@bjp4andhra
@bjp4andhra

BJP Andhra Pradesh

Official ShareChat Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.

04:25 / 8.9 MB
గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రాహుల్ గాంధీ చేసిన విమర్శలను స్వీకరించి వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రధాని తెలిపారు.ముద్రా యోజన పథకం ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపామని, ముద్రా పథకం లబ్ధిదారుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని ప్రధాని సభలో వివరించారు.70 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయిందని, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టిన ఐదేళ్లలో అనేక కీలక సమస్యలకు పరిష్కారం చూపించిందని మోదీ గారు సమాధానం ఇచ్చారు.పెట్టుబడిదారులకు భరోసా కల్పించి, ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు అనేక చర్యలు చేపట్టామని, సాధ్యమైనన్ని ఉద్యోగాల సృష్టి, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని ప్రధాని పేర్కొన్నారు.కార్మికుల శ్రేయస్సు కోసం నూతన సంస్కరణలు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. #narendra modi
07:28 / 15.9 MB
ఆర్టికల్ 370 రద్దును ఉద్దేశించి జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తి, ఒమర్​ అబ్దుల్లాలను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు విమర్శించారు.1990 జనవరి 19న కశ్మీర్​ ఉనికి కోల్పోయిందని, ఉగ్రవాద చర్యలు, కశ్మీరీ పండితుల బహిష్కరణతో కశ్మీర్ ఉనికి కోల్పోయిందని ప్రధాని అన్నారు.కశ్మీరీ పండిట్లు ఉనికిని కోల్పోయిన రోజును చీకటి రాత్రిగా అభివర్ణించారు.జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు.తొలిసారి అక్కడ ఏసీబీని ఏర్పాటు చేసినట్టు, ఆర్టికల్​ 370 రద్దుతో జమ్ముకశ్మీర్​లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్రధాని పేర్కొన్నారు.జమ్ముకశ్మీర్​ ప్రజలు తొలిసారి రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనం పొందుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని, స్థిరాస్థి అభివృద్ధి చట్టం అమల్లోకి వచ్చిందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.వాణిజ్య , అంకుర సంస్థల స్థాపనతో జమ్ముకశ్మీర్​ ప్రగతి పథంలో నడుస్తోందని మోదీ పేర్కొన్నారు.దేశ ప్రజలందరి సమక్షంలో ఎంపీలంతా ఓటింగ్​లో పాల్గొన్నారని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ కు ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నామని అన్నారు. #narendra modi
03:10 / 6.3 MB
రాజ్యాంగ పరిరక్షణ అంటూ పదే పదే గోల చేస్తున్నవారికోసం చెప్పదలచుకున్న మాట, వారికి వందసార్లు చెప్పాల్సిన విషయం రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పాలి.ఎందుకంటే, 1975 లో ఎమర్జెన్సీ తీసుకొచ్చినపుడు వీరికి రాజ్యాంగం గుర్తుకురాలేదు! న్యాయ వ్యవస్థ ని తొక్కేయాలని చూసి, అణచివేస్తూ వారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు రాజ్యాంగం గుర్తుకురాలేదు వాళ్లకు.! అత్యధికంగా రాజ్యాంగాన్ని సవరించింది ఎవరో తెలియదు వాళ్లకు..! ఆర్టికల్ 356 ను ఎక్కువగా విధించింది ఎవరో తెలియదు వాళ్లకు!! ప్రజాస్వామ్యం లో ఎన్నుకోబడ్డ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన చట్టాల్ని, మీడియా ముందు చించివేస్తున్నపుడు రాజ్యాంగం గురించి తెలియదు వాళ్లకు.! ప్రధానమంత్రిని, ప్రధానమంత్రి కార్యాలయాన్ని రిమోట్ కంట్రోల్ తో నడిపించిన వారికి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని తెలియదు.! అందుకే.. రాజ్యాంగ పరిరక్షించాలని వారికి వందసార్లు చెప్పాలి.. అది వారికి మంత్రం కావాలి అంటూ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ వారికి సమాధానం ఇచ్చిన మోదీజీ #narendra modi
00:36 / 1.4 MB
Thank you Prime Minister Modi for announcing the creation of Sri Ram Janma Bhumi Tirtha Kshetra Trust, which will pave the way for construction of a grand Ram Mandir in Ayodhya, the birth place of Lord Ram, a dream that millions of Hindus around the world have had for millennia.. #jai shri ram
00:44 / 1.4 MB
500 ఏళ్ల భారతీయుల కలను శ్రీ నరేంద్ర మోదీ గారి సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ నెరవేర్చబోతోంది. కోట్లాది మంది భారతీయులు ఆరాధ్య దైవం అయిన శ్రీ రాముడి జన్మస్థలంలో రామ మందిర నిర్మాణానికి " రామజన్మభూమి తీర్థ క్షేత్ర" ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు లోక్సభలో ప్రకటించారు.భారతీయుల ఆకాంక్షను నెరవేర్చేందుకు, శ్రీ రామ మందిర నిర్మాణ పునరుద్ధరణకు, రామమందిర నిర్మాణానికి సమిష్టిగా సమర్దిస్తున్నట్లు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రకటించారు.సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అయోధ్యలో రామమందిర నిర్మాణ విషయంలో ట్రస్టు స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ప్రధాని తెలిపారు.రామ మందిర నిర్మాణానికి 67 ఎకరాల ప్రభుత్వ భూమిని ట్రస్టుకు అప్పగిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల భూమిని అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని మోదీ గారు తెలిపారు. #jai shri ram
00:44 / 2.6 MB

00:36 / 1.3 MB
నేడు "రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర" ఏర్పాటు చేస్తున్న చారిత్రక సందర్భంగా అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం గౌరవ సభ్యులు మీ మద్దతును తెలుపండి...జై శ్రీరామ్ 🙏 #Jai Shri Ram