Kappati Panduranga Reddy
@kappati152
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే క్రిష్ణ.హరే క
*బతుకమ్మ పండగ ప్రారంభం సందర్భంగా అందరికి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు 💐💐💐*
ఒప్పుకున్న ఒప్పుకోక పోయినా బతుకమ్మ అనగానే గుర్తుకు వచ్చేది ఎవరు ? ముమ్మాటికీ *తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ గారే !* తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మకు విశేషమైన ప్రాచుర్యాన్ని తెచ్చిండ్రు ! తెలంగాణ ఓ చారిత్రక నేపద్యాన్ని ఒక్క సారి గుర్తు చేసుకుందాం.. ! శాతవాహనుల తొలి రాజధాని కరీంనగర్ జిల్లా లోని కోటిలింగాల బదులుగా గుంటూరు జిల్లాలోని ఓ ప్రాంతంగా విధ్యార్థులు పుస్తకాల్లో చదివే వాళ్ళు ! పోతన ఎక్కడి వాడంటే వరంగల్ ప్రాంతం కాదు కడప ప్రాంతం అని చెప్పబడేది ! ప్రపంచం లో 150 కోటలతో ఘన చరిత్ర కలిగిన తెలంగాణ పదమే నిషిద్దం అయ్యింది ! తెలుగు సాహిత్యం లో జినవల్లభుడు రాసిన తొలి కంద పద్యం వెలసిన బొమ్మలమ్మ గుట్ట ఊసే లేకుండా పోయింది ! విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించినంత బలంగా రామగుండం ఎరువు తెలంగాణ పరువు అనే నినాదం అక్షర రూపం దాల్చలేకపోయింది ! రెండు జిల్లాల్లో జరుపుకొనే అట్లతద్దె గురించి అచ్చు వేసిండ్రు కాని ప్రపంచం లోనే మహిళలు అతి పెద్దగా జరుపుకొనే బతుకమ్మ గురించి పట్టించుకోలేదు ! అగో సరిగ్గ ఆ బతుకమ్మ అంశాన్నే ఆలంబనగా చేసుకున్న నాయకురాలు కవితమ్మ గారు బయలుదేరింది ! బతుకమ్మకు ప్రాచూర్యాన్ని కలిపించాలని సకల్పించింది ! అందరి సంస్కృతి ఎలుగెత్తబడ్డప్పుడు తన సంస్కృతి ఎందుకు విశ్వ వ్యాప్తం కాకూడదు అనుకొంది ! కొద్ది మంది మహిళలను పోగు చేసి బతుకమ్మ ఆడింది ! పది , ఇరవై , వంద అలా అలా వేలాది మహిళలు ఒక్క చోట చేరిన పూల జాతరను ప్రపంచం వీక్షించింది ! కాదు అలా వీక్షించేలా చేసింది ! తన ప్రాంతం సాంస్కృతికోద్యమ సారధిగా ముందు నడచింది ! అనుకూలం , వ్యతిరేఖం ఏది అయితేనేమి అందరి నోట బతుకమ్మ అనిపింపించింది ! ఇక బతుకమ్మను అచ్చువేయక పేపర్లకు తప్పేది కాదు ! తొమ్మిది రోజుల పాటు టివిలు చర్చకు పెట్టే అనివార్య పరిస్థితులు కల్పించబడ్డాయి ! ఎవరెన్ని విమర్శలు చేసినా తన కృషి మూలంగా బతుకమ్మ పాఠ్య పుస్తకం లో ఓ పాఠ్యాంశం అయ్యింది ! మరుగున పడ్డ కళలు సాంకృతిక అంశాలు అక్షర రూపం దాల్చాయి ! ఎట్టకేలకు కోట్లాది గిరిజనుల పండుగ అయిన సమ్మక్క సారక్క చరిత్ర పుస్తకం లో అచ్చయ్యింది ! బౌద్దం అంటే అమరావతి అనుకొనే పరిస్థితి నుండి వెయ్యేండ్ల చరిత్ర గలిగిన దూళికట్ట వెలుగులోకి వచ్చింది ! తెలుగుకు ప్రాచీన హోదాకు కావలసిన ఆధారాల కొరకు ఆంధ్రాలో వెతికే ఆర్కియాలజీ శాఖ తెలంగాణ గడ్డను తవ్వింది ! మన గడ్డలోనే అసలైన మూలాలు ఉన్నయని కేంద్రమూ అంగీకరించింది ! తన కార్యదక్షత తో తెలంగాణ చారిత్రక , సాంకృతికాంశాల కు ప్రత్యక్షంగా , పరోక్షంగా పునరుజ్జీవం పోసిండ్రు కవితమ్మ గారు!
