావి చెట్టు పురుషతత్త్వాని చెందిన అగ్నితత్త్వ వృక్షం. పూర్వం ఈ రెండింటినీ రాపాడించి అగ్నిని సృష్టించేవారు. వీటి పుల్లలు కూడా సమిధలుగా యజ్ఞయాగాది క్రతువులలో వాడేవారు.
రామాయణంలో కూడా శమీ వృక్షప్రస్తావన ఉంది. రాముడు కూడా అర్చించాడని కొందరు చెబుతుంటారు. పాండవులు దీన్ని ఆరాధించారనడంలో ఎటువంటి సందేహంలేదు. వీరులకు అతి ముఖ్యమైంది ప్రాణం కన్నా ఆయుధం. నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు. అలాగే నేలమీద కూడా పెట్టడు. దానికి అనేక కారణాలు ఉంటాయి. వీరుడి స్పర్శతగిలితే ఆయుధంలోకి చేతనత్వం ప్రవేశిస్తుంది. దాని వల్ల ఆ ఆయుధం మహాశక్తిమంతమవుతుంది. ఒక సారి ఆయుధాన్ని చేత పట్టాక దాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టరు. అలా పెడితే ఆయుధంలో చేరిన వీరుని శక్తి భూమి లాగేసుకుంటుంది. భూమికి ఆ విధమైన ఆకర్షణ శక్తి ఉంది. కనుకనే నేటికీ ఆధునిక సైనికులు కూడా నేల మీద ఆయుధాన్ని పెట్టరు. అంతేకాదు నేల వైపు ఆయుధాన్ని చూపరు కూడా. కేవలం మహామహులు చనిపోయినప్పుడు మాత్రమే ఆయుధాన్ని నేలవైపు చూపుతారు అంతే.
ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళే టప్పుడు తమ ఆయుధాలు ఎక్కడ ఉంచాలి అనే సంశయం కలిగింది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే వాటి కారణంగా తాము దొరికిపోయే అవకాశం ఉంది. అందులోనూ అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడి ఆయుధాలు దైవదత్తాలు. అవి చూడగానే ఇట్టే అవి భూమి మీద తయారైనవి కాదని తెలిసిపోయే అవకాశం ఉంది. కనుక తప్పని సరి పరిస్థితుల్లో వీటిని ఎక్కడైనా దాచాలి. ఎక్కడ దాచాలి అనేది ప్రశ్న వచ్చింది.
దీనికి అర్జునుడు ముందుగా సర్వేచేసి ఒక శ్మశానాన్ని నిర్ణయిస్తాడు. దాని పక్కనే ఉన్న అతిపెద్దశాఖలు ఉన్న జమ్మిచెట్టు ఎంచుకుంటాడు. దైవదత్తమైన ఆయుధాలు మోయాలంటే అది దైవవృక్షమే అవ్వాలి. కనుక దాన్ని ఎంచుకుంటాడు.
నిజానికి అర్జునుడు కూడా గాండీవాన్ని ఎత్తలేడు. కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల దాన్ని ప్రయోగించగలుగుతాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన వెంటనే అర్జునుడు గాండీవాన్ని ప్రయోగించి బాణాలు వేయలేక కిరాకులతో గాండీవంతో కర్రసాము చేస్తూ యుద్దం చేయబోతాడు. వారు అర్జునుడ్ని చిన్నపిల్లాడిని గెలిచినట్టు గెలిచి యాదవ కాంతల్ని ఎత్తుకుపోతారు. కనుక అంత మహిమ ఉన్న ఆయుధాలు మోయాలంటే తప్పనిసరిగా అది దివ్యవృక్షమే అయిఉండాలి.
సరే ఇక్కడ మరో ప్రశ్న రావాలి. చెట్టుమీదే ఎందుకు పెట్టాలి? దీనికి కారణం ముందే చెప్పుకున్నాము. భూమి మీద ఆయుధాలు ఉంచరాదు. అంతేకాదు. అరణ్యంలో భూమి మీద ఆయుధాలు ఉంచితే పందులు పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటకు తీసే ప్రమాదం ఉంది. వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచవచ్చు. కనుక భూమి మీద పెట్టలేరు, భూమి లోపలా పెట్టలేరు. కనుకనే చెట్టుపై పెట్టాల్సివచ్చింది.
ఒక జమ్మిచెట్టులో అగ్ని తత్త్వం ఉండడం వలన దానికి ఆయుధాలలోని అగ్నితత్త్వానికీ మిత్రత్త్త్వం కుదురుతుంది. జమ్మికి ఉన్న మరో ముఖ్య లక్షణం అది ఏ వాతావరణంలో అయినా తన పచ్చదనం కోల్పోదు. మిగిలిన చెట్లు అలా కాదు. వాతావరణ ప్రభావానికి త్వరగా లోనై మోడు కావడం జరుగుతుంది.
