నారా లోకేష్ జన్మదినం సందర్భంగా TDP ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో కోసిగిలో భారీ ఎత్తున రక్తదానం కార్యక్రమం విజయవంతం #🤔స్టార్టప్ ఐడియాస్💡
@ #😇My Status పారిశుద్ధ్య కార్మికురాలికి రెండు చేతులెత్తి దండాలు పెట్టిన తక్కువనే.
@కర్నూలు జిల్లా కోసిగి శ్రీ రేణుక ఎల్లమాంబ రథోత్సవం తేదీ 7.2.2026. అందరూ ఆహ్వానితులే..#తాజా వార్తలు
విజయశాంతి గారు నటించిన “ఒసేయ్ రాములమ్మ” సినిమాలో తారాగణం అప్పుడు-ఇప్పుడు, లైక్ చేసి షేర్ చెయ్యండి ❤️👍 #😇My Status
పండగ అయిపోయింది. వలసల బళ్ళు కదిలాయి. గ్రామాలన్ని బోసిపోయాయి. ప్రజలు లేక గ్రామాల్లో వీధులన్నీ కళావిహీనంగా మారాయి, ఎన్ని ప్రభుత్వాలు మారినా వలస కూలీల జీవితాలు మాత్రం మారడం లేదు. పొట్టకూటి కోసం చదువుకునే చిన్న పిల్లల్ని సైతం చెంతపెట్టుకుని అన్నమో రామచంద్ర అంటూ వలస బాట పట్టారు....వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కోసిగి ,కౌతాళం, మండలాల నుండి వందగల్లు, కరిని గ్రామాల నుండి, సంక్రాంతి పండగను ముగించుకుని, సోమవారం బులోరా వాహనాల్లో దూర ప్రాంతాలకు కర్ణాటక, గుంటూరు, దోర్నాలకు 70 కుటుంబాల మేరకు మరియు 5,6,7, తరగతులు చదువుకునే తమ పిల్లలను సైతం చెంతపెట్టుకుని, సుదీర్ఘ ప్రాంతాలకు అన్నమో రామచంద్ర అంటూ అక్కడ ప్రాంతాల్లో పొలంలో మిరపకాయలను తెంచేందుకు వలస బాట పట్టారు. వలస కూలీలు మాట్లాడుతూ వర్షాకాలం మాకు ఉన్న ఎకరా అరెకరం భూముల్లో పంటలు పండించుకున్నామన్నారు. మా ప్రాంతాల్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు, పక్కనే తుంగభద్ర నది నిండుగా ప్రవహిస్తూ , మా ప్రాంతం నుండి నీరు వృధాగా దిగువకు వెళ్ళిపోతుందన్నారు, పక్కనే పులికనుమ ప్రాజెక్టు ఉన్నప్పటికీ మా ప్రాంత రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.అయితే ఎల్ ఎల్ సి కాలువలు నీరును బంద్ చేయడం వల్ల.గ్రామాల్లో చేసేందుకు పనులు లేక రోజువారి జీవనం గడవక బతకడానికి కోసం వలసలు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా వలస కూలీల జీవితాలు మాత్రం మారడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం, నిత్యం వలసలకు నిలయం అయినటువంటి కోసిగి,కౌతాళం, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాలను గుర్తించి. వలసలు నివారించేందుకు ఉపాధి పనులను గ్రామాల్లో బలంగా కల్పించాలన్నారు. పరిశ్రమాలు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. #తాజా వార్తలు