తమ విశ్వసనీయ
*కప్పాటి పాండురంగా రెడ్డి*
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణజాగృతి
#బతుకమ్మ శుభాకాంక్షలు
*పెద్దల అమావాస్య.....*
*మహాలయం అంటే గొప్ప వినాశనం లేదా మరణం అని అర్థం. మహాలయం అంటే గొప్పగా లయం కావడం. భాద్రపద మాసం కృష్ణపక్ష అమావాస్యకు "మహాలయ అమావాస్య" అని పేరు. దీనినే వాడుకలో పెద్దల అమావాస్య అని కూడా అంటారు. పితృదేవతల పూజలకు కేటాయించిన ఉత్కృష్టమైన రోజు కనుకనే ఆ పేరు వచ్చింది.*
*భాద్రపద మాసంలోని కృష్ణ పక్షాన్ని మహాలయ పక్షం అని, ఆ పక్షంలోని చివరి రోజు కనుక మహాలయ అమావాస్య అని చెప్పారు. మహాలయ పక్షానికి పితృపక్షమని పేరు. పితృదేవతలను శోభన దేవతలు అని కూడా అంటారు. వీరు ఎప్పుడూ శుభం కలగాలని ఆశీర్వదిస్తుంటారు. అటువంటి పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులు నిర్వహించడం, పిండప్రదానాలు చేయడం, వంటి పితృపూజలు ఆచరించే పక్షం కనుక "పితృపక్షం" అనే పేరు వచ్చింది. అయితే ఈ కాలం చెడు కాలం అని శుభకార్యాలకు పనికి రాదని శాస్త్ర వచనం. పితృదేవతలకు శ్రాద్ధ విధులు మహాలయ* *పక్షంలోను. మహాలయ అమావాస్యనాడు నిర్వహించడం. వెనుకు కథ ఒకటి ప్రచారంలో ఉంది.*
*పూర్వం దేవదానవుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం భాద్రపద కృష్ణ పక్ష పాడ్యమినాడు మొదలై అమావాస్య వరకూ పదిహేను రోజులు జరిగింది. యుద్ధంలో దేవతల బలం క్షీణించింది. రాక్షసులు విజృంభించారు. యుద్ధంలో అనేకమంది మహర్తులు, మునులు, యతులు మృతిచెందారు. ఆయా వీరులు మృతి చెందిన రోజులకు యతిమహాలయం, శస్త్రహతమహాలయం అని పేర్లు ఏర్పడ్డాయి. అమావాస్య నాటికి దేవతలందరూ పూర్తిగా ఓడిపోయి అమరావతికి వెనుదిరిగారు. ఈ పక్షం రోజుల్లో ఎవరెవరు చనిపోయిన తిథి రోజు వారికి శ్రాద్ధ విధులు నిర్వహించడంతోపాటు అందరికీ అమావాస్యనాడు. శ్రాద్ధ విధులు నిర్వహించారు. అప్పటినుండి మహాలయ పక్షంలోనూ, మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన మొదలైంది.*
*కన్య, తులా రాశుల్లో సూర్య భగవానుడు ఉన్న సమయంలో ప్రేతపురి శూన్యంగా ఉంటుంది. ఈ సమయంలో పితృదేవతలందరూ అన్నాన్ని కోరుతూ తమ ఇండ్ల చుట్టూ తిరుగూ ఉంటారని భారతంలో చెప్పారు. కనుక అన్నం కోరి ఇంటి చుట్టూ తిరిగే పితృదేవతల ఆత్మలను సంతృప్తి పరచడం కోసం శ్రాద్ధవిధులు ఆచరించడం, పిండప్రదానాలు చేయడం, తర్పణాలు వదలడంలాంటి కర్మలు ఆచరించాలని శాస్త్రం చెపుతోంది. ఈ సమయంలో పిండప్రదానాలు చేయకపోతే మహాలయ అమావాస్య వరకూ వేచి చూసిన పితృదేవతలు అసంతృప్తితో శపించి ప్రేతపురికి వెళ్లిపోతారని చెప్పారు.*