మరో ముఖ్యవిషయం ఏమిటంటే జమ్మిచెట్టు దాదాపుగా అడవుల్లో చాలా ఎత్తుగా ఉంటాయి. వాటిని ఎక్కడానికి వీలు లేకుండా ఉంటాయి. ఇది కేవలం జంతు, వృక్షశాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు. ఎందుకంటే జమ్మి చెట్టును తినని శాకాహార జంతువు చాలా అరుదు. గడ్డితినే అన్ని జంతువులు జమ్మిని తింటాయి. కనుక జమ్మిని ఏ జంతువుకా జంతువు అందినంత తినేస్తే ఎవరికీ అందనంత ఎత్తున అది పెరుగుతుంది. అంటే ఒంటెలూ జిరాఫీలు వంటివి కూడా తినేయగా వాటికి కూడా అందనంత ఎత్తుగా మాను పెరుగి అక్కడ నుంచీ పెరిగిన కొమ్మలే చెట్టుకు నిలుస్తాయి. అదే మాట అర్జునుడు కూడా అంటాడు. తాను చూసిన జమ్మిచెట్టు మానవులు, జంతువులు ఎక్కడానికి అతికష్టమైనది అని దానికి ఉన్న మరో లక్షణం చెబుతాడు (భీమశాఖా దురారోహా శ్మశానస్య సమీపతః).
ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే అది అందరికీ పూజనీయమైన చెట్టే అయినా శ్మశానం పక్కనే ఉంది కనుక ఎక్కువ మంది తరచూ పూజించరు. బ్రతికి ఉన్నవాడు శ్మశానానికి వెళ్ళడానికి ఇష్టపడడు. చచ్చినవాడు చేటు చేసే అవకాశం లేదు. ఇదికాక పల్లెకార్ల మనస్తత్త్వం అర్జునుడు చాలా బాగా పట్టాడు. నేటికీ వేపమొక్కలు పెరిగే దశలో ఉన్నప్పుడు దానికి ఒక చెప్పు వేళ్ళాడు దీస్తారు. చెప్పు అవమానకరమైంది. బుద్దిఉన్న వాడు ఎవడూ ఒకడి కాలి చెప్పు వేళ్ళాడుతున్న చెట్టు కొమ్మ విరిచి నోట్లో పెట్టుకోడు. నేటికీ నిలిచి ఉన్న ఇటువంటి పౌరుషాన్ని అర్జునుడు ఆనాడు వాడాడు.
ఆయుధాలు అన్నీ ఒక శవం ఆకారంలో మూటగట్టి చెట్టుపై పెట్టించాడు. మూటలోకి నీటి చుక్క కూడా జారకుండా కట్టారు. ఎప్పుడైతే చెట్టు మీద శవం ఉందో ఆ చెట్టును ఎవరూ నరికే అవకాశంలేదు. అందులోనూ దానికి శవం నుంచీ వచ్చే వాసనలు వెదజల్లే ఏర్పాటు కూడా చేశారు. ఇది చాలదన్నట్లు అది తమ తల్లి శవం అనీ తమ ఆచారం ప్రకారం శవాన్ని చెట్టుమీద ఉంచాలని ప్రచారం చేశారు.
(ఆబద్ధం శవమత్రేతి గంధమాఘ్రాయ పూతికం |,
అశీతిశతవర్షేయం మాతా న ఇతి వాదినః |
కులధర్మోఽయమస్మాకం పూర్వైరాచరితోఽపి చ)
పూర్వం ప్రాణం ఉన్న మనిషికి ఇచ్చిన గౌరవం చనిపోయిన శవానికి కూడా ఇచ్చేవారు. కనుక ఎవరూ శవం ఉన్న చెట్టు మీద అనుమానం వచ్చే అవకాశం లేదు. పైగా అది జనులు తిరిగేది కాదు. వారికి కనపడే విధంగా లేదు. చాలా మరుగు ప్రదేశంలో ఉంది. అటువంటి చెట్టు మీద దివ్యమైన ఆయుధాలు ఏడాదిపాటు భరించే శక్తి ఉండి, విరిగిపోని కొమ్మల మీద నకులుడు చెట్టు ఎక్కి, ఆయుధాలు పెట్టి కట్టి వచ్చాడు
(తాముపారుహ్య నకులో ధనూంషి నిదధత్స్వయం,
యత్ర చాపశ్యత స వై తిరో వర్షాణి వర్షతి |
తత్ర తాని దృఢైః పాశైః సుగాఢం పర్యబంధత).
జమ్మిచెట్టే ఎంచుకోవడానికి మరో కారణం ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు. అది ప్రకృతి సహజంగా మరణించిన తరువాతే కలప సేకరిస్తారు. మరో విచిత్రమైన అంశంమేమంటే అది పొలం మధ్యలో పుట్టినా దాన్ని కదల్చరు. అలాగే పెరగనిస్తారు. నేటికీ ఆచరించే మరో విశేషం ఏమిటంటే జమ్మి కలప ఉపయోగించి మంచం తయారు చేసి దానిమీద శయనించరు.
అంతగా దాన్ని ఆరాధిస్తారు.
✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀
#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 #తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో శ్రీ భద్రకాళి అమ్మవారు 🙏🙏💐🙏🙏