https://youtube.com/watch?v=zYDmdQh5jBU&si=lUDDiMFK62VhWKo2 #పవన్ #చంద్రబాబు
https://www.facebook.com/share/v/17D7gS1aJz/ #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥
#విజయ్ సభలో తొక్కిసలాట
*పదండి పోదాం… తొక్కుకుంటూ వాడి కాలికి తోలుచెప్పులమవుదాం…❗*
September 29, 2025😭
ఎవడు ఎంత పరిహారాలు ఇచ్చినా పోయిన ప్రాణాలు వెనక్కి రావు… వెల్లువెత్తిన ప్లాస్టిక్ సంతాపాలు ఎవడి కన్నీళ్లూ తుడవవు, ఆ కుటుంబాలను నిలబెట్టవు…
నాలుగు రోజులు ఒకడికొకడు బ్లేమ్ గేమ్… ఏవేవో కుట్రలట.., బురదలు, విచారణలు, మీడియా పుంఖానుపుంఖాల కథనాలు… అంతే… ఈ రాజకీయాల క్షుద్రపూజల్లో ఎన్ని బలితర్పణాలు..? బాధ్యుడికేం బాగానే ఉంటాడు… బాధితుడి బాధ వాడికెందుకు..? ఈ కన్నీళ్లే అక్షింతలుగా ఎదుగుతూనే ఉంటాడు…
వాడి పేరు అర్జునుడు కావచ్చు, వాడి పేరు విజయుడు కావచ్చు, మరొకడు కావచ్చు, రేపు ఇంకొకడు రావచ్చు… వాడిదేం పోయింది..? మబ్బుల్లో తిరిగే నయా దేవుళ్లు… ఛ, వాళ్లను దేవుళ్లను చేసింది మనమే కదా… అసలు తప్పు మనది… అసలు బాధ్యులం మనమే…
మనదే ఓ సామూహిక ఉన్మాదం… మాస్ హిస్టీరియా… వాడేమైనా మొక్కులు తీరుస్తాడా..? వరాలు ఇస్తాడా..? వాడి ఒక్క చల్లని చూపు కోసం ఏమిటీ ఈ మూఢభక్తి…? ఏమిటీ ఈ మూర్ఖాభిమానం..? ఈ తొక్కిసలాటల్లో మన ప్రాణాల్ని మనమే తీసుకుంటున్నాం… ఆ చిల్లర దేవుళ్లకు మనకు మనమే స్వీయ బలి…
ఎవడు బాధ్యుడు..? ఎవడు నిందార్హుడు..? ఫేస్‌బుక్ మిత్రుడు దాయి శ్రీశైలం చెబుతున్నట్టు… బతుకుల్ని బాటగా వేసిన మనమా..? ఆ బాటలో బాజాప్తా నడుస్తున్న వాడా..?
భుజాల మీద మోస్తున్న మనమా..? ఆ భుజాలనెక్కి కూర్చుని సవారీ చేస్తున్న వాడా..?
ఏందీ తొక్కిసలాట.? ఎలా జరుగుతోంది పదే పదే.?
ఎందుకుపోతున్నాయి మన ప్రాణాలు.. పదులు ఇరవైలు..?
ఒక దిక్కు లోకమంతా లీడర్లను.. హీరోలను బట్టలిప్పి.. బజార్లకు గుంజి తరిమి తరిమి కొడుతుంటే..
మనమేమో.. మన బట్టలే ఇప్పుకొని.. మన బతుకుల్నే బజారుపాలు చేసుకుంటున్నాం…
చర్మాన్ని వొలిసిస్తున్నాం… చెప్పులమై తరిస్తున్నాం…
గుండెల మీద పచ్చబొట్లు.. గుండీలు చింపుకునే కట్టుబాట్లు..
ఎవడు ఎవడికి హీరో.? ఎవడు ఎవనికి లీడరు.?
అమ్మయ్యకు అన్నంబెట్టక.. అభిమాన హీరోకు కనుగుడ్లు పీకిచ్చే కల్చరెక్కడిది.?
హీరో సినిమా తీస్తే.. లీడర్ పార్టీ పెడితే.. సక్సెసై సన్మాన సభలు పెడితే నీకెందుకు ఉబలాటం.. ఉరుకులాట.?