*మహాలయ పక్షం "దినేదినే గయాతుల్యం" అని చెప్పారు. మహాలయ పక్షంలో మరణించిన తల్లి దండ్రులు, తాత ముత్తాతలు పూర్వీకులకు శ్రాద్ధవిధులు ప్రతిరోజూ నిర్వహించాలి. ఒకవేళ ప్రతిరోజూ వీలు కానిచో తిథినాడు నిర్వహించాలి. తల్లి మరణించి తండ్రి జీవించి ఉంటే నవమినాడు తర్పణ శ్రాద్ధవిధులు నిర్వహించాలి. లేదా అమావాస్యనాడు విధిగా నిర్వహించాలి.*
*మహాలయ అమావాస్యనాడు శ్రాద్ధవిధులు నిర్వహించడం వల్ల త్రివేణీ సంగమలోను. గయలోను శ్రాద్ధవిధులు నిర్వహించిన ఫలితం కలుగుతుంది. మహాలయ పక్షంలోని అన్ని రోజులు కానీ, లేదా ఒక్క రోజుకాని, లేదా మహాలయ అమావాస్య నాడు కానీ పితృదేవతలను ఆరాధిస్తే వారు ఒక ఏడాది పాటు సంతృప్తులవుతారు అని స్కాందపురాణంలో పేర్కొన్నారు. పితృదేవతలు సంతృప్తి చెందితే వంశాభివృద్ధి కలుగుతుంది.*
*┈┉┅━❀꧁పిత్రుదేవా꧂❀━┅┉┈*
🍁🌺🍁 🙏🕉️🙏 🍁🌺🍁
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)

మహలయా అమావాస్య రోజున మీ కుటుంబ సభ్యులందరూ ఈ సంకల్పం చెప్పుకుంటే మంచిది.*
➖➖➖✍️
మీ గోత్రం...
మీ పేరు చెప్పుకొని...
నా జన్మకు మూల కారణమైన నా తల్లి -దండ్రులకు నా యొక్క అనంతకోటి నమస్కారములు. అలాగే నా తల్లి - దండ్రులకు మూలమైన తాతలకు, ముత్తాతలకు అనంత కోటి ప్రణామములు.
సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకూ ఈ వంశ పరంపరల్లో జన్మించిన పూర్వీకులైన వారందరికీ అనంతకోటి నమస్కారములు.
ఎందరో యోగులు, మహాత్ములు, పుణ్యాత్ములైన మీ అందరి యొక్క సంస్కార బలం నాలో ప్రవేశించి, నేను ఇంతటి గొప్ప జ్ఞానంతో కూడిన జీవితాన్ని పొందియున్నాను.
ఈ వంశంలో జన్మించినందుకు నేను ఎంతగానో గర్వించు చున్నాను.
మీలో ఉన్న సద్భావాలు నాలో ప్రవేశించి లోక హిత కార్యాలు చేసేటటువంటి శక్తిని ప్రసాదించండి.
ఈ వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు
ఆ చంద్రార్కము అవనిలో విలసిల్లునట్లుగా ఆశీర్వదించండి.
నాలోనూ, నా కుటుంబ సభ్యుల లందరిలోనూ ఉన్నటువంటి దోషాలను తొలగించి, క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుః, ఆరోగ్య, ఐశ్వర్య ముల నొసగి, ధర్మార్ద, కామ, మోక్ష ముల నొసగి, అహం పదార్ద రహిత స్థితి కలిగేటట్లుగా దీవించి
నా జన్మ ధన్యత చేకూర్చగలరని కోరుతూ..
అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, త్రిమూర్తులు, త్రిమాతలు, అష్ట దిక్పాలకులు,
నవ గ్రహాలు, సమస్త సద్గురువులు మరియు సమస్త దేవతా మూర్తుల యొక్క ఆశీస్సులను కోరుతూ నా యొక్క అనంత కోటి నమస్కారములు సమర్పించుచూ మనసా, వాచా, కర్మణా, త్రికరణ శుద్ధిగా ..
ఈ మహాలయ అమావాస్య రోజున సంకల్పం చేసి పెద్దలందరికీ నమస్కరించు చున్నాను.🙏```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)
*
*🌤️శుభ శుభోదయం🙏*
*📖పుస్తకం* తీసినప్పుడు అన్నీ వచ్చినట్లే అనిపిస్తాయి కానీ పరీక్ష రాస్తున్నప్పుడు తెలుస్తుంది మనకెంత వచ్చో. అలాగే అంతా బాగున్నప్పుడు మనంత బలవంతుడు లేడు అనిపిస్తుంది కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మనం బలం ఏమిటో.
ఒక మంచి పుస్తకం ఎలా అర్థంకాదో ఒక మంచి మనిషి కూడా అలాగే అర్థంకాడు. ఏదైనా లోతుగా చదవాల్సిందే అర్థం చేసుకోవాల్సిందే.
నీతులు నీడని ఇవ్వకపోవచ్చు కానీ నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి. సామెతలు సంపదని ఇవ్వకపోవచ్చు కానీ ఆలోచనలు జోడిస్తాయి. కొటేషన్లు కోరికలు తీర్చకపోవచ్చు కానీ కొత్త అర్ధాన్ని చెబుతాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి.
తమ విశ్వసనీయ
కప్పాటి పాండురంగా రెడ్డి
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #శుభో దయం🌄
#🌅శుభోదయం
*నైమిశారణ్యం*
నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో ఉంది. గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం.
నైమిశారణ్యం వైష్ణవ దివ్యదేశాల లో ఒకటి. ఇక్కడ వనరూపిగా నున్న స్వామికే ఆరాధనము. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరుమాళ్ళు గాని ఇక్కడ లేవు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నుంచి నైమిశారణ్యానికి దాదాపు 100 కి.మీ. దూరం ఉంటుంది.ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలమేదని ప్రశ్నింపగా బ్రహ్మ దర్భతో నొక వలయము చేసి భూమిపై విడచి ఇది పడిన చోట తపస్సు చేయదగిన స్థలమని చెప్పెనట. అది పడిన చోటే నైమిశారణ్యము. ఇచట గోమతీ నది ప్రవహించుచున్నది. ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు. ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణములు వినిపించెను.
ఈ అరణ్యంలో దాదాపు 84 వేలమంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారతగాథను మొదట తన కుమారుడు శుకమహర్షికి ఇక్కడే చెప్పాడు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వైశంపాయనుడు చెప్పిన కథను సూతుడు మరోసారి శౌనకాది మునులందరికీ ఇక్కడే చెప్పాడు. సత్యనారాయణ వ్రతవిధానాన్ని కూడా మొదట నైమిశారణ్యంలోనే సూతమహాముని శౌనికాదులకు వివరించాడు. ఇలా ఎంతో ప్రాధాన్యముంది ఈ అరణ్యానికి. ఇక్కడ వ్యాసమహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతోపాటు కొన్ని దేవాలయాలూ ఉన్నాయి.ఇది ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో ఉంది.