వాడుకదా సంబరాలు చేసుకోవాల్సింది.. వాడివి కదా ప్రాణాలు కిందా మీదా అయ్యేవి.?
ఎవడో కొట్టిన హిట్టుకు నువ్వెందుకు చింపుకుంటున్నవ్.? ఎవడో పెట్టే పార్టీ కోసం నువ్వెందుకు సంపుకుంటున్నవ్.?
తొక్కుకుంటూ.. కుక్కుకుంటూ.. రక్కుకుంటూ.. ప్రాణం పణంగా పెడ్తందుకు నువ్వే ఉన్నవా గోశిలోడవు.?
వాడొచ్చేదే మన సావుల మీద సంపద కూడబెట్టుకునేందుకు గదా.?
కులమనీ.. మతమనీ.. నీతి అనీ.. జాతి అనీ.. రెచ్చగొట్టి చిచ్చుపెట్టి చిల్లరగాళ్లను చేసేందుకే గదా.?
మన మెదళ్లను పొల్యూట్ చేసి.. సెల్యూట్ కొట్టించుకొని కచ్చకచ్చ ఒర్లి.. కాకిరిబీకిరి చేసే కదా అంతా డిప్యూటీ సీఎంలు.. సీఎంలు అయింది.?
అనుభవమైనంక కూడా ఈ ఆత్మార్పణలెందుకు మనకు.?
అర్థమైనాక కూడా ఈ ఆశలెందుకు మనకు.?
నువ్వు పోతే పోయినవ్… చిన్న పోరగాళ్లను తీసుకుపోవడమేందిరా..?
వాళ్లను బలి ఇవ్వడమేందిరా..?
ఆడోళ్లను వెంటేసుకుని ఉరుకుడేందిరా..?
ఐనా వాళ్లు హీరోలేందిరా..?
మన బతుకుల్ని బలిగోరే బడా రియల్ విలన్లురా…
వాడెవడో ఇచ్చిన పిలుపుకు దిక్కయి..
నీ భార్యా పిల్లల్ని దిక్కులేని వాళ్లను చేసుడెందుకు.?
మనకిది అర్థంకానంత వరకు ఇట్లనే తొక్కిసలాటలో సస్తూనే ఉందాం..
వాని కాలుకు తోలు చెప్పులమై బతుకుతానే ఉందాం.!!
చచ్చీ బతుకుదాం, బతుకుతూ చద్దాం…
#OG♥️ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🎬మూవీ ముచ్చట్లు
*ఇప్పటికీ జస్ట్ తెలుగు స్టార్… పాన్ ఇండియా ఇంకా దూరందూరమే…❗*
September 29, 2025💃
వేదిక మీద కత్తులు కటార్లు పెట్టుకుని తిరిగినా… ఎంత హైప్ క్రియేట్ చేసినా… మార్కెటింగ్ జోరుతో ఎంత బజ్ క్రియేట్ చేసినా… పవన్ కల్యాణ్ ఈరోజుకూ తెలుగు హీరో మాత్రమే… నార్త్ బెల్ట్ మాత్రమే కాదు, తమిళ, కన్నడ జనం కూడా తనను పాన్ ఇండియా హీరోగా యాక్సెప్ట్ చేయడం లేదు…
ఇప్పటికే 200 కోట్ల వసూళ్లు సాధించిన ఓజీ సినిమా తొలి ఫలితాల్ని విశ్లేషిస్తే… ఈ వ్యాఖ్య నిజమని స్పష్టమవుతుంది… వినడానికి, చదవడానికి, జీర్ణం చేసుకోవడానికి కటువుగానో, పరుషంగానో అనిపించినా ఇది రియాలిటీ…
నాలుగు రోజుల్లో 200 కోట్లు… ఓవర్‌సీస్ 50 కోట్లు, తెలంగాణ, ఆంధ్రా 150 కోట్లు… మరి తమిళం, హిందీ, కన్నడం..? ఉత్తదే… పరిగె ఏరుకున్నట్టు అరకొర… మరీ తీసికట్టు యవ్వారం… చెప్పుకుంటే నగుబాటు… అవును, ఒక ఊరి పట్వారీ మరో ఊరిలో మస్కూరిలా…