ప్రయాణం విధానం
నైమిశారణ్యం వెళ్ళడానికి హైదరాబాదునుండి గోరఖ్పూర్ వెళ్ళే రైలులో కానీ లేదా విమానయానం ద్వారాగానీ లక్నౌ చేరుకొని అక్కడనుంచు రోడ్డు మార్గం గుండా నైమిశారణ్యం చేరుకోవచ్చు (అక్కడ నైమిశారణ్యాన్ని నీమ్సార్ అని కూడా పిలుస్తారు) దాదాపు 2గంటలు రోడ్డు ప్రయాణం. సీతాపూర్-కాన్పూర్ లేదా బాలమౌ-సీతాపూర్ పాసింజరులోకానీ లక్నౌనుండి నైమిశారణ్యం చేరుకోవచ్చు.నైమిశారణ్యం ప్రవేశిస్తూంటేనే గొప్ప అనుభూతి కలుగుతుంది. అక్కడ ఎన్నో ఆశ్రమాలు, గుళ్ళు, వసతి సముదాయాలు ఉన్నాయి. భద్రకాళి మందిరం, బాలాజీ మందిరం, సాయి మందిరం లాంటి పెద్ద పెద్ద వసతి సముదాయాలున్నాయి అక్కడ గదిగి రూ400 నుంచి రూ800 వందల వరకూ ఉన్నాయి. పైన చెప్పిన వాటిలోనే కాక ఇతరమైన ఇంకా కొన్ని వసతి సముదాయాలున్నాయి. A/Cరూములు కూడా అక్కడక్కడా లభ్యమౌతాయి. సాయి మందిరం వంటి వసతి గృహాలలో భోజన సదుపాయం కూడా ఉన్నట్టుంది.(తెలుగువాళ్ళుంటారక్కడ). భోజన సదుపాయాలకి ముందుగానే ఏర్పాటుచేసుకోవాలి, సాయంత్రం 7 దాటితే దాదాపు అన్ని దుకాణాలు మూసేస్తారు. రోడ్డుపక్కన ఉండే చిన్న స్వీటు కొట్లలో పూరీలు/చపాతీలు బంగాళాదుంప బఠానీల కూర లభ్యమవుతాయి, పెరుగు కోవా స్వీట్లు లభ్యమవుతాయి. కొంత మంది గుంపుగా వంట ఏర్పాట్లతో వెళ్ళగలిగితే వండుకోవడానికి అక్కడ తాజా కూరలూ, పాలూ, పెరుగూ లభ్యమవుతాయి.నైమిశారణ్యం ఇతరమైన కొన్ని ప్రదేశాలలాగా ఏదో తిరిగి నాలుగు గుళ్ళు చూసి తిరిగొద్దాం అనుక్కున్నట్లుండదు. ఒక పూట, ఒకరోజులో చూసి వద్దాం అని వెళ్ళే యాత్రా బస్సుల వారు కూడా కనీసంలో కనీసం మూడురోజులు నైమిశారణ్యంలో ఉండేటట్టుంటే బాగుంటుంది.నైమిశారణ్య ప్రవేశం సమస్త పాతక నాశనం అని కూర్మపురాణం. నైమిశారణ్య క్షేత్రం గురించి చెప్పాలంటే సూక్ష్మంగా (పూజ్య గురువులు తమ ప్రవచనంలో వివరంగా చెప్పారు) కలియొక్క ప్రభావం లేని ప్రదేశంకోసం మునులు, తాపసులు బ్రహ్మగారిని ప్రార్థించగా దర్భలతోచేసిన చక్రాన్ని బ్రహ్మగారు వదిలారు ఆ చక్రం అంతటా తిరుగుతూ వచ్చి ఈ అరణ్య ప్రాంతంలో తిరుగుతూ ఉండగా దానికున్న నిమి ఊడి చక్రం పడిపోయింది అందువలన ఇది నిమి పడిన క్షేత్రం కాబట్టి నైమిశారణ్యం అయ్యింది. అంటే పుట్టడం-మరణం-పుట్టడం-మరణం-పుట్టడం అనే చక్రం ఆగి పునరావృత్తి రహిత శాశ్వత మోక్ష సిద్ధి కలగడానికి ఈ జనన మరణ ఆవృత్తి ఆగిపోవాలంటే సంసారమనే నిమి పడిపోయే ప్రదేశమే నైమిశారణ్యం. నైమిశారణ్యంలో ప్రవేశించిన సాధకులకు భగవత్కృప వలన, సద్గురు వచనం శాస్త్ర వచనం ఆకళింపు చేసుకున్నంత సంసారంలో ఉన్నా సంసారం అంటనివ్వని ప్రదేశమే నైమిశారణ్యం.
అప్పట్నుంచీ ఇక్కడ ఎన్నో వేల మంది ఋషులు, తాపసులు, వారి శిష్యగణాలతో వసించి తపస్యాదులు చేసుకొన్న క్షేత్రం గొప్ప తపోభూమి. మనోలయం తొందరగా కాగలిగిన క్షేత్రం. అందుచేతనే ఇక్కడ కొన్ని రోజులుండి అతి ప్రాచీన దేవాలయాలు ఎన్నో ఏళ్ళనుంచీ తాపసులు తపస్సు చేస్తున్నారా అన్నట్లుండే పెద్ద పెద్ద కైవారంతో ఉన్న దేవతా వృక్షాలు, గోమతీ నది, శ్రీ చక్ర తీర్థం ఇత్యాది ఎన్నో గొప్ప గొప్ప విశేషాలతో ఉన్న ప్రదేశం గొప్ప సాధనా క్షేత్రం. ఏదో చూసి వెళ్ళిపోదాం అనుక్కునేలాటి క్షేత్రం మాత్రం కాదు.ఐనా సరే, ఒక్కసారి ఇందులో ప్రవేశిస్తే చాలు "రుజో హరం యస్య రజా పవిత్రం తేజోమయం యస్య తమసా పురస్తాత్..." నైమిశారణ్యంలోని రజస్సు (ధూళి, మన్ను, మట్టి) తాకగానే సకల పాపాలు హరించుకుపోతాయట, చక్రతీర్థంలో స్నానం చేసిన భక్తులు, అక్కడి జానపదులు తడిబట్టలతో అడుగడుగు దండాలు పెడుతూ చక్రతీర్తానికి ప్రదక్షిణ చేస్తుంటారు... నైమిశారణ్య క్షేత్రానికి కూడా అరుణాచల గిరి ప్రదక్షిణ లాగ చేస్తారు కానీ అడవి ప్రాంతం కావడం మూలాన అక్కడి వారే చేస్తూంటారు, సింహాచల క్షేత్రప్రదక్షిణోత్సవంలాగా నైమిశారణ్యంలో ఏటా ఫాల్గుణ శుక్ల పంచమి నాడు చేస్తారని అక్కడి వారు చెప్పారు. సనాతన ధర్మంలో చరించే ప్రతి ఒక్కరూ నైమిశారణ్య క్షేత్రానికి వచ్చి చక్రతీర్థంలో మునకలు వేయవలసిందే, చక్ర స్నానం చేసి ఒడ్డున ఉన్న యజ్ఞవరాహస్వామిని దర్శించాలి అందువల్ల అపార పాప హరం, కలిదోష హరం, యజ్ఞఫలితమూ కలుగుతాయని పెద్దల వాక్కు. ఈ దివ్య ధామానికి వచ్చి ప్రతి ఒక్కరూ కనీసంలో కనీసం ఒకరోజైనా నిద్ర చేసి అనుష్ఠానాదులు చేసుకొని, ప్రత్యేక దీక్షలు, మంత్రాలు ఉంటే ఇక్కడ సాధన చేసుకోవలసిందే ఎందుకంటే ఇది సిద్ధ క్షేత్రం. అందుకే వ్యాసులు కలి స్సాధుః అన్నారు ఇందువల్లనే కదా మనకి నైమిశారణ్యమనే గొప్ప క్షేత్రం దొరికింది.గోస్వామి తులసీదాసు గారి మాటలలో “తీర్థ వర నైమిశ్ విఖ్యాతా! అతి పునీత్ సాధక్ సిద్ధిధాతా!!” అని అన్నారు. భూమండలంలో ఉన్న అన్ని తీర్థాలూ క్షేత్రాలుకలిసి పెళ్ళివారి ఊరేగింపుగా కదిలి వస్తే అందులో ముఖ్యమైనదీ మధ్యలో ఉండి అందరూ చూడాలనుక్కునేదీ ఐన వరుని స్థానంలో ఉండేది నైమిశారణ్యం. ఇది అతి పునీతమైనది సమస్త సాధకులకీ సిద్ధినొనరించే క్షేత్రముగా విరాజిల్లుతోంది.వ్యాస, శుక, సూత, శౌనకాది మహర్షులు 88వేల మంది వారి వారి శిష్యగణాలు, అందులో శౌనకాదులు కులపతులు (11 వేల మంది శిష్యులను పోషిస్తూ వేదవేదాంగాలను బోధించేవారిని కులపతి అంటారు) దీర్ఘ సత్ర యాగం (1000 సంవత్సరాలు) చేసిన స్థలం అందునా యాగం జరిగిన చోట అన్ని వేల మందికీ అన్నదానం జరిగిన ప్రదేశం. అంత గొప్ప గొప్ప మునులు మహర్షులు, రాజర్షులు నడయాడిన ప్రదేశం దేవతలు మెచ్చి దర్శనమిచ్చే ప్రదేశం నైమిశారణ్యం.