హిందీ మార్కెట్‌లో నాలుగు రోజుల్లో మరీ 2 కోట్లే, అదీ గ్రాస్… వాటాలు గట్రా తీసేస్తే ఒక కోటి… కన్నడం అయితే మరీ దారుణం…. రోజుకు 3 లక్షలు, 5 లక్షలు… నాలుగో రోజూ అదీ లేదు, తీసేశారు… పోనీ, తమిళం చూద్దామా..? నాలుగు రోజుల్లో 76 లక్షల గ్రాస్… సో, ఓజీ అనేది పాన్ ఇండియా కాదు, జస్ట్, ఓ తెలుగు సినిమా… అంతే…
ఇక్కడ మరొకటీ చెప్పుకోవాలి… సోకాల్డ్ సినిమా పండితులు ఎంతమేరకు బయ్యర్లకు అమ్మారు, నికరంగా ఎన్ని వసూళ్లు వస్తే సినిమా సక్సెసో ఫ్లాపో నిర్ధారించేస్తున్నారు… అది తప్పు… నిర్మాణ వ్యయం ఎంత..? బయ్యర్లకు ఎంతకు అమ్మారు..? వాళ్లకు ఎంత వచ్చింది..? ఓటీటీ గట్రా కలిపితే మొత్తానికి నిర్మాత మునిగాడా తేలాడా అనేది చూడాలి…
అలాగే వసూళ్ల ప్రచారాలు చాలాసార్లు ఉత్త హంబగ్… అసలు లెక్కలు వేరు… గ్రాస్‌లో చాలా మైనసులు తీసేస్తే నికరంగా మిగిలేదీ తక్కువే… సాధారణంగా తొలివారం సినిమా హైప్ కోసం అబద్ధపు వసూళ్ల లెక్కల్ని కూడా పబ్లిసిటీకి వాడుతుంటారు… ఓజీ అని కాదు, సాధారణంగా పెద్ద సినిమాలన్నింటికీ ఇదే కథ…
సరే, ఇదే సందర్భంగా మరొకటీ చెప్పుకుందాం… హరిహర వీరమల్లు… అసలు ఫ్యాన్స్‌కే నచ్చలేదు… జనం గుడ్డితనం మీద నమ్మకంతో వదిలిన ఓ నాసిరకం సరుకు అది… మొత్తం 115 కోట్ల వసూళ్లు అయితే అందులో తెలుగు వాటాయే 87 కోట్లు… నిర్మాణవ్యయంతో పోలిస్తే డిజాస్టర్ అది… ఇక హిందీ ప్రేక్షకులు 11 రోజుల్లో ఇచ్చింది జస్ట్ 33 లక్షలు… కన్నడంలో అయిదే రోజులు, అయిదే లక్షలు, ఫట్… తమిళంలో 8 రోజులు, 19 లక్షలు… మలయాళం అయితే మరీ ఘోరం… ఆరే రోజులు, 15 లక్షలు… ఖేల్ ఖతం…
అంటే, పవన్ కల్యాణ్‌ను పాన్ ఇండియా స్టార్‌గా ఇతర భాషా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం లేదు… ఒక ప్రభాస్, ఒక జూనియర్, ఒక రాంచరణ్, ఒక యశ్… చివరకు నిఖిల్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, తేజ సజ్జా కూడా పాన్ ఇండియాకు ఘనంగానే పరిచయం అయ్యారు… ఇదే కాదు, అసలు అత్తారింటికి దారేది సినిమా తరువాత పవన్ కల్యాణ్ ఇదీ నా సినిమా అని కాలరెగరేసే సినిమా ఏది అసలు..?!
ఏక్‌సేఏక్ ఫ్లాప్..!!
#ప్రపంచ హృదయ దినోత్సవం❤️
Bonjour 🙏 Have a Blessed DAY and a Safe WEEK 🌞🪷
https://youtube.com/watch?v=uViQzOzNZqk&si=VystAXeXYPmkK5B5 #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్ #అసెంబ్లీ సమావేశాలు.. 🤠