*సర్వేజనాః సుఖినోభవంత*
🪷🪷🪷🪷🪷🪷🪷🪷
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)
నిరంకుశ రాచరిక పాలన,దొరల దాష్టీకం అంతమైన సందర్భం భారతావనిలో విలీనంతో మొదలైన ప్రజాస్వామిక ప్రస్థానం తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజాపాలనకు అడుగులు పడిన రోజు సెప్టెంబరు 17..ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటూ..
ప్రజాపాలనలో జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం.. రాష్ట్ర ప్రజలందరికీ
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు💐...
తమ విశ్వసనీయ
_*కప్పాటి పాండురంగా రెడ్డి*_
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚
#తెలంగాణ #ప్రజాపాలన
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)
విశ్వాన్ని మలచిన సృష్టికర్తగా భగవానుడు విశ్వకర్మను పూజిస్తాం. సకల కళలకు, సృజనాత్మకతకు అధినేత, మానవ మనుగడకు అవసరమైన రకరకాల వృత్తులకు ఆద్యుడు, నాగరికతకు మూలపురుషుడు భారతీయ సంస్కృతిలో ప్రాచీన యంత్ర, వాస్తుశాస్త్ర నిపుణుడు, దేవశిల్పి, స్వర్గలోకాన్ని, ద్వారకా నగరాన్ని, పాండవుల మయసభను ఇలా మరెన్నో అద్భుత కట్టడాలను నిర్మించిన
సృజనాత్మక నిర్మాణానికి ప్రతీక, శిల్పకళా ప్రసిద్ధుడు, దేవశిల్పి తినే కంచం నుండి పడుకొనే మంచం వరకూ అన్ని సృష్టించిన మహా శిల్పి ప్రపంచం లో ప్రముఖ హిందూ దేవతలు దేవాలయాలు శిల్పాలు ఆన్ని విశ్వకర్మ సృష్ఠియే.. దేవశిల్పి
*"భగవాన్ విశ్వకర్మ"* జయంతి శుభాకాంక్షలు🙏..
తమ విశ్వసనీయ
_*కప్పాటి పాండురంగా రెడ్డి*_
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్📚
#🙏విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు🎉
#🌅శుభోదయం
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*సాధన*
➖➖➖✍️
*🏔️గ్రద్ద జీవితం🦅*
గద్ద అనగానే మనకు ఎప్పుడూ కోడి పిల్లలను ఎత్తుకుపోయే దానిగా లేదా మనుషులను భయపెట్టే ఒక పక్షిగా మాత్రమే తెలుసు.
ఇంకా గద్దలు మనుషుల కళేబరాలని పీక్కు తింటాయని కథనాలు వింటుంటాం.
కానీ గద్ద జీవితం మనకు ఒక జీవిత పాఠాన్ని చెబుతుందని ఎంత మందికి తెలుసు?
గద్ద జీవితకాలం 70ఏళ్ళు, ఈ జాతి పక్షుల్లో ఎక్కువ జీవితకాలం బ్రతికేది గద్దే. అయితే గద్దకి 40ఏళ్ళు పూర్తి అయ్యేసరికి దాని గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు.
పొడవైన దాని ముక్కుకొన చివర వొంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి సహకరించదు.
ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై... చురుకుగా ఎగరడానికి సహకరించవు.
ఆ సమయంలో దాని ముందున్నవి రెండే లక్ష్యాలు.
ఒకటి ఆహారాన్ని సంపాదించుకోలేక శుష్కించి మరణించడం లేదా బాధాకరమైనా సరే తనను తాను మార్చుకోవడం.
ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ఏ జీవి అయినా… ఎంత క్షీణ దశకు వచ్చినా బ్రతకాలనే అనుకుంటుంది.
అలాగే, గద్ద కూడా బ్రతకాలనే అనుకుంటుంది.
మరి గద్ద ఏవిధంగా తనను తాను మార్చుకుంటుంది ఒక్కసారి చూద్దాం….
గద్దకు ఈ మార్పు చాలా భాదాకరమైనది. ఈ మార్పు దాదాపు 150 రోజుల ప్రక్రియ. ఈ మార్పు కోసం గద్ద తనకు అందుబాటులో ఉన్న ఒక ఎతైన కొండను తన స్థావరంగా చేసుకుంటుంది. అక్కడ పెరిగిపోయిన తన ముక్కుకొనను కాలిగోళ్ళ మధ్య పెట్టుకొని ఎంతో బాధ కలిగినా నెమ్మదిగా వొలిచేసుకుంటుంది.
ఇలా వదిలించుకున్న ముక్కు కాస్తా మళ్ళీ కొత్తగా వచ్చి ముక్కు పదునుగా పెరిగే వరకు ఎదురుచూస్తుంది. అలాగే పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్ళను వదిలించుకుంటుంది. ఇక కొత్త గోళ్ళు పెరిగిన తర్వాత వాటి సహాయంతో తన రెక్కలకు బరువైన పాత ఈకలను పీకేస్తుంది. అలా బరువుగా ఉన్న తన రెక్కలను తేలికగా మార్చుకుంటుంది.
ఇలా 5నెలలు బాధాకరమైన కృషితో సాధించుకున్న పునర్జన్మతో మరో 30ఏళ్ళు హాయిగా బ్రతుకుతుంది.
ఈ సృష్టిలో మనం బ్రతకాలంటే మార్పు అనేది చాలా అత్యవసరం అనే జీవిత సత్యాన్ని, గద్ద జీవించి మనల్ని కూడా అలా జీవించమని బోధిస్తుంది.
ఇలానే ప్రతీ మానవుడికి కూడా జీవించాలనే ఉంటుంది.
కాని జీవితాన్నే మార్చే ధ్యానసాధన మాత్రం 1 గంట చేయలేము. జీవితం మాత్రం కావాలి.
ఒక పక్షి 150 రోజుల కఠోర సాధనతో మరో 30 సంవత్సరాల వయస్సు పెంచుకుంది.
పాత సామెత ఒకటి ఉంది కుండలో ఉన్న అన్నం కుండలోనే ఉండాలి, అమ్మాయి బొద్దుగా ఉండాలి అని.
అలానే మనం ధ్యానం చేయము కాని ఆరోగ్యం,ఆనందం మనకు కావాలి.
ఎలా వస్తుంది? ఎక్కడ నుంచి వస్తుంది??
ఒక పక్షి సాధన చేత మరో పునర్జన్మ తెచ్చుకున్నట్టుగా..
మనమూ కఠోర ధ్యాన సాధనచేద్దాం.. మానవులుగా ఉన్న మనం మాధవులు గా మారుదాం! ఆరోగ్యంగా ఆనందంగా జీవించుదాం.
తమ విశ్వసనీయ
కప్పాటి పాండురంగా రెడ్డి
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)
#గ్రద్ద.. 🦅